Pillow: దిండు లేకుండా నిద్రపోతే ఏమౌతుంది?
దిండు లేకుండా నిద్రపోవడం వల్ల మనకు ఎంత ఆరోగ్యం లభిస్తుందో తెలుసా? దిండుతో నిద్రపోవడం శరీరంలోని అనేక భాగాలను వివిధ రకాలుగా ప్రభావితం చేస్తుంది.

ప్రతి ఒక్కరికీ నిద్రపోవాలంటే దిండు ఉండాల్సిందే. అంతలా దిండుకి ప్రజలు అలవాటు పడ్డారు. కొందరైతే తమకు ఎత్తు సరిపోలేదు అని రెండు దిండ్లు వేసుకొని పడుకుంటూ ఉంటారు. కానీ.. దిండ్లు వేసుకొని పడుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమ్యలు వస్తాయట. మరి, ప్రతిరోజూ అసలు దిండు లేకుండా నిద్రపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
1. మెడ నొప్పి తగ్గుతుంది
తప్పు దిండును ఉపయోగించడం వల్ల మెడకు సరిగ్గా మద్దతు లభించదు. దీని వల్ల కండరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి కలుగుతుంది. దిండు లేకుండా నిద్రపోతే మెడ సరిగా సర్దుకుని, రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీని వల్ల మీకు మెడ నొప్పి రాకుండా ఉంటుంది. అంతకముందు నొప్పి ఉన్నా, దిండు లేకుండా పడుకోవడం వల్ల ఆ నొప్పి తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
sleep
2. వెన్నునొప్పి నివారణ
ఎత్తైన దిండు వాడటం వల్ల వెన్నెముక వంగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది నిద్ర తర్వాత నొప్పి లేదా జిడ్డుదనం వంటి సమస్యలకు దారితీస్తుంది. దిండు లేకుండా నిద్రపోతే, వెన్నెముక నిటారుగా ఉండి, సుఖంగా నిద్రపోవచ్చు.
3. తలనొప్పికి వీడ్కోలు
దిండుతో తలకు రక్తప్రసరణ తగ్గి, ఆక్సిజన్ సరఫరా తగ్గే అవకాశం ఉంది. దీని వల్ల ఉదయం తేలికపాటి తలనొప్పి రావచ్చు. దిండు లేకుండా నిద్రపోతే ఈ సమస్య ఉండదు.
4. కడుపు మీద నిద్రపోయే వారికి ప్రయోజనం
చాలా మందికి బోర్లా పడుకునే అలవాటు ఉంటుంది. అలాంటి వారికి ఇలా దిండు లేకుండా పడుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల వెన్నెముక స్థిరంగా ఉండి ఒత్తిడి తగ్గుతుంది.
5. చర్మానికి లాభం..
దిండు లేకుండా పడుకోవడం వల్ల మీ అందం కూడా పెరుగుతుంది అంటే మీరు నమ్ముతారా? కానీ నిజం. మీ చర్మం ఆరోగ్యంగా మారుతుంది. నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. దిండులో ఉండే ధూళి, బ్యాక్టీరియా ముఖంపై మొటిమలు, ముడతలు కలిగించే ప్రమాదం ఉంది. దిండు లేకుండా నిద్రపోతే ఈ సమస్యలు తగ్గుతాయి. ముఖంపై మొటిమలు రాకుండా ఉంటాయి. అదేవిధంగా ముడతలు కూడా పడవు. యవ్వనంగా కనిపిస్తారు.
6. మానసిక ఆరోగ్యం మెరుగుదల
తలకు మంచి రక్తప్రవాహం జరగడం వల్ల మానసిక ప్రశాంతత, జ్ఞాపకశక్తి మెరుగవుతాయి. నిద్ర నాణ్యత కూడా పెరుగుతుంది.
ఫైనల్ గా..
దిండు లేకుండా నిద్రపోవడం ఒక చిన్న మార్పు అయినా, దీని ప్రభావం శారీరకంగా, మానసికంగా ఎంతో ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరి శరీర ధోరణి వేరు కావడంతో, దీన్ని స్వయంగా పరీక్షించి, మీకు సరిపడే విధంగా పాటించడం మంచిది.