రోజూ గుప్పెడు వేరు శెనగలను తింటే.. బాదం తిన్నవాటి కంటే ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు..
రోజూ గుప్పెడు వేరుశెనగలను తినడం వల్ల బ్రెయిన్ షార్ప్ గా పని చేస్తుంది. అంతేకాదు ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా పోగొడుతాయి.
డ్రై ఫ్రూట్స్ లో బాదం పప్పులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. అందుకే వీటినే రెగ్యులర్ గా తింటుంటారు. మీకు తెలుసా.. బాదం పప్పులతో సమానంగా వేరుశెనగలు కూడా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. బాదం పప్పులే కావు వేరుశెనగలు కూడా మెదడును అభివృద్ధి చేస్తాయి. ఈ వేరు శెనగల వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు జరుగుతుందో తెలుసుకుందాం పదండి.
వేరుశెనగల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటేనే ఎలాంటి రోగాలు సోకవు. అయితే ఈ వేరుశెనగలను రెగ్యులర్ గా తినొచ్చు. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారికి కూడా వేరుశెనగలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. వేరుశెనగలు శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. అలాగే అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుంది. ఈ పప్పులు ఊబకాయాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతాయి. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయి.
వేరు శెనగలను తినే పద్దతి
10 నుంచి 15 వేరుశెనగలను తీసుకుని గ్లాస్ చల్లటి నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయం లేవగానే వీటిని తినండి. దీంతో షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. మీ డైట్ లిస్ట్ లో గుప్పెడు గింజలను చేర్చుకుంటే కచ్చితంగా మీరు బరువు తగ్గుతారు. శరీరంలో శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది.
వేరుశెనగలు బాదం పప్పుల మాదిరిగానే మెదడు అభివృద్ధికి సహాయపడుతాయి. ఎందుకంటే ఈ గింజల్లో బి3 పుష్కలంగా ఉంటుంది. ఇది మెమరీ పవర్ పెంచడానికి సహాయపడుతుంది. వేరుశెనగ వెన్న లేదా పీనట్ వెన్న కూడా శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వేరుశెనగలు పచ్చిగా తిన్నా ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. వీటిని కూరల్లో వేస్తే రుచి అదిరిపోతుంది. బంగాళాదుంప ఫ్రై, సెమోలినా, పాయసం వంటి వంటకాల్లో వీటిని ఉపయోగించొచ్చు. వేరుశెనగలను పులావ్ లో కూడా వేయొచ్చు. వీటిని మోతాదులో తింటే ఎలాంటి సమస్యా తలెత్తదు. ఎందుకంటే వీటిలో ఎన్నో పోషకాలుంటాయి. ఇవి శరీర శక్తిని పెంచడానికి సహాయపడతాయి.