Chanakya Niti: ధనవంతులకీ, పేదలకు ఉన్న ఒకే ఒక్క తేడా ఇదే..చాణక్యుడు ఏమన్నారంటే..!
Chanakya Niti: డబ్బు సంపాదించడం అందరూ చేస్తారు. కానీ, అందరూ ధనవంతులు ఎందుకు కాలేరు? చాలా మంది పేదలుగా ఎందుకు మిగిలిపోతున్నారు? ధనవంతులకీ, పేదవారికీ ఉన్న తేడా ఏంటి? చాణక్యుడు ఏం చెప్పారు..?

చాణక్యుడు ఏమన్నాడంటే...
డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమూ.. ఆ డబ్బును తెలివిగా మేనేజ్ చేయడం కూడా అంతే ముఖ్యం. మన చుట్టూ ఉన్న సమాజంలో తక్కువ జీతంతో చాలా ఆనందంగా జీవించడమే కాదు.. ఆస్తులు కూడా కూడగడుతూ ఉంటారు. మరి కొందరు.. ఎక్కువ సంపాదించినా కూడా.. నెలాఖరు వచ్చే సరికి డబ్బులు చేతిలో లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. దీని కారణం కేవలం ఆదాయం మాత్రమే కాదు.. మన ఆలోచనా విధానం, చేసే ఖర్చులు, భవిష్యత్తు ప్రణాళికలు.. మరి.. ఆదాయంతో సంబంధం లేకుండా.. ధనవంతులు అవ్వాలంటే చాణక్యుడు చెప్పిన ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే..
సమస్యలు వస్తే ఏం చేయాలి..?
జీవితంలో ప్రతి ఒక్కరికీ సవాళ్లు, కష్టాలు ఎదురౌతాయి. కానీ, వాటిని స్వీకరించే విధానంలోనే అసలైన తేడా ఉంటుంది. ఓటమి ఎదురైనప్పుడు చాలా మంది పరిస్థితులను, కాలాన్ని నిందిస్తూ సాకులు చెబుతూ ఉంటారు. కానీ, అలా కాకుండా.. వచ్చిన సమస్యకు పరిష్కారం వెతికేవారు మాత్రమే.. జీవితంలో విజయం సాధిస్తారు. డబ్బు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఏదైనా డబ్బు సమస్య వస్తే.. కూర్చని బాధపడకుండా... పరిష్కరించే మార్గం ఆలోచించాలి. అప్పుడే.. ధనవంతులు అవ్వగలరు.
పొదుపు ముఖ్యం...
ఆదాయం ఎక్కువగా ఉన్నంత మాత్రాన ఆర్థిక భద్రత లభించదు. ఖర్చులపై సరైన పర్యవేక్షణ లేకపోతే ఎంత డబ్బు వచ్చినా కరిగిపోతుంది. అందుకే సంపాదన చిన్నదైనా బడ్జెట్ వేసుకుని, అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి నెలా క్రమం తప్పకుండా కొంత మొత్తాన్ని పొదుపు చేసే అలవాటు ఉన్నవారిని అత్యవసర పరిస్థితులు ఏమీ చేయలేవు. పొదుపు చేయాలంటే ఎక్కువ డబ్బు అవసరం లేదు. కొంచెం అయినా.. కంటిన్యూస్ గా సేవ్ చేయడం నేర్చుకోవాలి.
అసూయ పడొద్దు..
ఇతరుల ఎదుగుదలను చూసి అసూయపడటం లేదా వారితో పోల్చుకుని మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడం వల్ల సమయం, మానసిక ప్రశాంతత పాడవుతాయి. దానికి బదులుగా, వారు విజయం సాధించడానికి పడిన కృషి, సమయ పాలన, తీసుకున్న తెలివైన నిర్ణయాల నుండి పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇతరులతో పోటీ పడటం కంటే.. నిన్నటి మీకంటే నేటి మీరు ఎంత మెరుగ్గా మారారనే దానిపైనే దృష్టి పెట్టండి.
4. తొందరపాటు నిర్ణయాలు వద్దు..
రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవు. త్వరితగతిన ఫలితాలు రావాలనే ఆరాటంలో సరైన సన్నాహం లేకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ఆర్థిక రంగంలోనైనా, వృత్తి జీవితంలోనైనా నైపుణ్యం సాధించడానికి సమయం, సాధన , ఓర్పు చాలా అవసరం. తప్పుల నుండి నేర్చుకుంటూ నిలకడగా శ్రమిస్తే దీర్ఘకాలంలో గొప్ప విజయాలు మీ సొంతమవుతాయి.
5. తప్పును దాచకండి..
పొరపాట్లు జరగడం సహజం. అయితే పొరపాటు జరిగినప్పుడు ఇతరులపై నిందలు వేయడం వల్ల సమస్య తీవ్రమవుతుందే తప్ప పరిష్కారం దొరకదు. చేసిన తప్పును ధైర్యంగా అంగీకరించి, దానికి గల కారణాలను విశ్లేషించుకోవడం వల్ల మళ్లీ అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవచ్చు. సొంత అనుభవాల నుండి పాఠాలు నేర్చుకునే గుణమే మిమ్మల్ని మరింత బలవంతుడిగా తీర్చిదిద్దుతుంది.








