MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • River: ఈ నదిలో ప్రతి రాయి.. ఒక శివలింగంగా మారుతుంది.. ఆ నది నీళ్లలో దాగి ఉన్న రహస్యం ఏంటి?

River: ఈ నదిలో ప్రతి రాయి.. ఒక శివలింగంగా మారుతుంది.. ఆ నది నీళ్లలో దాగి ఉన్న రహస్యం ఏంటి?

River: నదుల్లో నీటి అడుగున రాళ్లు ఉండటం చాలా సహజం. ఒక్కో రాయి ఒక్కో ఆకారంలో ఉంటుంది. కానీ, ఓ నదిలో మాత్రం..మీరు ఏ రాయి చూసినా శివలింగం ఆకారంలోనే ఉంటుంది. ఆ నదిలో ఉన్న ప్రత్యేకత ఏంటి?

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 25 2026, 05:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
నదిలో అద్భుతం..
Image Credit : Gemini ai

నదిలో అద్భుతం..

భారతీయ సంస్కృతిలో నదులకు అత్యున్నత ప్రాధాన్యత ఉంది. మన దేశంలోని ప్రతి నది వెనక ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక చరిత్ర, సైంటిఫిక్ రహస్యాలు దాగి ఉన్నాయి. ఏ రాయి అయినా దేవుడిగా మారాలి అయితే.. ఎవరో ఒకరు శిల్పి ఆ రాయిని చెక్కాల్సి ఉంటుంది. కానీ, శిల్పి చెక్కాల్సిన అవసరమే లేకుండా.. నదీ ప్రవాహ తాకిడికి రాళ్లు తమంతట తామే పవిత్ర శివ లింగాలుగా మారే అరుదైన నది గురించి మీకు తెలుసా? దక్షిణ భారతదేశంలోనూ, మధ్య భారత ప్రదేశ్ లోనూ ప్రవహించే కొన్ని పవిత్ర నదులు ఈ విచిత్రమైన ప్రకృతి అద్భుతానికి నిలయాలు మారాయి. ఆ నదీ ఏంటి? ఆ నదిలో రాళ్లు శివలింగాలుగా ఎలా మారతాయో ఇప్పుడు చూద్దాం....

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
.నీటి ప్రవాహంతో.. శివలింగాలుగా మారే రాళ్లు...
Image Credit : Gemini ai

.నీటి ప్రవాహంతో.. శివలింగాలుగా మారే రాళ్లు...

నదుల్లో నీరు నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ నీటి ప్రవాహానికి.. అడుగున ఉండే గులకరాళ్లు.. నిరంతరం తిరుగుతూ.. మెలికలు తిరుగుతూ... అత్యంత నునుపుగా మారతాయి. అయితే, విచిత్రం ఏమిటంటే.. ఈ రాళ్లు ఏ ఇతర ఆకారంలోకి మారకుండా.. పర్ఫెక్ట్ గా.. శివలింగంలోకి మాత్రమే మారతాయి. ఒకటి రెండు రాళ్లు కాదు.. నదిలో ఉన్న రాళ్లన్నీ శివలింగం ఆకారంలోనే ఉంటాయి. సహజంగా లింగాలుగా మారడంతో.. వీటిని నర్మదా లింగాలు, బాణలింగాలుు అని కూడా పిలుస్తారు.

33
శివలింగాలు ఏర్పడే నదులు ఎక్కడున్నాయి..?
Image Credit : Asianet News

శివలింగాలు ఏర్పడే నదులు ఎక్కడున్నాయి..?

నేత్రవతి నది: కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో జన్మించే పవిత్ర నేత్రవతి నదీ తీర ప్రాంతాల్లో , ధర్మస్థల సమీపంలో ప్రవహించే నీటి ప్రవాహంలో ఇలాంటి సహజ శివలింగ ఆకారాలు కనిపిస్తాయి. ఈ నదికి ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉంది.

నర్మదా , శివనాథ్ నదులు: మధ్యప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ప్రవహించే నర్మదా, శివనాథ్ నదీ పరివాహక ప్రాంతాలు బాణలింగాలకు ప్రపంచ ప్రసిద్ధి. ఇక్కడి నదీ గర్భం నుంచి తీసే ప్రతి రాయి శివస్వరూపమేనని భక్తుల నమ్ముతారు.

సాధారణంగా ఆలయాల్లో ప్రతిష్ఠించే శివలింగాలను శిల్పులు రాతిని చెక్కి తయారుచేస్తారు. కానీ ఈ పవిత్ర నదుల్లో లభించే బాణలింగాలకు ఎటువంటి ప్రాణప్రతిష్ఠ లేదా చెక్కడం అవసరం లేదని, ఇవి స్వయంభూ శక్తులతో కూడుకుని ఉంటాయని వేద పండితులు చెప్తారు. ఈ రాళ్లపై సహజంగానే ఓం ఆకారం, త్రిశూలం లేదా విభూతి రేఖలను పోలిన చారలు ఏర్పడటం మరో విశేషం.. వీటిని ఇళ్లలో, దేవాలయాలలో ప్రతిష్ఠించుకుని పూజించడం వల్ల అత్యంత శుభఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sweet Corn Vs Native Corn : విదేశీ స్వీట్ కార్న్, స్వదేశీ మొక్కజొన్నల్లో ఏది బెస్ట్ ఫుడ్? దేంట్లో బలం ఎక్కువ?
Recommended image2
Blouse Sleeves: మీ చీరలకు అద్భుతమైన లుక్ తెచ్చే బ్లౌజ్ స్లీవ్ డిజైన్లు
Recommended image3
Garlic City: ఇండియాలో ఏ నగరాన్ని 'గార్లిక్ సిటీ' అని పిలుస్తారో తెలుసా?
Related Stories
Recommended image1
Poori: నూనె పీల్చకుండా పూరీలు బాగా పొంగాలా? పిండిలో ఇదొక్కటి కలిపి చూడండి..!
Recommended image2
Blood River: నీళ్లు కాదు.. రక్తం ఏరులైపారే నది మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved