MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Kulcha Capital: మనదేశంలో ‘కుల్చా క్యాపిటల్‌’గా పేరొందిన నగరమేదో తెలుసా? వరల్డ్ వైడ్ ఫేమస్ ఇది

Kulcha Capital: మనదేశంలో ‘కుల్చా క్యాపిటల్‌’గా పేరొందిన నగరమేదో తెలుసా? వరల్డ్ వైడ్ ఫేమస్ ఇది

Kulcha Capital: బయట కరకరలాడుతూ.. లోపల మెత్తగా, మసాలా ఆలూతో నిండిన ఆలూ కుల్చా పేరు వినగానే నోరూరుతుంది. పంజాబ్‌ వంటల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ ఫుడ్ వెనుక ఉన్న విశేషాలేంటి? అమృత్‌సర్‌ కుల్చాకు అంతటి పేరెందుకు వచ్చిందో తెలుసుకుందాం.

2 Min read
Author : Nandini Arava
Published : Oct 27 2026, 03:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కుల్చా క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్
Image Credit : chatgpt

కుల్చా క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్

బయటకు కరకరలాడుతూ.. లోపల మెత్తగా, మసాలాతో నిండిపోయి.. పైన వెన్న లేదా నెయ్యి రాస్తే ఆ రుచే వేరు! పక్కన ఘాటైన చోలే, సలాడ్, చల్లని లస్సీ ఉంటే ఆ కాంబినేషనే వేరు. అయితే, ఈ ప్రత్యేకమైన కుల్చాకు ప్రసిద్ధి చెందిన నగరం మన దేశంలోనే ఉంది. అదే పంజాబ్‌లోని అమృత్‌సర్. అందుకే ఈ నగరాన్ని ‘కుల్చా క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్’ అని కూడా పిలుస్తారు.

కుల్చా క్యాపిటల్‌గా అమృత్‌సర్ ఎందుకు ప్రసిద్ధి?

పంజాబ్‌లోని అమృత్‌సర్ అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది స్వర్ణ దేవాలయం. కానీ ఈ నగరానికి మరో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. అదే అమృత్‌సరీ కుల్చా. ఇక్కడి వీధుల్లో అడుగుపెడితే అనేక ప్రాంతాల్లో కుల్చా దుకాణాలు కనిపిస్తాయి. చిన్న వీధి హోటళ్ల నుంచి పేరొందిన రెస్టారెంట్ల వరకు ఈ వంటకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

అమృత్‌సర్‌కు వచ్చే పర్యాటకులు స్థానిక వంటకాలను రుచి చూడాలనుకుంటే అమృత్‌సరీ కుల్చాను తప్పకుండా ప్రయత్నిస్తారు. భారత ప్రభుత్వ పర్యాటక వెబ్‌సైట్ ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’ కూడా ఈ నగరంలో రుచి చూడాల్సిన ప్రత్యేక వంటకాల్లో అమృత్‌సరీ కుల్చాను ప్రస్తావించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సాధారణ కుల్చాకు దీనికి తేడా ఏంటి?
Image Credit : gemini ai

సాధారణ కుల్చాకు దీనికి తేడా ఏంటి?

సాధారణంగా ఉత్తర భారత వంటల్లో కుల్చాను కూరలతో కలిపి తింటారు. ఢిల్లీ తరహా కుల్చా-చోలే కూడా చాలా మందికి పరిచయమే. కానీ అమృత్‌సరీ కుల్చా కాస్త డిఫరెంట్. ఇది తింటే భోజనం చేసిన ఫీల్ వస్తుంది.

దీని తయారీలో గోధుమ పిండితో తయారు చేసిన ముద్దను పొరలుగా చేసి, అందులో మసాలా కలిపిన బంగాళాదుంపల మిశ్రమాన్ని నింపుతారు. కొన్నిచోట్ల ఉల్లిపాయలు, పనీర్ వంటి ఇతర పదార్థాలతోనూ తయారు చేస్తారు. ఆ తర్వాత మట్టి తందూర్‌లో కాల్చుతారు. ఇలా కాల్చడం వల్ల బయట పొర బంగారు రంగులోకి మారి కరకరలాడుతుంది. లోపలి భాగం మాత్రం మెత్తగా, రుచికరమైన మసాలాతో టేస్టీగా ఉంటుంది. చివరగా పైన నెయ్యి అద్ది వేడివేడిగా వడ్డిస్తారు. పక్కన ఘాటైన చోలే, చట్నీ ఇస్తారు.

34
అమృత్‌సరీ కుల్చా ఇంత పాపులర్ ఎలా అయింది?
Image Credit : gemini ai

అమృత్‌సరీ కుల్చా ఇంత పాపులర్ ఎలా అయింది?

కుల్చా చరిత్ర ఆధునిక అమృత్‌సర్ కంటే చాలా పాతదని పరిశోధకులు చెబుతారు. మధ్య ఆసియా ప్రాంతాల్లో కనిపించే రొట్టెల సంప్రదాయాలు, తందూర్‌లో వంట చేసే పద్ధతులు...దీనిపై ప్రభావం చూపి ఉండవచ్చని అభిప్రాయాలు ఉన్నాయి. పులిసిన పిండితో తయారు చేసే ఖమీర్రొట్టె వంటి వంటకాలతోనూ దీనికి సంబంధం ఉండవచ్చని చెబుతారు.

తరతరాలుగా అమృత్‌సర్ ప్రజల ఆహార అలవాట్లలో ఇది భాగమైంది. ముఖ్యంగా అల్పాహారంగా కుల్చా తినడం ఇక్కడి ప్రజలకు ఎంతో ఇష్టం. నగరంలోని అనేక ప్రాంతాల్లో స్థానికులు తమకు నచ్చిన దుకాణాలకే వెళ్లి కుల్చాను ఆస్వాదిస్తుంటారు.

44
అమృత్‌సర్‌లో కుల్చా ఎక్కడ తినాలి?
Image Credit : gemini ai

అమృత్‌సర్‌లో కుల్చా ఎక్కడ తినాలి?

అమృత్‌సర్‌కు వెళ్లేవారు స్థానికంగా ప్రసిద్ధి చెందిన కొన్ని దుకాణాల్లో అమృత్‌సరీ కుల్చాను రుచి చూడవచ్చు. వాటిలో భరావాన్ దా ఢాబా , కుల్చా ల్యాండ్ (Kulcha Land), మోను కుల్చా హట్ (Monu Kulcha Hut) వంటి పేర్లు తరచూ వినిపిస్తుంటాయి.

విదేశాల్లోనూ అమృత్‌సరీ కుల్చాకు క్రేజ్

ఒకప్పుడు పంజాబ్ ప్రాంతానికి మాత్రమే ఎక్కువగా పరిమితమైన అమృత్‌సరీ కుల్చా.. ఇప్పుడు దేశంలోని అనేక నగరాల్లోని రెస్టారెంట్లలోనూ కనిపిస్తోంది. విదేశాల్లోని పంజాబీ రెస్టారెంట్లలో కూడా దీనికి ప్రత్యేక స్థానం ఉంది. అయినప్పటికీ, అసలైన అమృత్‌సరీ రుచిని ఆస్వాదించాలంటే అమృత్‌సర్‌లోనే తినాలని చాలామంది ఆహార ప్రియులు భావిస్తుంటారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Glass Bangles: చీరల మీదకు సెట్ అయ్యే గ్లాస్ బ్యాంగిల్స్ డిజైన్లు
Recommended image2
Karthika Masam: 2026లో కార్తీక మాసం ఏరోజు నుంచి ప్రారంభమవుతుంది? ముఖ్యమైన పండుగల తేదీలు ఇవే
Recommended image3
Bracelet Designs: చేతులకు మెరుపునిచ్చే వెండి బ్రేస్లెట్స్.. ఇవిగో!
Related Stories
Recommended image1
Crab Omelette: పీతలతో క్రేజీ ఆమ్లెట్.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? అస్సలు వదలరు
Recommended image2
Pizza Capital: ఏంటీ పిజ్జాకు ఓ పుట్టినిల్లు ఉందా? ఇక్కడి పిజ్జా స్పెషాలిటీలే వేరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved