MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఈ పండు గుజ్జుతో ఫేస్ ప్యాక్ రోజూ వేశారంటే వారంలో ముఖానికి మెరుపు ఖాయం

ఈ పండు గుజ్జుతో ఫేస్ ప్యాక్ రోజూ వేశారంటే వారంలో ముఖానికి మెరుపు ఖాయం

ముఖం అందంగా మెరిసిపోవాలని ప్రతి మహిళ కోరుకుంటారు. అందుకోసం అనేక రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కానీ కొన్ని ఇంటి చిట్కాలతో వారంలోనే ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. ఇందుకోసం బొప్పాయి పండు ఉంటే చాలు

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 08 2026, 05:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ముఖానికి బొప్పాయితో మెరుపు
Image Credit : Getty

ముఖానికి బొప్పాయితో మెరుపు

దుమ్ము, కాలుష్యం, ఒత్తిడి, మారిన లైఫ్ స్టైల్ వల్ల ముఖంపై మెరుపు తగ్గిపోతోంది. దీనికోసం ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్, ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. కానీ వీటి వల్ల అందం ఎక్కువ కాలం నిలవదు. అదే మీరు కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే చర్మానికి ఎలాంటి నష్టం జరగదు, ముఖంపై గ్లో కూడా ఎక్కువ కాలం ఉంటుంది.

ముఖంపై మళ్లీ మంచి మెరుపు రావడానికి బొప్పాయి పండుని వాడచ్చు. బొప్పాయిలో చర్మానికి అవసరమైన విటమిన్ ఏ, సి తో పాటు పపైన్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటాయి. అందుకే మీరు బొప్పాయి ఫేస్ ప్యాక్‌ను వారానికి మూడు నుంచి నాలుగు సార్లు వేసుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
బొప్పాయి ఎలా ఉపయోగపడుతుంది?
Image Credit : stockPhoto

బొప్పాయి ఎలా ఉపయోగపడుతుంది?

బొప్పాయి గుజ్జును ముఖానికి రాయడం వల్ల అందులో ఉండే పపైన్ ఎంజైమ్ చర్మంపై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగిస్తుంది. అలాగే ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మంలో కొల్లాజెన్ పెరగడానికి సాయపడతాయి. దీనివల్ల చర్మం చాలా మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉన్న మొటిమల మచ్చలు, ట్యానింగ్ తగ్గడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది.

బొప్పాయి ఫేస్ ప్యాక్ తయారు చేయడం చాలా సులువు. బాగా పండిన బొప్పాయి ముక్కను తీసుకోవాలి. ఈ ముక్కలను బాగా మెత్తగా చేసి, అందులో ఒక చెంచా తేనె, అర చెంచా పెరుగు కలపండి. ఇలా తయారు చేసిన ఫేస్ ప్యాక్‌ను ముఖానికి, మెడకు రాసుకుని అరగంట పాటు ఉంచుకోండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోండి. ఈ ప్యాక్‌ను వారానికి మూడు, నాలుగు సార్లు అప్లై చేస్తే చాలు ముఖానికి మెరుపు వచ్చేస్తుంది.

33
ట్యానింగ్, మచ్చలు తగ్గడానికి..
Image Credit : stockPhoto

ట్యానింగ్, మచ్చలు తగ్గడానికి..

ఎండ వల్ల చర్మంపై ఏర్పడిన ట్యానింగ్ తగ్గించడానికి బొప్పాయి, నిమ్మరసం ఫేస్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. బొప్పాయిలోని ఎంజైమ్స్ చర్మాన్ని లోపలి నుంచి శుభ్రం చేస్తాయి. నిమ్మకాయలోని విటమిన్ సి చర్మానికి గ్లో ఇస్తుంది. అయితే సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్లు నిమ్మరసాన్ని తక్కువగా వాడాలి.

బొప్పాయి ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి. మీకు ఏదైనా అలర్జీ లేదా చర్మ సమస్యలు ఉంటే ముందుగా చేతిపై ప్యాచ్ టెస్ట్ చేసి చూడండి. ఫేస్ ప్యాక్ కడుక్కున్న తర్వాత చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకోండి. ఇలా చేస్తే చర్మం పొడిబారకుండా హైడ్రేటెడ్‌గా ఉంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
సౌందర్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sesame Seeds: ప్రతిరోజూ గుప్పెడు నువ్వులు ఎందుకు తినాలి?
Recommended image2
Chicken: చికెన్ లో ఏ భాగం అస్సలు తినకూడదు? చికెన్ ఎలా తింటే ఆరోగ్యకరం..?
Recommended image3
Festival Sarees: బతుకమ్మ, దసరా పండగ కోసం స్పెషల్ పట్టు చీరలు.. టాప్ ట్రెండింగ్ కలెక్షన్ ఇదిగో!
Related Stories
Recommended image1
Free Train: మనదేశంలో ఎవరైనా ఉచితంగా ప్రయాణించగల రైలు ఇదొక్కటే.. ఈ ట్రైన్ ఎక్కడుందో తెలుసా?
Recommended image2
Godavari: గోదావరి నది సముద్రంలో కలిసే చోట కనిపించే అద్భుతం.. ‘అన్నా చెల్లెళ్ల గట్టు’
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved