MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Induction Stove: ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా? ఈ పనులు చేస్తే అది పగిలిపోవడం ఖాయం

Induction Stove: ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా? ఈ పనులు చేస్తే అది పగిలిపోవడం ఖాయం

Induction Stove: ఇండక్షన్ స్టవ్ వాడకం పెరిగిపోయింది. గ్యాస్ ధరలతో పడలేక ఇండక్షన్ కుక్ టాప్‌లు అధికంగా వాడుతున్నారు. అయితే వాటిని చెడిపోకుండా వాడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ఇండక్షన్ స్టవ్ పై ఉన్న గ్లాస్ పగిలిపోవడం వంటివి జరుగుతాయి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 07 2026, 11:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇండక్షన్ స్టవ్ ఎలా వాడాలి?
Image Credit : Chat gpt

ఇండక్షన్ స్టవ్ ఎలా వాడాలి?

గ్యాస్ సరిగా దొరక్కపోవడంతో తక్కువ ధరకే వచ్చే ఇండక్షన్ స్టవ్‌లను వాడే వారి సంఖ్య అధికంగా ఉంది. అయితే చాలామందికి వాటిని ఎలా జాగ్రత్తగా వాడాలో తెలియదు. ఇండక్షన్ స్టవ్‌ని సరిగా వాడకపోతే ఆ స్టవ్ పై ఉండే గ్లాసు పగిలిపోవచ్చు.. లేదా పాడైపోవచ్చు, పని చేయడమే ఆగిపోవచ్చు. కాబట్టి కొన్ని పనులు చేయకూడదు. ఇండక్షన్ కుక్ టాప్ వాడే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇండక్షన్ స్టవ్ క్లీనింగ్ టిప్స్
Image Credit : Getty

ఇండక్షన్ స్టవ్ క్లీనింగ్ టిప్స్

వంట అయిపోయాక స్టవ్‌ను శుభ్రపరిచే అలవాటు చాలామందికి ఉంటుంది. అలా శుభ్రపరిచే ముందు అది పూర్తిగా చల్లారిందని నిర్ధారించుకోండి. వేడిగా ఉన్న ఉపరితలంపై నీరు లేదా ఇతర ద్రవాలు పడితే అది మాడిపోయి అతుక్కుపోతుంది. దీనివల్ల ఆ మరకలు తొలగించడం కష్టమవుతుంది. దానిపై వంట కూడా నెమ్మదిగా అవుతుంది. దీన్ని శుభ్రపరిచే ముందు హీట్ ఇండికేటర్ లైట్ ను తనిఖీ చేయండి. కరెంట్ పూర్తిగా నిలిపివేశాకే క్లీన్ చేయడం ఉత్తమం.

34
స్క్రబ్బర్ వాడవద్దు
Image Credit : Getty

స్క్రబ్బర్ వాడవద్దు

ఇండక్షన్ కుక్ టాప్ పై ఏదైనా ఒలికిపోతే ఒక తడి గుడ్డను తీసుకొని వెంటనే తుడిచేయండి. ఇలా చేయడం వల్ల ఆహారం ఆరిపోయి గట్టిగా మారకుండా ఉంటుంది. వేడిగా ఉన్నా కూడా ఇలాంటి సమయంలో ఇండక్షన్ కుక్ టాప్‌ను కూడా తుడవవచ్చు. దీనివల్ల ఆ ద్రవాలు స్టవ్ లోపలికి ప్రవేశించకుండా అడ్డుకోవడం సులువుగా మారుతుంది.

స్టవ్ పై పంచదార, కాఫీ పొడి పడితే గట్టిగా అతుక్కుపోతాయి. అలాంటప్పుడు వెనిగర్, నీరు సమాన నిష్పత్తిలో కలిపి దాన్ని ఆ ప్రాంతంలో స్ప్రే చేసి పది నిమిషాలు వదిలేయండి. తర్వాత ఒక తడి గుడ్డతో తుడిచేస్తే ఆ మరకలన్నీ పోతాయి. గిన్నెలు తోమినట్టు ఇండక్షన్ స్టవ్ గట్టిగా తోమడం మంచి పద్ధతి కాదు. గరుకైన స్క్రబ్బర్ ను ఉపయోగిస్తే స్టవ్ పై ఉన్న గాజు పై గీతలు పడతాయి. దీనివల్ల అది దీర్ఘకాలంలో పని చేయకుండా మానేస్తుంది.

44
స్విచ్ లతో జాగ్రత్త
Image Credit : Getty

స్విచ్ లతో జాగ్రత్త

ముఖ్యంగా ఇండక్షన్ స్టవ్ లో ఉన్న స్విచ్ఛుల దగ్గర పగుళ్లు కనిపిస్తే దానిని వెంటనే మార్చడం అవసరం. లేకుంటే దాన్ని ఉపయోగించడం ప్రమాదకరంగా మారుతుంది. ఎప్పుడు ఏ నష్టం జరుగుతుందో అంచనా వేయలేము. కాబట్టి స్విచ్చుల ప్రాంతంలో ఏ మాత్రం పగుళ్లు వచ్చినా వెంటనే దాన్ని మార్చి కొత్తది తీసుకుంటే సురక్షితంగా ఉంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
PopCorn: మొక్కజొన్న గింజ వేడి చేయగానే.. పాప్ కార్న్ గా ఎలా మారుతుంది..?
Recommended image2
Gold Earrings: డైలీవేర్‌కి ఈ కమ్మలు సూపర్‌గా ఉంటాయి.. ట్రై చేయండి!
Recommended image3
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Related Stories
Recommended image1
Nonstick Pan: మీ నాన్ స్టిక్ పాన్ పై చిన్న గీత పడినా.. దానిలో వండడం ఎంత ప్రమాదకరమో తెలిస్తే జన్మలో వాటిని వాడరు
Recommended image2
Saturn Rise: ఈ 5 రాశులకి అదృష్టం పట్టనుంది, ఏప్రిల్‌లో శని దయతో డబ్బే డబ్బు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved