Recipes: కమ్మనైన డిజర్ట్ కావాలంటే.. బెస్ట్ ఆప్షన్ బాదంపూరి!
Recipes: దసరా నవరాత్రులలో ప్రతిరోజు ఒక స్వీట్ చేసుకుంటాం. అందులో ఒకరోజు ఈ బాదం పూరిని తయారు చేసి చూడండి. ఇది బెస్ట్ డిజర్ట్. అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో చూద్దాం రండి.
పూరీలను సాధారణంగా ఆలూ కుర్మాలతో హాట్ గా తినడానికే ఇష్టపడతాము కానీ స్వీట్ ఐటమ్ గా కూడా తయారు చేసుకోవచ్చు. ఇది కర్ణాటక స్పెషల్ రెసిపీ. ఇది తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం. గోధుమపిండి 200 గ్రాములు, మైదాపిండి 200 గ్రాములు.
నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు, బాదం 20 పలుకులు, బేకింగ్ పౌడర్ టీ స్పూన్, కుంకుమపువ్వు కొంచెం, యాలకుల పొడి టీ స్పూన్, పంచదార పావు కిలో, నూనె వేయించడానికి సరిపడా, బాదం పిస్తా తురుము గార్నిష్ కోసం తగినంత.
ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బాదంపప్పుని వేడి నీళ్లలో 20 నిమిషాల సేపు నానబెట్టి తర్వాత మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోండి. అందులో కాసిని నీళ్లు పోసి చిక్కని పాల మాదిరి చేసుకోండి.
గోధుమపిండి మైదాపిండి మిశ్రమంలో నెయ్యి కలపండి తర్వాత బాదం పాలు పోసి చపాతీ పిండి లాగా కలపండి. పిండి ముద్ద మీద తడి బట్ట కప్పి 15 నిమిషాలు నాననివ్వండి. తర్వాత వాటిని ఉండలుగా చేసుకొని ఒక్కొక్క ఉండని..
పూరి లాగా చేసే దానిమీద నెయ్యి పోసి త్రికోణకారం వచ్చేలాగా మడత పెట్టాలి ఒక గిన్నెలో పంచదార వేసి అది మునిగే వరకు నీళ్లు పోసి మరిగించాలి. తీగపాకం వచ్చాక కుంకుమపువ్వు యాలకుపొడి వేసి కలపండి.
మరోపక్క బాణలిలో నేను నూనె పోసి కాగాక బాదం పూరీలను వేయించి పాకంలో వేసి ఒక నిమిషం పాటు ఉంచి వెంటనే తీసేయండి. వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని బాదం పిస్తా తురుము గార్నిష్ చేసుకోండి. ఇంకేముంది టేస్టీ టేస్టీ బాదం పూరి రెడీ.