Ajwain vs Saunf: భోజనం తర్వాత కడుపు ఉబ్బరంగా ఉందా? వాము నీళ్లు, సోంపు నీళ్లలో ఏది మంచిది?
Ajwain vs Saunf: భోజనం కాస్త ఎక్కువగా తిన్న తర్వాత కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి, కడుపు నిండినట్టుగా అనిపించడం సాధారణమే. ఇలాంటి సమయంలో చాలామంది వాము నీళ్లు లేదా సోంపు నీళ్లు తాగుతుంటారు. అయితే వాము నీళ్లు మంచివా? సోంపు నీళ్లు మంచివా?

వాము నీళ్లు మంచివా? సోంపు నీళ్లు మంచివా?
చాలా మందికి భోజనం తర్వాతా కాస్త ఎక్కువగా తిన్న తర్వాత కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి, కడుపు నిండినట్టుగా అనిపించడం సాధారణమే. ఇలాంటి సమయంలో కొంతమంది వాము నీళ్లు లేదా సోంపు నీళ్లు తాగుతుంటారు. మరి నిజంగానే వాటివల్ల ఫలితం ఉంటుందా? రెండూ ఒకే విధంగా పనిచేస్తాయని చెప్పలేం. అయితే మరి వాము నీళ్లు మంచివా? సోంపు నీళ్లు మంచివా?
వాము వాటర్ జీర్ణ సమస్యలకు ఉపయోగపడుతుందా?
వాములో థైమాల్ అనే సహజ సమ్మేళనం ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలపై వాముతో తయారు చేసిన కొన్ని పదార్థాలను పరిశోధకులు అధ్యయనం చేశారు. అయితే ప్రత్యేకంగా ఒక గ్లాసు వాము నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలపై మాత్రమే ఈ పరిశోధనలు జరగలేదు.
2017లో Avicenna Journal of Phytomedicineలో ప్రచురితమైన ఒక అధ్యయనంలో ఫంక్షనల్ డిస్పెప్సియాతో బాధపడుతున్న 150 మందిని పరిశీలించారు. ఈ సమస్యలో కడుపు ఉబ్బరం, కడుపు నిండినట్లు అనిపించడం, అసౌకర్యం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ అధ్యయనంలో వారు ఉపయోగించింది ఏంటంటే...వాము, సెలెరీ మిక్సింగ్. కేవలం వాము నీళ్లు కాదు.
కొన్ని వారాల తర్వాత కడుపు ఉబ్బరం, తేన్పులు, వికారం, కడుపు నిండిన భావన, కొద్దిగా తినగానే కడుపు నిండిపోవడం వంటి లక్షణాలు తగ్గాయని తెలిపారు. అయితే ఈ ఫలితాల ఆధారంగా భోజనం తర్వాత ఒక గ్లాసు వాము నీళ్లు తాగితే అదే స్థాయిలో ఉపశమనం లభిస్తుందని చెప్పలేమని పరిశోధకులు తెలిపారు.
సోంపు వాటర్ ఎలా ఉపయోగపడుతుంది?
సోంపు (Saunf) కూడా భోజనం తర్వాత తింటూ ఉంటారు. తిన్న తర్వాత కడుపు ఉబ్బరం లేదా అసౌకర్యంగా అనిపించినప్పుడు చాలామంది సోంపు నీళ్లు తాగుతుంటారు. సోంపులో అనెథోల్ వంటి సహజ సమ్మేళనాలు ఉంటాయి. దీనిని జీర్ణ సమస్యల కోసం ఉపయోగిస్తున్నారు. అయితే భోజనం తర్వాత ఒక గ్లాసు సోంపు నీళ్లు తాగడం వల్ల నేరుగా జీర్ణక్రియ మెరుగుపడుతుందా లేదా కడుపు ఉబ్బరం తగ్గుతుందా అనే అంశంపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
ఉదాహరణకు, 2020లో 381 మంది శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న రోగులకు వేడి సోంపు నీళ్లు తాగిన వారికి కడుపు ఉబ్బరం తగ్గడం, కొన్ని జీర్ణక్రియ ప్రక్రియలు త్వరగా సాధారణ స్థితికి రావడం కనిపించింది. అయితే ఇది ఆసుపత్రిలో శస్త్రచికిత్స తర్వాత ఇచ్చిన చికిత్స. కాబట్టి దీనిని భోజనం తర్వాత తాగే సోంపు నీటితో నేరుగా పోల్చలేం.
ఏది బెటర్?
గ్యాస్, కడుపు ఉబ్బరం, భోజనం తర్వాత కడుపు బరువుగా అనిపించడం వంటి సమస్యలకు వామును ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సోంపు మాత్రం భోజనం తర్వాత చాలామంది వాడుతారు. అయితే వాము నీళ్లు లేదా సోంపు నీళ్లు జీర్ణ సమస్యలకు కచ్చితమైన పరిష్కారం అని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. కాబట్టి మీకు ఉన్న అసౌకర్యం, శరీర పరిస్థితిని బట్టి వీటిని ఎంచుకోవచ్చు. తరచూ అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా నొప్పి ఉంటే మాత్రం నిపుణులను సంప్రదించడం మంచిది.

