Beetroot: ఇంట్లో బీట్‌రూట్ ఉంటే బ్యూటీపార్లర్‌కు వెళ్లాల్సిన అవసరమే లేదు
Beetroot: అందంగా కనిపించాలని అందిరకీ ఉంటుంది. అందుకోసం నెలలో ఒకటి రెండుసార్లు బ్యూటీ పార్లర్‌కి వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేస్తారు. కానీ ఇంట్లో బీట్‌రూట్ ఉంటే పార్లర్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. బీట్ రూట్ మీ అందాన్ని పెంచేస్తుంది.

బీట్ రూట్ తో అందం
బీట్ రూట్‌ను సూపర్‌ఫుడ్‌గా పిలుచుకుంటారు. దీన్ని తినడం వల్ల రక్త హీనత సమస్య తగ్గుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. అలాగే అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. బీట్‌రూట్ ఆరోగ్యానికే కాదు, చర్మానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో ఐరన్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న బీట్‌రూట్ తినడం వల్ల, ముఖానికి రాయడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మొటిమలు, నలుపుదనంతో పోరాడి చర్మానికి సహజమైన మెరుపును ఇవ్వడంలో బీట్ రూట్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
బీట్‌రూట్ జ్యూస్ తాగితే
ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు బీట్‌రూట్ జ్యూస్ తాగండి చాలు. రక్తంలోని విషపదార్థాలన్ని బయటికి పోతాయి. ఇది చర్మాన్ని లోపల నుంచి ఆరోగ్యంగా, సహజంగా కాంతివంతంగా చేస్తుంది. ఇక బీట్ రూట్ జ్యూస్ చేసేటప్పుడు అందులో ఒక క్యారెట్, లేదా దోసకాయ ముక్కలు కలిపి చేసి తాగితే ఇంకా మంచిది. క్యారెట్, దోసకాయ కూడా చర్మానికి మెరుపు అందిస్తుంది.
బీట్‌రూట్ ఫేస్ ప్యాక్
బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే బీట్ రూట్ ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఇందుకోసం ఒక చెంచా పెరుగు లేదా తేనెతో బీట్‌రూట్ రసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంట సేపు అలా వదిలేయాలి. తర్వాత సాధారణ నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల మొటిమల వల్ల అయిన మచ్చలు, పొడిదనం తగ్గిపోతాయి.
బీట్‌రూట్ స్క్రబ్
బీట్‌రూట్ రసాన్ని తీసుకుని అందులో ఓట్స్ పొడి, పంచదార కలిపి స్క్రబ్ లా తయారుచేయాలి. ఆ మిశ్రమంతో ముఖాన్ని సున్నితంగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలను తొలగిపోతాయి. అలాగే రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇక చర్మం మృదువుగా మారుతుంది.
బీట్‌రూట్ తో పెదవుల రంగును కూడా సహజంగా మార్చుకోవచ్చు. నిద్రపోయే ముందు కొబ్బరి నూనెతో కొన్ని చుక్కల బీట్‌రూట్ రసాన్ని కలిపి ఆ మిశ్రమాన్ని పెదవులకు రాయాలి. మీకు నల్లటి పెదాలు ఉంటే ఈ చిట్కాను పాటిస్తే పెదాలకు సహజమైన గులాబీ రంగు వస్తుంది.
బీట్‌రూట్ రసాన్ని ముఖం తాజాగా ఉండాలంటే చిన్న చిట్కా పాటించండి. రోజ్ వాటర్‌తో బీట్ రూట్ రసం కలిపి ఒక స్ప్రే బాటిల్‌లో నిల్వ చేసుకోవాలి. దీన్ని ముఖంపై స్ప్రే చేసుకుంటే చర్మం తాజాగా మారుతుంది.

