Wooden Sofa Vs Fabric Sofa: వుడెన్ సోఫా, ఫ్యాబ్రిక్ సోఫాల్లో ఏది బెస్ట్? అసలు తేడా ఇదే!
Wooden Sofa Vs Fabric Sofa: మీ ఇంట్లోకి కొత్త సోఫా కొనాలనుకుంటున్నారా? వుడెన్ సోఫా, ఫ్యాబ్రిక్ సోఫాల్లో ఏది ఎంచుకోవాలో తెలియట్లేదా? ధర, కంఫర్ట్, మెయింటెనెన్స్, మన్నిక విషయంలో ఈ రెండింటి మధ్య తేడాలేంటి? మీ ఇంటికి, బడ్జెట్‌కు ఏ సోఫా సరిపోతుందో చూద్దాం.

వుడెన్ సోఫా, ఫ్యాబ్రిక్ సోఫాల్లో ఏది బెస్ట్?
ఇంటి హాల్‌ను అందంగా మార్చడంలో, ఫ్యామిలీతో కలిసి రిలాక్స్ అవ్వడంలో సోఫాది కీలక పాత్ర. అయితే కొత్త సోఫా కొనేటప్పుడు చాలామందికి ఒక డౌట్ వస్తుంది. వుడెన్ సోఫా కొనాలా లేక ఫ్యాబ్రిక్ సోఫా కొనాలా.. రెండింటిలో ఏది బెస్ట్ అని ఆలోచిస్తుంటారు. మరి ఈ రెండు రకాల సోఫాల మధ్య తేడా ఏంటి? ఏ ఇంటికి ఏది సరిపోతుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మన్నిక విషయంలో ఏది బెస్ట్?
వుడెన్ సోఫా: టేకు, రోజ్‌వుడ్ లాంటి నాణ్యమైన చెక్కతో చేసే సోఫాలు ఎక్కువకాలం మన్నుతాయి. ఇవి త్వరగా పాడవవు, ఎంత బరువైనా తట్టుకుంటాయి.
ఫ్యాబ్రిక్ సోఫా: మోడ్రన్ డిజైన్లలో దొరికే ఫ్యాబ్రిక్ సోఫాల లైఫ్.. అందులో వాడే క్లాత్, ఫోమ్ క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. సరిగ్గా వాడుకుంటే 5 నుంచి 8 ఏళ్ల వరకు బాగానే ఉంటాయి.
కంఫర్ట్ విషయంలో ఏది బెస్ట్?
ఫ్యాబ్రిక్ సోఫా: హాయిగా వాలిపోవడానికి, ఎక్కువసేపు పడుకుని రిలాక్స్ అవ్వడానికి ఫ్యాబ్రిక్ సోఫాలు భలే ఉంటాయి. మెత్తటి కుషన్లు, బాడీకి తగ్గట్టుగా ఉండే డిజైన్ మంచి కంఫర్ట్ ఇస్తాయి.
వుడెన్ సోఫా: చెక్క సోఫాలు కాస్త గట్టిగా ఉంటాయి. కానీ వాటి మీద మెత్తటి కుషన్లు వేసుకుంటే కావాల్సినంత కంఫర్ట్ దొరుకుతుంది.
మెయింటెనెన్స్ విషయంలో ఏది బెస్ట్?
వుడెన్ సోఫా: దీన్ని మెయింటైన్ చేయడం చాలా ఈజీ. దుమ్ము పడితే పొడి గుడ్డతో తుడిచేస్తే సరిపోతుంది. మరకలు పడినా పెద్దగా టెన్షన్ ఉండదు.
ఫ్యాబ్రిక్ సోఫా: టీ, కాఫీ లాంటివి ఏమైనా పడితే క్లాత్ మీద మరకలు పడే ఛాన్స్ ఉంది. అందుకే దీన్ని తరచుగా వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయాలి. లేదా తీసి ఉతుక్కునే 'రిమూవబుల్ కవర్స్' వాడుకోవాలి.
రెండింటిలో ఏది బెస్ట్?
వుడెన్ సోఫా: ట్రెడిషనల్ ఇళ్లకు, రాయల్ లుక్ కోరుకునే వారికి వుడెన్ సోఫానే ఫస్ట్ ఛాయిస్. పైగా అన్ని రకాల వాతావరణాలకు ఇది సెట్ అవుతుంది.
ఫ్యాబ్రిక్ సోఫా: మోడ్రన్ ఇళ్లకు, కలర్‌ఫుల్ ఇంటీరియర్ డిజైన్లకు ఫ్యాబ్రిక్ సోఫాలు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి.
అయితే ఎక్కువ కాలం మన్నికగా ఉండాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, ట్రెడిషనల్ లుక్ కావాలి అనుకునేవారికి వుడెన్ సోఫా బెస్ట్. అలాగే మంచి కంఫర్ట్, మోడ్రన్ కలర్స్, మెత్తగా ఉండాలి అనుకునేవారు ఫ్యాబ్రిక్ సోఫా తీసుకోవడం మంచిది.








