MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Washing Machine: వాషింగ్ మెషీన్ కొనే ముందు ఈ స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి

Washing Machine: వాషింగ్ మెషీన్ కొనే ముందు ఈ స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి

Washing Machine: వాషింగ్ మెషీన్ కొనాలనుకుంటున్నారా? అయితే 2026లో ఎన్నో స్మార్ట్ ఫీచర్లతో కూడిన వాషింగ్ మెషీన్లు వచ్చాయి. మీ కుటుంబానికి ఎలాంటి వాషింగ్ మెషీన్ ఎంపిక చేసుకోవాలి? ఉత్తమ వాషింగ్ మెషీన్ కు ఉండే లక్షణాలేంటో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 24 2026, 06:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వాషింగ్ మెషీన్ కొనేందుకు గైడ్
Image Credit : Getty

వాషింగ్ మెషీన్ కొనేందుకు గైడ్

ఇంటి పనులను సులభం చేసే ముఖ్యమైన మెషీన్లలో వాషింగ్ మెషిన్ ఒకటి. ఇప్పటి కాలంలో చాలా రకాల వాషింగ్ మెషిన్లు మార్కెట్లో ఉన్నాయి. కొత్త టెక్నాలజీ, స్మార్ట్ ఫీచర్లు పనిని మరింత సులభతరం చేసేస్తాయి. వానీ వీటిపై ఎంతో మందికి అవగాహన లేదు. వాషింగ్ మెషీన్ ఒకే పరిమాణంలో కాకుండా వేర్వేరు సైజులలో కూడా ఉంటుంది. వాషింగ్ మెషిన్ కొనేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా చూడాలి. కేవలం ధర తక్కువగా ఉందని లేదా పెద్ద బ్రాండ్ అని కొనకుండా, మీ అవసరాలకు సరిపోతుందా లేదా అనే విషయం తెలుసుకోవాలి. అలా చేస్తే మెషిన్ ఎక్కువకాలం మీకు ఉపయోగపడుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎన్ని కిలోల మెషీన్ కావాలి?
Image Credit : Getty

ఎన్ని కిలోల మెషీన్ కావాలి?

మొదటగా మీరు కొనాలనుకుంటున్న మెషిన్ సామర్థ్యం చూడాలి. అంటే ఒకసారి ఎన్ని బట్టలు ఉతుకుతుందో అదే మెషీన్ సామర్థ్యం. ఒంటరిగా ఉండేవారు లేదా చిన్న కుటుంబం ఉంటే ఆరు నుంచి ఏడు కిలోల సామర్థ్యం ఉన్న వాషింగ్ మెషిన్ కొంటే సరిపోతుంది. నాలుగు నుంచి 5 మంది ఉన్న కుటుంబం ఉంటే ఏడు నుంచి ఎనిమిది కిలోల సామర్థ్యం ఉన్న మెషిన్ కొంటే మంచిది. ఇంత కన్నా పెద్ద కుటుంబం 9 కిలోల సామర్థ్యం ఉన్న మెషిన్ తీసుకోవాలి. అలాగే ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ అనే రెండు రకాల మెషిన్లు ఉంటాయి. వీటిలో మీకు ఏది సౌకర్యంగా అనిపిస్తే అదే కొనుక్కోవాలి. ఈ రెండూ కూడా బాగానే పనిచేస్తాయి.

34
తక్కువ శబ్ధం చేసే మోటార్
Image Credit : Getty

తక్కువ శబ్ధం చేసే మోటార్

వాషింగ్ మెషీన్లో మోటార్ ఎంతో ముఖ్యమైనది. ఇన్‌వర్టర్ మోటార్ ఉన్న వాషింగ్ మెషిన్లు తక్కువ విద్యుత్ వాడతాయి. అలాగే తక్కువ శబ్దం చేస్తాయి. అందువల్ల ఇవి కొంటే మంచిది. అలాగే మెషిన్ పని చేసే సమయంలో కంపించకూడదు. వైబ్రేషన్ తక్కువగా ఉంటే వాషింగ్ మెషిన్ స్థిరంగా పనిచేస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఎనర్జీ రేటింగ్. మంచి ఎనర్జీ రేటింగ్ ఉన్న మెషిన్ తీసుకుంటే విద్యుత్ బిల్లు కూడా తగ్గుతుంది. నీటి వినియోగం కూడా తక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంలో ఇది డబ్బును ఆదా చేస్తుంది. ఇలాంటి ఫీచర్లు ఉన్న వాషింగ్ మెషీన్ ను ఎంపిక చేసుకోవడం ఉత్తమం.

44
ఈ స్మార్ట్ ఫీచర్లు
Image Credit : Getty

ఈ స్మార్ట్ ఫీచర్లు

కొత్తగా వచ్చిన వాషింగ్ మెషిన్లలో స్మార్ట్ ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. మొబైల్‌తోనే వాషింగ్ మెషిన్ ఆన్, ఆఫ్ చేయడం వంటి సౌకర్యాలు వచ్చాయి. ఆటోమేటిక్‌గా డిటర్జెంట్ వేసే సౌకర్యం, వేర్వేరు బట్టలకు ప్రత్యేక వాష్ మోడ్‌లు వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. క్విక్ వాష్, డెలికేట్ వాష్, హెవీ స్టెయిన్, స్టీమ్ మోడ్ వంటి ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. ఈ ఫీచర్లు నిజంగా మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. వాషింగ్ మెషిన్ కొనేటప్పుడు సామర్థ్యం, మోటార్, విద్యుత్ ఆదా, శబ్దం, వాష్ మోడ్‌లు వంటి విషయాలు చూసి కొంటే ఉత్తమ వాషింగ్ మెషీన్ కొనే అవకాశం ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Ring: అమ్మాయిల మనసు దోచే బంగారు ఉంగరం డిజైన్లు
Recommended image2
Weight Loss: ఇవి ఫాలో అయితే నెల రోజుల్లో బరువు తగ్గుతారు
Recommended image3
Marriage Rituals:ఇక్కడ అన్నదమ్ములందరినీ ఒకే అమ్మాయి పెళ్లాడుతుంది.. మహాభారత కాలం నాటి ఆచారం
Related Stories
Recommended image1
Kids Before marriage: పెళ్లికి ముందే పిల్లల్ని కనాల్సిందే, ఆ తర్వాతే పెళ్లి.. ఎక్కడో కాదు మనదేశంలోనే
Recommended image2
Birth Month: ఈ 4 నెలల్లో పుట్టిన వారు 30 ఏళ్ల వయసు దాటాక కోటీశ్వరులవ్వడం పక్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved