MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Life
  • Gardening
  • Cleaning Toilet: బాత్ రూం క్లీన్ చేసేముందు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?

Cleaning Toilet: బాత్ రూం క్లీన్ చేసేముందు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?

Cleaning Toilet: టాయిలెట్ బేస్ సరిగ్గా క్లీన్ చేస్తున్నారా? బాత్‌రూం శుభ్రం చేసే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముంది. మరి ఎలా క్లీన్ చేయాలి? ముందస్తుగా ఎలాంటి కేరింగ్ తీసుకోవాలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Nandini Arava
Published : Feb 28 2026, 11:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
చాలా మందికి టాయిలెట్ క్లీనింగ్ అంటే నామూషీ
Image Credit : Getty

చాలా మందికి టాయిలెట్ క్లీనింగ్ అంటే నామూషీ

ఇంటి పనుల్లో చాలా మందికి అసహ్యంగా అనిపించే పని ఏదైనా ఉంటే అది టాయిలెట్ శుభ్రం చేయడమే. చాలా మంది టాయిలెట్ క్లీన్ చేయడం నామూషీగా ఫీలవుతారు. ముఖ్యంగా టాయిలెట్ బేస్ చుట్టూ నాచు, పచ్చిబూజు ఏర్పడితే అది చూడటానికే కాదు, వాసనకూ ఇబ్బంది కలిగిస్తుంది. బాత్‌రూమ్‌లో తేమ ఎక్కువగా ఉండటం వల్ల టాయిలెట్ బేస్ వద్ద నీరు నిల్వ ఉండి, ఆ ప్రదేశం జారిపోవడానికి కారణమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫంగస్ వేగంగా పెరిగి, ఆరోగ్యానికి హాని చేస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
తేమ 24–48 గంటల్లో ఎండకపోతే ఫంగస్
Image Credit : Getty

తేమ 24–48 గంటల్లో ఎండకపోతే ఫంగస్

టాయిలెట్ బేస్ వద్ద ఏర్పడే నాచు ఎక్కువకాలం అలాగే గాల్లో సూక్ష్మకణాలు విడుదలవుతాయి. ఇవి శ్వాస ద్వారా లోపలికి వెళ్లి అలర్జీలు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మ సమస్యలు కలిగించవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, అలర్జీ సమస్యలు ఉన్నవారికి ఇది ప్రమాదకరం.

అదే కాకుండా ఫంగస్ ఉన్న ప్రదేశం ఎప్పుడూ తడిగా ఉంటుంది. టాయిలెట్ బేస్ చుట్టూ నీరు నిల్వ ఉండటం వల్ల జారిపోయే ప్రమాదం ఉంది. బాత్‌రూమ్‌లో తేమ శాతం 35% నుండి 50% మధ్యలో ఉండాలి. 60% దాటితే నాచు పెరుగుతుంది. స్నానం తర్వాత బాత్ రూమ్ తలుపులు తీయకపోతే గాలి బయటకు పోకుండా గోడలు, టాయిలెట్ బేస్ చుట్టూ తడి ఉండిపోతుంది. ఈ తేమ 24–48 గంటల్లో ఎండకపోతే ఫంగస్ పెరుగుతుంది.

Related Articles

Related image1
Life Hacks:మీ పాత దుస్తులు పారేస్తున్నారా? వాటితోనే డబ్బు సంపాదించొచ్చు, ఎలానో తెలుసా?
Related image2
Toilet flush Buttons టాయిలెట్ ఫ్లష్‌కి రెండు బటన్లు ఎందుకు? అసలు మర్మం తెలుసుకోండి
36
గ్లోవ్స్, మాస్క్ తప్పనిసరి
Image Credit : Getty

గ్లోవ్స్, మాస్క్ తప్పనిసరి

టాయిలెట్ బేస్ సిరామిక్ లేదా పోర్సిలైన్‌తో తయారై ఉంటుంది. గాఢమైన కెమికల్స్ వాడితే రంగు మారి అది కూడా దెబ్బతింటుంది. కాబట్టి ముందుగా చిన్న భాగంలో పరీక్ష చేయాలి. గ్లోవ్స్, మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. తలుపులు, కిటికీలు తెరిచి గాలి వచ్చేలా చూడాలి. వెనిగర్, బేకింగ్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్, బ్లీచ్, స్ప్రే బాటిల్, స్క్రబ్ బ్రష్, క్లాత్, గ్లోవ్స్, మాస్క్ ఉండాలి.

46
తడి మిగిలితే నాచు పెరిగే అవకాశం
Image Credit : our own

తడి మిగిలితే నాచు పెరిగే అవకాశం

ఫంగస్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ముందుగా బేకింగ్ సోడా చల్లాలి. ఆపై డిస్టిల్డ్ వినిగర్ స్ప్రే చేయాలి. దానివల్ల త్వరగా వదిలిపోతుంది. 10–15 నిమిషాలు అలాగే ఉంచి, స్క్రబ్ బ్రష్‌తో బాగా రుద్దాలి. చివరగా శుభ్రమైన గుడ్డతో తుడిచి పూర్తిగా ఎండబెట్టాలి. తడి మిగిలితే మళ్లీ నాచు పెరిగే అవకాశం ఉంటుంది.

హైడ్రోజన్ పెరాక్సైడ్, నీటిని సమపాళ్లలో కలిపి స్ప్రే చేయాలి. 10–15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఇది ఫంగస్ ను క్రమంగా విచ్ఛిన్నం చేస్తుంది. తర్వాత బ్రష్‌తో శుభ్రం చేసి, తుడిచి ఎండబెట్టాలి. వినిగర్, హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను కలపకూడదు.

56
వినిగర్‌తో రెగ్యులర్ క్లీనింగ్
Image Credit : Getty

వినిగర్‌తో రెగ్యులర్ క్లీనింగ్

బ్లీచ్‌ను నీటితో కలిపి ఫంగస్ పై వేసి 10–15 నిమిషాలు ఉంచాలి. తర్వాత మెల్లగా రుద్దాలి. అయితే బ్లీచ్ ఎక్కువగా వాడకూడదు. ఇది చర్మానికి హానికరం, గ్యాస్ వాసన వల్ల శ్వాసకోశ ఇబ్బందులు కలగవచ్చు. గాలి తగిలేలా చూడాలి.

టాయిలెట్ బేస్ చుట్టూ నీరు నిల్వ ఉండకూడదు. ప్రతి సారి వాడిన తర్వాత చుట్టూ తడి ఉంటే వెంటనే తుడవాలి. వినిగర్‌తో రెగ్యులర్ క్లీనింగ్ చేస్తే దుర్వాసన తగ్గుతుంది. బాత్‌రూమ్‌లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటే స్నానం సమయంలో ఆన్ చేయాలి. లేకపోతే తలుపులు, కిటికీలు తెరవాలి. అవసరమైతే డీహ్యూమిడిఫైయర్ ఉపయోగించవచ్చు.

66
సీజనల్ జాగ్రత్తలు
Image Credit : Getty

సీజనల్ జాగ్రత్తలు

లీకేజీలు ఉంటే వెంటనే సరిచేయాలి. నేలపై నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నేచురల్ క్లీనింగ్ ప్రోడక్ట్స్‌తో తరచూ శుభ్రం చేస్తే నాచు మళ్లీ రావడం తగ్గుతుంది.

టాయిలెట్ బేస్ వద్ద నాచు, జారిపోవడం వంటి సమస్యలను చిన్న విషయంగా తీసుకోకూడదు. సరైన సమయంలో శుభ్రం చేయడం, తడి లేకుండా చూసుకోవడం, గాలి ప్రసరణ మెరుగుపరచడం ద్వారా మీ బాత్‌రూమ్‌ను ఆరోగ్యకరంగా, సురక్షితంగా ఉంచుకోవచ్చు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Tulsi Plant: తులసి మొక్క సడెన్ గా ఎండిపోయిందా? కారణం ఇదే
Recommended image2
Spider Plant: బెడ్రూమ్ లో ఈ ఒక్క మొక్క ఉంటే జరిగే మ్యాజిక్ ఇదే..!
Recommended image3
Terrace Gardening: ఇలా చేస్తే ఎన్ని మొక్కలు వేసినా డాబాకు పగుళ్లే రావు
Related Stories
Recommended image1
Life Hacks:మీ పాత దుస్తులు పారేస్తున్నారా? వాటితోనే డబ్బు సంపాదించొచ్చు, ఎలానో తెలుసా?
Recommended image2
Toilet flush Buttons టాయిలెట్ ఫ్లష్‌కి రెండు బటన్లు ఎందుకు? అసలు మర్మం తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved