MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Nonstick Pan: మీ నాన్ స్టిక్ పాన్ పై చిన్న గీత పడినా.. దానిలో వండడం ఎంత ప్రమాదకరమో తెలిస్తే జన్మలో వాటిని వాడరు

Nonstick Pan: మీ నాన్ స్టిక్ పాన్ పై చిన్న గీత పడినా.. దానిలో వండడం ఎంత ప్రమాదకరమో తెలిస్తే జన్మలో వాటిని వాడరు

Nonstick Pan: ఇంట్లో వాడే నాన్ స్టిక్ పాన్ లను ఒకసారి చూడండి. దానిలోపల చిన్న చిన్న గీతలు కనిపిస్తున్నాయా. వాటి వల్ల ఏం కాదులే అని వండేస్తున్నారా? అయితే పెద్ద పెద్ద ప్రాణాంతక రోగాలు వచ్చేందుకు సిద్దమైనట్టే. 

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 07 2026, 10:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నాన్ స్టిక్ పై గీత పడినా ప్రమాదమే
Image Credit : Chat Gpt

నాన్ స్టిక్ పై గీత పడినా ప్రమాదమే

ఇంట్లో వంట చేసేటప్పుడు నాన్ స్టిక్ పాత్రలు చాలా మందికి చాలా సౌకర్యంగా ఉంటాయి. చూడటానికి అందంగా కూడా కనిపిస్తాయి. తక్కువ నూనెతో వంట అయిపోతుంది, కూరలు మాడిపోవు, వాటిని క్లీన్ చేయడం కూడా ఈజీ. అందుకే చాలా ఇళ్లలో ఇవే ఎక్కువగా వాడుతున్నారు. కానీ తాజా అధ్యయనాల ప్రకారం నాన్ స్టిక్ పాన్‌పై చిన్న గీత పడినా కూడ అది వాడడం ఏమాత్రం సేఫ్ కాదు. మనం సాధారణంగా పట్టించుకోని ఈ చిన్న గీతలే కొంతకాలానికి తీవ్ర ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. అందుకే ఈ విషయాన్ని కాస్త సీరియస్‌గా తీసుకోవాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఏం జరుగుతుంది?
Image Credit : Getty

ఏం జరుగుతుంది?

నాన్ స్టిక్ పాన్‌పై గీత పడితే చాలా చిన్న చిన్న కణాలు బయటికి వస్తాయి. ఇవి మన కంటికి కనిపించవు. కానీ వంట పదార్థాలలో కలిసిపోతాయి. అంటే మనం తినే ఆహారంతో పాటు అవి మన శరీరంలోకి వెళ్లిపోతాయి. ఒక చిన్న గీత పడితేనే వేల సంఖ్యలో ఈ మైక్రో కణాలు బయటకు వస్తాయని కొన్ని స్టడీలు చెబుతున్నాయి. పాన్ ఎక్కువగా పాడైపోతే ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది. ముఖ్యంగా పాన్‌పై ఉన్న కోటింగ్ ఊడిపోతే ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. మనం ఇంకా బాగానే ఉందిగా అనుకుని వాడుతూ ఉంటాం కానీ పరోక్షంగా మాత్రం ప్రమాదం పెరుగుతూనే ఉంటుంది.

34
క్యాన్సర్ వచ్చే రిస్క్
Image Credit : Getty

క్యాన్సర్ వచ్చే రిస్క్

నాన్ స్టిక్ పాన్ నుంచి విడుదలయ్యే కణాల్లో PFAS అనే కెమికల్స్ ఉండే ఛాన్స్ ఉంది. వీటిని ఫారెవర్ కెమికల్స్ అని అంటారు. ఎందుకంటే ఇవి మన శరీరంలోకి వెళ్లిన తర్వాత సులభంగా బయటకు రావు. చాలా కాలం అలాగే ఉండిపోతాయి. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి క్యాన్సర్ రిస్క్ పెరగొచ్చు, హార్మోన్లలో మార్పులు రావచ్చు, కొంతమందిలో పునరుత్పాదక సమస్యలు కూడా రావచ్చు. అలాగే శరీర రోగ నిరోధక శక్తి కూడా తగ్గే అవకాశం ఉంది. ఇవన్నీ ఒక్కసారిగా కనిపించవు కానీ చాలా కాలం ఇలా కొనసాగితే ప్రభావం చూపుతాయి.

44
ఈ జాగ్రత్తలు తీసుకోండి
Image Credit : Getty

ఈ జాగ్రత్తలు తీసుకోండి

అలాగని నాన్ స్టిక్ పాత్రలు పూర్తిగా వాడకూడదని చెప్పడం లేదు. సరైన విధంగా వాడితే పెద్ద ప్రమాదం ఉండదు. కానీ జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి. మెటల్ స్పూన్లు వాడకుండా వుడ్ లేదా సిలికాన్ స్పూన్లు వాడటం మంచిది. పాన్‌ను ఖాళీగా ఎక్కువసేపు వేడి చేయకూడదు. గీతలు కనిపించగానే కొత్తది తీసుకోవాలి. చాలా పాత పాన్‌లను ఎక్కువ కాలం వాడకూడదు. వీలైతే స్టీల్ లేదా కాస్ట్ ఐరన్ పాత్రలు కూడా ఉపయోగించాలి. మొత్తానికి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యాన్ని సేఫ్‌గా ఉంచుకోవచ్చు. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sprouted Green Gram: 30 రోజులపాటు మొలకెత్తిన పెసలు తింటే ఏమవుతుందో తెలుసా?
Recommended image2
Stubborn Pimples: 7 డేస్ ఛాలెంజ్..జీవితంలో మొటిమలు, యాక్నే రాదు.
Recommended image3
Rice Cooking: కుక్కర్‌లో వండిన అన్నం మంచిదా? లేక వార్చి వండినది ఆరోగ్యకరమా?
Related Stories
Recommended image1
Pressure Cooker: ప్రెజర్ కుక్కర్‌ ఎన్నేళ్లు వాడాలి? ఎప్పుడు మార్చాలి?
Recommended image2
Illu Illalu Pillalu April 7 Episode: చందు పై యాక్సిడెంట్ ప్లాన్.. నీచానికి దిగజారిన భాగ్యం వల్లి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved