MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Kitchen Gadgets: రూ.100 లోపు దొరికే బెస్ట్ కిచెన్ గ్యాడ్జెట్స్.. వీటితో మీ పనులు చాలా ఈజీ!

Kitchen Gadgets: రూ.100 లోపు దొరికే బెస్ట్ కిచెన్ గ్యాడ్జెట్స్.. వీటితో మీ పనులు చాలా ఈజీ!

Kitchen Gadgets: వంటగదిలో పని ఎంత త్వరగా పూర్తి చేయాలనుకున్నా.. కొన్ని వస్తువులు అందుబాటులో లేకపోతే పని ఆలస్యం అవుతుంటుంది. అయితే, తక్కువ ఖర్చుతో లభించే కొన్ని స్మార్ట్ కిచెన్ గ్యాడ్జెట్స్‌తో పనులను మరింత సులభంగా చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Oct 14 2026, 06:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
వంద రూపాయల్లోపు దొరికే కిచెన్ టూల్స్
Image Credit : AI

వంద రూపాయల్లోపు దొరికే కిచెన్ టూల్స్

వంటగదిలో పనులన్నీ సులభంగా పూర్తి చేయడానికి ఖరీదైన కిచెన్ గ్యాడ్జెట్స్ కొనాల్సిన అవసరం లేదు. మార్కెట్‌లో రూ. 100 లోపే లభించే కొన్ని చిన్న చిన్న కిచెన్ టూల్స్‌తో సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. రోజువారీ వంట పనులను సులభతరం చేసే ఉపయోగకరమైన కిచెన్ గ్యాడ్జెట్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఓవెన్ గ్లౌవ్స్
Image Credit : Meesho

ఓవెన్ గ్లౌవ్స్

వంట చేసేటప్పుడు వేడిగా ఉన్న పాత్రలు, బేకింగ్ ట్రేలు, కుక్కర్ పాత్రలను పట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో చేతులకు వేడి తగలకుండా ఉండేందుకు ఓవెన్ గ్లౌవ్స్ ఉపయోగపడతాయి. వీటికి వేడిని తట్టుకునే ఫ్యాబ్రిక్, సిలికాన్ గ్రిప్‌లు ఉంటాయి. వీటి సహాయంతో వేడిగా ఉన్న పాత్రలను పట్టుకోవడం చాలా ఈజీ. ముఖ్యంగా ఓవెన్‌లో కేకులు, బిస్కెట్లు తయారు చేసేవారికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయి.

37
డ్రై ఫ్రూట్ కట్టర్ అండ్ స్లైసర్
Image Credit : Meesho

డ్రై ఫ్రూట్ కట్టర్ అండ్ స్లైసర్

బాదం, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్‌ను చిన్న ముక్కలుగా కట్ చేయడానికి సాధారణంగా కత్తిని ఉపయోగిస్తుంటాం. కానీ చిన్న ముక్కలను ఒకే పరిమాణంలో కట్ చేయడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో డ్రై ఫ్రూట్ కట్టర్ అండ్ స్లైసర్ ఉపయోగపడుతుంది. స్వీట్లు, కేకులు, పాయసం, ఖీర్, ఐస్‌క్రీమ్ వంటి వంటకాలపై డ్రై ఫ్రూట్స్‌ను అలంకరణగా ఉపయోగించాలనుకునేవారికి ఇది పనికొస్తుంది.

47
కోకోనట్ ఓపెనర్
Image Credit : Meesho

కోకోనట్ ఓపెనర్

కొబ్బరి బోండంలోని నీటిని ఈజీగా బయటకు తీయడానికి ఈ టూల్ చక్కగా పనిచేస్తుంది. ఈ టూల్ సహాయంతో కొబ్బరిబోండానికి ఈజీగా రంధ్రం చేయవచ్చు. చిన్న సైజులో ఉండే ఈ టూల్‌ తరచూ కొబ్బరి నీరు తాగేవారికి, వంటల్లో కొబ్బరిని ఉపయోగించేవారికి ఉపయోగకరంగా ఉంటుంది.

57
ఆరెంజ్ పీలర్
Image Credit : Meesho

ఆరెంజ్ పీలర్

నారింజ, బత్తాయి వంటి పండ్ల తొక్కలను చేతులతో తీయడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. గోళ్లకు తొక్క అంటుకోవడం లేదా పండు గుజ్జు దెబ్బతినడం వంటివి జరుగుతాయి. ఈ పనిని సులభతరం చేయడానికి ఆరెంజ్ పీలర్ ఉపయోగపడుతుంది. సాధారణంగా ఇది చిన్న ప్లాస్టిక్ టూల్‌లా ఉంటుంది. పండు తొక్కపై చిన్న కోత పెట్టేందుకు ప్రత్యేక అంచు ఉంటుంది. దాని సహాయంతో తొక్కను ఈజీగా తీయవచ్చు.

67
మల్టీ యూజ్ బ్రెష్
Image Credit : Meesho

మల్టీ యూజ్ బ్రెష్

వంటగదిలో పాత్రలు, బాటిల్స్, చిన్న చిన్న కంటైనర్లను శుభ్రం చేయడానికి మల్టీ యూజ్ బ్రెష్ ఉపయోగపడుతుంది. గట్టి బ్రిసిల్స్ ఉన్న మోడల్స్ పాత్రలపై అంటుకున్న మురికిని తొలగించడంలో సహాయపడతాయి. చిన్న హ్యాండిల్ ఉన్న బ్రెష్‌లను సులభంగా పట్టుకుని ఉపయోగించవచ్చు.

77
ప్లాస్టిక్ ట్యాప్ ఫిల్టర్
Image Credit : Meesho

ప్లాస్టిక్ ట్యాప్ ఫిల్టర్

వంటగదిలో సింక్ ట్యాప్ నుంచి నీరు వేగంగా పడటం వల్ల చుట్టుపక్కల నీళ్లు చిందుతుంటుంది. ఈ ఇబ్బందిని తగ్గించడానికి ప్లాస్టిక్ ట్యాప్ ఫిల్టర్ లేదా ట్యాప్ ఎరేటర్ ఉపయోగపడుతుంది. ఇది ట్యాప్‌కు అమర్చే చిన్న పరికరం. ఇవి నీటి ప్రవాహాన్ని సన్నగా, నియంత్రితంగా వచ్చేలా చేస్తాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anklet Designs: ఈ కాలం అమ్మాయిల మనసు దోచే పట్టీల డిజైన్లు
Recommended image2
Camphor: నార్మల్ కర్పూరానికీ, పచ్చ కర్పూరానికీ తేడా ఏంటి? దేనితో తయారు చేస్తారో తెలుసా?
Recommended image3
Sarees: అందరిలో ప్రత్యేకంగా కనిపించాలంటే ఈ శారీస్ బెస్ట్ ఆప్షన్!
Related Stories
Recommended image1
Train Travel Rules: ట్రైన్‌లో వెళ్లేటప్పుడు ఈ తప్పు చేస్తే రూ.5,000 ఫైన్, 6 నెలల జైలు!
Recommended image2
Dry Fish vs Dry Mutton: ఎండు చేపలు, ఎండు మటన్.. ఆరోగ్యానికి ఏది మంచిది? ఎవరు తినకూడదు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved