MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Name Astrology: ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా?

Name Astrology: ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా?

Name Astrology: జ్యోతిషంలో పేరు బలం కూడా ముఖ్యమైనది. మన పేరులోని మొదటి అక్షరం కూడా మన జాతకాన్ని ప్రభావితం చేస్తుంది. ఆంగ్ల అక్షరం S తో పేరు మొదలైతే వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 06 2026, 12:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
S అక్షరంతో పేరు మొదలయ్యే వారి జాతకం
Image Credit : Getty

S అక్షరంతో పేరు మొదలయ్యే వారి జాతకం

జ్యోతిష్య శాస్త్రంలో పేరును బట్టి జాతకాన్ని అంచనా వేయడం ఒక భాగం. దీన్ని నేమ్ ఆస్ట్రాలజీ అని పిలుస్తారు. మన పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి కూడా మన జీవితం ప్రభావితమై ఉంటుంది. ఇప్పుడు మనం ఎస్ అనే అక్షరంతో మొదలైన వ్యక్తుల జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఎస్ అనే అక్షరంతో ఎన్నో తెలుగు పేర్లు మొదలవుతున్నాయి. ఆ పేర్లు పెట్టుకున్న వ్యక్తులు తమ మనసులో మాటను ఎవరితోనూ చెప్పుకోరు. కానీ తెలివితేటలు మాత్రం అధికంగానే ఉంటాయి. వారి హృదయం స్వచ్ఛంగా ఉంటుంది. చెప్పాలనుకున్నది సూటిగా చెబుతారు. నటించడం వీరికి చేతకాదు. అయితే వీరికి మంచి జీవిత భాగస్వాములు లభిస్తారు. తమ జీవితంలో అడుగుపెట్టిన వ్యక్తి మంచి చెడులను చూసుకోవడంలో వీరు ముందుంటారు.

24
కోరికలు ఎక్కువే
Image Credit : Getty

కోరికలు ఎక్కువే

ఎస్ అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తులు లైంగిక కోరికలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీరు ప్రేమను ఎక్కువగా కోరుకుంటారు. ఇతరుల నుంచి బహుమతులు వంటివి కోరుకోరు. వీరిలో దయా గుణం, సాయం చేసే గుణం అధికంగా ఉంటుంది. వీరికి డబ్బు విలువ బాగా తెలుసు. కానీ డబ్బే వీరి ప్రపంచం కాదు. స్నేహానికి, బంధానికి ఎంతో విలువలు ఇస్తారు. మీరు చాలా కూల్ గా ఉండే టైప్. సాధారణంగా కోపం రాదు. కానీ కోపం వస్తే మాత్రం వీరిని తట్టుకోవడం చాలా కష్టం. ఇదే వారికున్న ఒక చెడు లక్షణం.

Related Articles

Related image1
Lucky Zodiac Signs: మకర రాశిలో రాజయోగం, ఈ 5 రాశులకు రాజభోగాలే
Related image2
Venus Transit: మృగశిర నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్న శుక్రుడు, ఈ 3 రాశులకు పండగే
34
నాయకులు అవుతారు
Image Credit : Getty

నాయకులు అవుతారు

ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు ఉల్లాసంగా ఉంటారు. ఇతరులతో స్నేహపూర్వకంగా ఉండేందుకు ఇష్టపడతారు. అలాగే ఎంతో ఆత్మ గౌరవాన్ని కూడా కలిగి ఉంటారు. ఎవరి నుండి సాయాన్ని కోరుకోరు. తమ కష్టంతోనే విజయం సాధించాలని భావిస్తారు. అలాగే వీరి ఆలోచన కూడా సృజనాత్మకంగా ఉంటుంది. గుంపులో గోవిందంలా కాకుండా ప్రతి పనిని సొంతంగా చేసేందుకు ఇష్టపడతారు. వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

44
చర్మ సమస్యలు వచ్చే ఛాన్స్
Image Credit : Getty

చర్మ సమస్యలు వచ్చే ఛాన్స్

ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి తరచూ చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. స్కిన్ ఎలర్జీ వల్ల ఇబ్బంది పడతారు. అలాగే గ్యాస్టిక్ సమస్యలు కూడా రావచ్చు. ఆరోగ్యం విషయంలో ఈ రెండూ వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీరు ఎవరినీ తొందరగా నమ్మరు. అదే ఒకసారి నమ్మారంటే జీవితాంతం తోడుగా ఉంటారు. వీరు చుట్టుపక్కల వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎస్అక్షరంతో పేరు ఉన్న అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు ఎక్కువగా మోసపోతూ ఉంటారు. కాబట్టి ఇతరులను అతిగా నమ్మకపోవడమే మంచిది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Lucky Zodiac Signs: మకర రాశిలో రాజయోగం, ఈ 5 రాశులకు రాజభోగాలే
Recommended image2
AI Horoscope: ఓ రాశివారికి ఈ రోజు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఈ రాశివారికి జీవిత భాగస్వామి ద్వారా కీలక విషయాలు తెలుస్తాయి!
Related Stories
Recommended image1
Lucky Zodiac Signs: మకర రాశిలో రాజయోగం, ఈ 5 రాశులకు రాజభోగాలే
Recommended image2
Venus Transit: మృగశిర నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్న శుక్రుడు, ఈ 3 రాశులకు పండగే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved