MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Kitchen tips: పాడైన కొబ్బరికాయను పడేస్తున్నారా? దాన్ని ఇలా వాడేయండి

Kitchen tips: పాడైన కొబ్బరికాయను పడేస్తున్నారా? దాన్ని ఇలా వాడేయండి

Kitchen tips:  ప్రతి ఇంట్లోనూ కొబ్బరికాయలు కచ్చితంగా వాడతారు. పూజల నుండి వంటల వరకు కొబ్బరికాయల అవసరం ఎంతో ఉంది. కొన్నిసార్లు కొబ్బరికాయ పాడైపోతుంది. దాన్ని పారేస్తూ ఉంటారు. నిజానికి దాన్ని అనేక రకాలుగా వాడవచ్చు.

2 Min read
Author : Haritha Chappa
Published : Jan 13 2026, 10:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కొబ్బరికాయ పాడైతే
Image Credit : stockPhoto

కొబ్బరికాయ పాడైతే

కొబ్బరికాయలను అధికంగా కొంటే కొన్ని రోజులకు అది పాడయ్యే అవకాశం ఉంది. కొబ్బరికాయ రంగు నెమ్మదిగా మారినప్పుడు లేదా దానిపై తెల్లటి బూజు పట్టినప్పుడు దాన్ని బయటపడేస్తూ ఉంటాము. అది పనికిరానిది అని భావిస్తాము. చెత్తబుట్టలో పడేస్తాం. కానీ పాడైపోయిందనుకున్న కొబ్బరికాయను అనేక రకాలుగా వాడుకోవచ్చు.  కాబట్టి ఇకపైన మీరు కొబ్బరికాయను పడేయాల్సిన అవసరం లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బూజును తొలగించి
Image Credit : Getty

బూజును తొలగించి

సోషల్ మీడియాలో పాడైపోయిన కొబ్బరికాయను ఎలా వాడాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి మీ డబ్బును ఆదా చేయడమే కాకుండా కొబ్బరికాయను తిరిగి వాడుకోవచ్చు. కొబ్బరికాయకు పట్టిన బూజును తొలగించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. ఆ తరువాత దాన్ని తిరిగి వినియోగించుకోవచ్చు.

బూజు పట్టిన కొబ్బరికాయను శుభ్రం చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకోండి. అందులో ఒక చెంచా వంట సోడా కలపండి. కొద్దిగా గోరువెచ్చని నీరు కూడా వేసి బాగా కలపండి. వంట సోడాలో సహజమైన క్లీనింగ్ ఏజెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. దీని వల్ల ఇది బూజు, బ్యాక్టీరియాను తొలగిపోతాయి. 

Related Articles

Related image1
నల్ల పట్టీలు.. ఇప్పుడు సరికొత్త స్టైల్
Related image2
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హీరోయిన్ దేవయాని కూతురిని చూశారా? అందంలో అమ్మ పోలికే
34
రంగు మారినా ఫర్వాలేదు
Image Credit : stockPhoto

రంగు మారినా ఫర్వాలేదు

ఇప్పుడు శుభ్రమైన కాటన్ క్లాత్ ను తీసుకుని దాన్ని గోరువెచ్చని సోడా నీటిలో ముంచండి. ఆ తడి గుడ్డతో కొబ్బరికాయను శుభ్రంగా తుడవండి. కాస్త గట్టిగా రుద్దితే ఆ బూజు మొత్తం పూర్తిగా శుభ్రపడుతుంది. వేడి నీరు, సోడా ప్రభావం కొబ్బరి గుజ్జుపై ఏర్పడిన  హానికరమైన పదార్థాలను తొలగిస్తుంది.

ఇలా శుభ్రం చేసేటప్పుడు  కొబ్బరికాయ రంగు మారే అవకాశం ఉంది. అలా రంగు మారగానే గాభరాపడకండి.  రంగు మారడం కొబ్బరికాయ పాడైపోయిందని చెప్పడం కాదు. దాన్ని మీరు వాడవచ్చు. మీరు బూజును పూర్తిగా తొలగించాక దాన్ని తిరిగి వాడవచ్చు.  పైన పొరపైనే ఫంగస్ చేరుతుంది కానీ లోపలి కొబ్బరి ముక్క బాగానే ఉంటుంది.

44
శుభ్రం చేశాక ఇలా చేయండి
Image Credit : our own

శుభ్రం చేశాక ఇలా చేయండి

కొబ్బరి కాయను తడి గుడ్డతో శుభ్రం చేశాక దాన్ని అలా వదిలేయకండి. వెంటనే శుభ్రమైన పొడి క్లాత్ తో కొబ్బరికాయను బాగా తుడవండి. తడి ఉందంటే మళ్లీ బూజు పెరిగిపోతుంది. కాబట్టి కొబ్బరికాయ పూర్తిగా ఆరిపోయేలా జాగ్రత్త తీసుకోవాలి. ఇలా తడి లేకుండా ఆరబెట్టడం వల్ల తెలుపుదనం వచ్చేస్తుంది.

కొబ్బరికాయను మళ్లీ తాజాగా మార్చేందుకు నెయ్యిని ఉపయోగించాలి. కొద్దిగా దేశీ నెయ్యి తీసుకుని తెల్లటి కొబ్బరికాయ గుజ్జు మొత్తానికి మానంగా రాయండి. నెయ్యి ఒక రక్షణ పొరలా పనిచేస్తుంది. కొబ్బరికాయ ఎండిపోకుండా తాజాగా ఉండేలా చేస్తుంది.

కొబ్బరికాయను నిల్వ చేసే పద్ధతి కూడా తెలుసుకోవాలి. గాలి చొరబడని డబ్బా తీసుకుని అందులో కొబ్బరి ముక్కలు వేసి ప్యాక్ చేయండి. గాలి చేరకుండా జాగ్రత్త పడండి. ఇలా చేస్తే  కొబ్బరికాయ ఫ్రిజ్‌లో ఒక సంవత్సరం వరకు తాజాగా ఉంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Best Time to Workouts : ఉదయం వర్కౌట్స్ చేయడం మంచిదా? లేక సాయంత్రమా?
Recommended image2
Black Raisins: నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్ష తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image3
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం ఈ 5 విషయాలు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతాయి!
Related Stories
Recommended image1
నల్ల పట్టీలు.. ఇప్పుడు సరికొత్త స్టైల్
Recommended image2
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హీరోయిన్ దేవయాని కూతురిని చూశారా? అందంలో అమ్మ పోలికే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved