MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Weight loss: 40 రోజుల్లో 15 కేజీల బరువు తగ్గిన నటి, ఏం తిన్నదో తెలుసా?

Weight loss: 40 రోజుల్లో 15 కేజీల బరువు తగ్గిన నటి, ఏం తిన్నదో తెలుసా?

ఐశ్వర్యా భాస్కరన్ ఎక్కువ తెలుగు, తమిళం, మళయాళ చిత్రాలలో రాణించారు. ఆమె భాగ్యరాజ్ రాసుకుట్టి , స్వయంవరంతో సహా 30-40 కంటే ఎక్కువ చిత్రాలలో నటించింది.

2 Min read
ramya Sridhar
Published : May 20 2025, 04:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
అలనాటి అందాల తార
Image Credit : Social Media

అలనాటి అందాల తార

అలనాటి హీరోయిన్లలో ఒకరైన నటి ఐశ్వర్య భాస్కరన్ మీకు గుర్తుండే ఉంటారు. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటించి అందరినీ అలరించారు. ఇప్పటికే అంతే అందంతో మెరిసిపోతున్న ఐశ్వర్య ఒకానొక సమయంలో 15 కేజీల బరువు తగ్గారట. అది కూడా కేవలం 40 రోజుల్లో. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వివరించారు.తన ఫుడ్ లో మార్పులు చేసుకోవడం వల్ల తాను బరువు తగ్గినట్లు ఆమె చెప్పారు.

25
సీరియల్స్ లో నటిస్తున్న నటి ఐశ్వర్య భాస్కరన్
Image Credit : Facebook

సీరియల్స్ లో నటిస్తున్న నటి ఐశ్వర్య భాస్కరన్

ఐశ్వర్యా భాస్కరన్ ఎక్కువ తెలుగు, తమిళం, మళయాళ చిత్రాలలో రాణించారు. ఆమె భాగ్యరాజ్ రాసుకుట్టి , స్వయంవరంతో సహా 30-40 కంటే ఎక్కువ చిత్రాలలో నటించింది. ఆమె ప్రస్తుతం సినిమాల్లో తల్లి పాత్రలో, సీరియల్స్‌లో ప్రధాన పాత్రలలో నటిస్తోంది. 2018లో ఆమె శరీర బరువు 90 కిలోలకు చేరుకున్న తర్వాత, తీసుకునే ఆహారంలో మార్పులు చేసిందట. ఫలితంగా 15 కిలోలు తగ్గింది.

Related Articles

Weight Loss: గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ ? బరువు తగ్గేందుకు ఏది బెటర్?
Weight Loss: గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ ? బరువు తగ్గేందుకు ఏది బెటర్?
Summer Food: వేసవిలో పిల్లలకు కచ్చితంగా ఇవ్వాల్సిన ఆహారాలు ఇవే!
Summer Food: వేసవిలో పిల్లలకు కచ్చితంగా ఇవ్వాల్సిన ఆహారాలు ఇవే!
35
ఐశ్వర్య 40 రోజుల్లో 15 కిలోల బరువు తగ్గింది
Image Credit : Social Media

ఐశ్వర్య 40 రోజుల్లో 15 కిలోల బరువు తగ్గింది

ఐశ్వర్య 2018లో ప్లాంట్ బేస్డ్ ఆహారం తీసుకోవడం మొదలుపెట్టారు. దాని వల్ల తన శరీరంలో చాలా మార్పులు వచ్చాయని ఆమె చెప్పారు. అప్పటి నుంచి తాను పాల ఉత్పత్తులు, అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండటం మొదలుపెట్టారట.ప్రతి పది సంవత్సరాలు స్త్రీల శరీరం మారుతుందని, మనం ఎప్పుడూ మన శరీరం మాట వినాలి అని ఆమె చెబుతుంటారు. సాయంత్రం 6 తర్వాత ఆకలిగా లేకపోతే తినకుండా ఉండటమే మంచిదని ఆమె సూచించారు. ఆకలిగా లేకపోతే అస్సలు తినకూడదట. దాని వల్ల తాను 40 రోజుల్లో 15 కేజీల బరువు చాలా ఈజీగా తగ్గానని ఆమె చెప్పారు.

45
బరువు తగ్గించే యోగా..
Image Credit : Twitter

బరువు తగ్గించే యోగా..

తగ్గిన బరువును అలానే మెయింటైన్ చేయడానికి తాను రెగ్యులర్ గా యోగా చేయడం మొదలుపెట్టానని ఐశ్వర్య భాస్కరన్ చెప్పారు. యోగా చేయడం వల్ల మెడ, తుంటి సమస్యలు కూడా తగ్గాయని చెప్పారు.యోగా సరిగ్గా నేర్చుకుంటే బరువు పెరిగే అవకాశమే ఉండదని ఆమె సలహా ఇస్తున్నారు. యోగాని నిపుణులు దగ్గర మాత్రమే నేర్చుకోవాలని, యూట్యూబ్ చూసి కాదు అని ఆమె చెప్పారు.

55
ముఖ సౌందర్యం కూడా పెరిగింది..
Image Credit : Social Media

ముఖ సౌందర్యం కూడా పెరిగింది..

ఇలా బరువు తగ్గడం మొదలుపెట్టిన తర్వాత తన ముఖం సహజంగానే అందంగా కనపడటం మొదలుపెట్టిందని ఆమె చెప్పారు. కేవలం నీటితో ఫేస్ వాష్ చేసుకునేదాన్ని అని, అసలు మేకప్ అవసరం రాలేదని చెప్పారు. అందాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారం తీసుకోవడం, మానసిక ఆరోగ్యం కాపాడుకోవడం, మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం చాలా అవసరం అని ఆమె చెప్పారు.

ramya Sridhar
About the Author
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...
మహిళలు
సౌందర్యం
ఆరోగ్యం
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved