MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Chemical Mangoes: మామిడి పండ్లు సహజంగా పండాయా లేక రసాయనాలతో పండాయా? ఇలా కనిపెట్టేయండి

Chemical Mangoes: మామిడి పండ్లు సహజంగా పండాయా లేక రసాయనాలతో పండాయా? ఇలా కనిపెట్టేయండి

Chemical Mangoes: వేసవి మామిడి పండ్ల సీజన్. మార్కెట్లో దొరికేవన్నీ సహజంగా పండిన మామిడి పండ్లు కావు. వ్యాపారులు కాల్షియం కార్బైడ్ లాంటి రసాయనాలతో పండ్లను పండిస్తున్నారు. వాటి రంగు, వాసన, స్పర్శను బట్టి గుర్తించవచ్చు.

2 Min read
Author : Haritha Chappa
Published : May 16 2026, 10:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మామిడి పండ్లు ఎలా పండాయి?
Image Credit : Asianet News

మామిడి పండ్లు ఎలా పండాయి?

వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే. రకరకాల మామిడి పండ్లను ప్రజలు ఇష్టంగా కొని తింటారు. కానీ, మార్కెట్లో దొరికేవన్నీ సహజంగా పండినవి కావు. వ్యాపారులు ఆ పండ్లపై కాల్షియం కార్బైడ్, ఇథిలీన్ ఆక్సైడ్ వంటి రసాయనాలను చల్లి పండ్లను కృత్రిమంగా పండిస్తున్నారు. ఇలాంటి పండ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాంటి ఆర్టిఫిషియల్ పండ్లను గుర్తించి తినకపోవడమే మంచిది.

మామిడిపండుు రంగును జాగ్రత్తగా గమనించండి. సహజంగా పండిన పండ్లు ఒకే రంగులో ఉండవు. అక్కడక్కడా పచ్చ, పసుపు, లేత నారింజ రంగులు కలిసి ఉంటాయి. రసాయనాలతో పండించిన పండ్లు మాత్రం చూడటానికి ఒకేరకమైన పసుపు లేదా బంగారు రంగులో ఉంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తొడిమ దగ్గర వాసన
Image Credit : Asianet News

తొడిమ దగ్గర వాసన

మామిడి పండు కొన్న తరువాత వాటి తొడిమ దగ్గర ముక్కు పెట్టి వాసన చూడండి. సహజంగా పండిన మామిడి పండు స్వచ్ఛమైన తియ్యటి వాసన వస్తుంది.  రసాయనాలతో పండిన పండు తొడిమ దగ్గర ఎలాంటి సువాసన ఉండదు. లేదా ఒక రకమైన కెమికల్ వాసన వస్తుంది.

సహజంగా పండిన పండును చేతుల్లోకి తీసుకుని మెల్లగా నొక్కితే మెత్తగా (Soft) ఉంటుంది. రసాయనాలతో పండించిన పండును నొక్కితే పైకి మెత్తగా అనిపించినా, లోపల కాయలా గట్టిగా ఉంటుంది. కొన్నిసార్లు ఆ పండ్లు మరీ ఎక్కువగా మెత్తబడి ఉంటాయి.

35
మామిడి పండును కోసి చూడటం
Image Credit : Asianet News

మామిడి పండును కోసి చూడటం

మామిడి పండు కొన్న తరువాత పండును కోసి చూసినప్పుడు లోపల గుజ్జు అంతా ఒకే రంగులో, రసంతో నిండి ఉంటే అది సహజంగా పండే పండు. అదే లోపల కొన్నిచోట్ల పండి, మరికొన్ని చోట్ల  కాయలాగా, పీచు భాగాలు గట్టిగా ఉంటే అది రసాయనాలతో పండించిన పండుగా భావించాలి.

45
నీటి పరీక్ష
Image Credit : stockPhoto

నీటి పరీక్ష

మామిడి పండ్లు కొన్నాక అవి ఎలా పండాయలో తెలుసుకునేందుకు ఒక బకెట్ నీటిలో మీరు కొన్న మామిడి పండ్లను వేయండి. సహజమైన పండ్లలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువుగా ఉంటాయి. అవి నీటిలో వేయగానే మునిగిపోతాయి. కృత్రిమ పండ్లు రసాయన మార్పుల వల్ల బరువు తగ్గి నీటిపై తేలుతాయి. అలా కూడా మీరు అవి ఎలా పండించినవో అర్థం చేసుకోవచ్చు.

55
నమ్మకమైన చోట కొనండి
Image Credit : Asianet News

నమ్మకమైన చోట కొనండి

కృత్రిమంగా మైనం లేదా రసాయనాలు పూసినట్టుగా, కళ్లను ఆకట్టుకునేలా మెరిసిపోయే మామిడి పండ్లను కొనకపోవడమే మంచిది. సహజంగా పండిన పండ్ల తొక్క మామూలుగానే ఉంటుంది. పండ్లను పండించేందుకు  వాడే కాల్షియం కార్బైడ్ చాలా ప్రమాదకరం.దీనివల్ల తలనొప్పి, తల తిరగడం, కడుపులో మంట, అలర్జీలు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే చాలా దేశాల్లో ఈ రసాయనం వాడకాన్ని నిషేధించారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Ring: అమ్మాయిల మనసు దోచే బంగారు ఉంగరం డిజైన్లు
Recommended image2
Weight Loss: ఇవి ఫాలో అయితే నెల రోజుల్లో బరువు తగ్గుతారు
Recommended image3
Marriage Rituals:ఇక్కడ అన్నదమ్ములందరినీ ఒకే అమ్మాయి పెళ్లాడుతుంది.. మహాభారత కాలం నాటి ఆచారం
Related Stories
Recommended image1
Haunted Village: ప్రపంచంలోనే అత్యంత భయానకమైన గ్రామం.. ఊళ్లో అరుపులే వినిపిస్తాయి మనుషులు కనిపించరు
Recommended image2
Indoor Plants: ఇంట్లో ఈ మొక్కలు పెట్టుకున్నారంటే బల్లులన్నీ మీ ఇంటికే చేరుతాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved