MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Goa Villages : గోవా అంటే బీచ్‌లే కాదు.. ఈ 10 ప్రశాంతమైన పల్లెలు చూస్తే వావ్ అనాల్సిందే!

Goa Villages : గోవా అంటే బీచ్‌లే కాదు.. ఈ 10 ప్రశాంతమైన పల్లెలు చూస్తే వావ్ అనాల్సిందే!

గోవా అంటే కేవలం అందమైన సముద్రతీరాలు, ఫారెన్ కల్చర్ తో కూడిన పార్టీలే కాదు రణగొణ ధ్వనులకు దూరంగా, ప్రకృతి అందాలతో కూడిన అద్భుతమైన పల్లెలు ఉన్నాయి. స్థానిక సంస్కృతి, ప్రశాంత వాతావరణం ఇక్కడ పర్యాటకులను ఆకట్టుకుంటాయి. అలాంటి టాప్ 10 గోవా పల్లెలివే..

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 03 2026, 04:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గోవాలో అందమైన గ్రామాలు
Image Credit : Gemini AI

గోవాలో అందమైన గ్రామాలు

  1. దివార్ ఐలాండ్ (Divar Island)

ఓల్డ్ గోవాకు దగ్గర్లో ఉంటుంది దివార్ ఐలాండ్. ఫెర్రీలో చిన్న ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ ద్వీపంలోని పచ్చని పొలాలను చూస్తూ, సన్నని రోడ్లపై సైకిల్ తొక్కడం ఓ గొప్ప అనుభూతి.

2. లౌటోలిమ్ (Loutolim)

లౌటోలిమ్ గ్రామంలో అసలైన గోవా సంప్రదాయ ఇళ్లను చూడొచ్చు. కొబ్బరి తోటలు, ప్రశాంతమైన పరిసరాలు గోవా వారసత్వ సంపదను కళ్లకు కడతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పోర్చుగీస్ కాలంనాటి కాలనీలు, నీటిలో మునిగిన గ్రామాలు
Image Credit : Lamrinhotels

పోర్చుగీస్ కాలంనాటి కాలనీలు, నీటిలో మునిగిన గ్రామాలు

3. అల్డొనా (Aldona)

మాపుసా నది ఒడ్డున ఉన్న అందమైన గ్రామం అల్డోనా. ఇక్కడ పోర్చుగీస్ కాలం నాటి ఇళ్లు, ప్రశాంతమైన వాతావరణం మనసును కట్టిపడేస్తాయి. ఫొటోలు దిగడానికి, సరదాగా నడవడానికి ఈ ఊరు చాలా బాగుంటుంది.

4. కుర్ది (Kurdi OR Curdi)

కుర్ది గ్రామం దక్షిణ గోవాలో ఉంది. ఇది సలౌలిమ్ డ్యామ్ నీటిలో మునిగిపోయిన ఊరు. వేసవిలో డ్యామ్‌లో నీటి మట్టం తగ్గినప్పుడు ఈ గ్రామం బయటపడుతుంది. అడవులు, కొండల మధ్య ఉన్న ఈ శిథిల గ్రామం చరిత్రను, ప్రశాంతతను పంచుతుంది.

Related Articles

Related image1
Goa Temple: గోవా వెళ్తే బీచ్ కాదు.. ఈ 400 ఏళ్ల నాటి టెంపుల్ చూడాలి.. అక్కడ స్పెషాలిటీ ఇదే
Related image2
IRCTC Goa Tour : హైదరాబాద్ టు గోవా ప్లైట్ జర్నీ .. తెలుగోళ్ల కోసమే 4 రోజుల టూర్ ప్యాకేజీ, అదీ బడ్జెట్లోనే
35
గుహలు, నదులు, ప్రకృతి అందాలతో గోవా గ్రామాలు
Image Credit : Pelago

గుహలు, నదులు, ప్రకృతి అందాలతో గోవా గ్రామాలు

5. చందోర్ (Chandor)

చందోర్ గ్రామం చారిత్రకు, వారసత్వానికి ప్రసిద్ధి. ఇక్కడ వందేళ్ల నాటి పురాతన భవనాలు, పచ్చని పరిసరాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

6. రివోనా (Rivona)

గుహలు, నదులు, ప్రకృతి అందాలకు రివోనా పెట్టింది పేరు. గోవాలోని రద్దీ ప్రాంతాలకు దూరంగా ప్రశాంతంగా గడపాలనుకునేవారికి ఇది సరైన చోటు. ట్రెక్కింగ్ చేసేవారికి రివోనా ఒక అద్భుతమైన ప్రదేశం.

45
గోవాలో కోనసీమ అందాలు
Image Credit : Prokerala

గోవాలో కోనసీమ అందాలు

7. క్వెపెం (Quepem)

క్వెపెం గ్రామం చుట్టూ అడవులు, నదులు ఉన్నాయి. ఇక్కడి జలపాతాల వల్ల ఈ ప్రాంతం పర్యాటకులలో బాగా ప్రాచుర్యం పొందింది.

8. కాన్సౌలిమ్ (Cansaulim)

కాన్సౌలిమ్ బీచ్ చాలా ఫేమస్. కానీ ఆ ఊరు కూడా ఎంతో అందంగా ఉంటుంది. ఊరిలో ఉన్న సరస్సులు, గాలికి ఊగే తాటి చెట్లు, పచ్చని పొలాలు ప్రశాంతమైన అనుభూతినిస్తాయి.

55
గోవా స్టైల్ గుడిసెలు, పురాతన ఆలయాలతో గ్రామాలు
Image Credit : Hinterscapes

గోవా స్టైల్ గుడిసెలు, పురాతన ఆలయాలతో గ్రామాలు

9. ఓలాలిమ్ (Olaulim)

ఉత్తర గోవాలోని ఓలాలిమ్ గ్రామం వరి పొలాలు, మడ అడవులు, బ్యాక్ వాటర్స్‌తో ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ ఎన్నో రకాల పక్షులు కనిపిస్తాయి. గోవా స్టైల్ గుడిసెలు, ప్రశాంతమైన గ్రామీణ వాతావరణం ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తాయి.

10. తంబ్‌డి సుర్లా (Tambdi Surla)

పశ్చిమ కనుమలలో ఉన్న తంబ్‌డి సుర్లా, పురాతన ఆలయం, దట్టమైన అడవి, ట్రెక్కింగ్ మార్గాలకు ప్రసిద్ధి. ఇది గోవాలోని అత్యంత అందమైన సహజ ప్రదేశాలలో ఒకటి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Earrings: చీరల మీదకు అదిరిపోయే చాంద్ బాలీ ఇయర్ రింగ్స్
Recommended image2
Kitchen Tips: గ్యాస్ స్టవ్ దగ్గర ఈ వస్తువులను పొరపాటున కూడా పెట్టొద్దు!
Recommended image3
Sri krishnashtami: కృష్ణాష్టమి రోజు ఇంటి ముందు కృష్ణుడి పాదాలు ఎందుకు వేయాలి?
Related Stories
Recommended image1
Goa Temple: గోవా వెళ్తే బీచ్ కాదు.. ఈ 400 ఏళ్ల నాటి టెంపుల్ చూడాలి.. అక్కడ స్పెషాలిటీ ఇదే
Recommended image2
IRCTC Goa Tour : హైదరాబాద్ టు గోవా ప్లైట్ జర్నీ .. తెలుగోళ్ల కోసమే 4 రోజుల టూర్ ప్యాకేజీ, అదీ బడ్జెట్లోనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved