MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Roasted Chana: రోజూ గుప్పెడు వేయించిన శనగలు తింటే ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో తెలుసా?

Roasted Chana: రోజూ గుప్పెడు వేయించిన శనగలు తింటే ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో తెలుసా?

Roasted Chana: ఈ కాలం పిల్లలు దీనిని తినడం మర్చిపోయారు. కానీ, మార్కెట్లో దొరికే చిప్స్, బిస్కెట్లకు బదులు, ప్రతిరోజూ గుప్పెడు వేయించిన శనగలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 26 2026, 01:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
వేయించిన శనగలు..
Image Credit : geminiai

వేయించిన శనగలు..

ప్రస్తుతం అందరిదీ ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి డైటింగ్, ఖరీదైన సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మన వంటింట్లో ఈజీగా దొరికే వేయించిన శనగలు తింటే చాలు. ముఖ్యంగా రోజూ గుప్పెడు పొట్టుతో వేయించిన శనగలు తింటే శరీరానికి ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
1.బరువు తగ్గించే శనగలు..
Image Credit : geminiai

1.బరువు తగ్గించే శనగలు..

బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి వేయించిన శనగలు ఒక పర్ఫెక్ట్ స్నాక్. వీటిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. చాలా మందికి సాయంత్రం స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. అలాంటి సమయంలో చిప్స్, బిస్కెట్స్ లాంటి జంక్ ఫుడ్ బదులుగా, గుప్పెడు శనగలు తింటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీని వల్ల పదే పదే తినాలనే కోరిక తగ్గుతుంది. ముఖ్యంగా జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది. క్రేవింగ్స్ తగ్గుతాయి. ఫలితంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

2.కండరాలకు బలం..

శనగల్లో ప్లాంట్-బేస్డ్ ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. రోజూ వీటిని తినడం వల్ల శరీరానికి కావలసిన శక్తి నిరంతరం అందుతుంది. ఇవి జీర్ణం కావడానికి సమయం పడుతుంది కాబట్టి, త్వరగా నీరసం రాకుండా రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.

3. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది..

శనగల్లో ఉండే సమృద్ధిగా ఉండే పీచు పదార్థం (Fibre) మలబద్ధకం, అజీర్తి వంటి పొట్ట సమస్యలను దరిచేరనివ్వదు. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో శనగలు ఎంతగానో సహాయపడతాయి.

4. షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.. 

డయాబెటిస్ తో బాధపడేవారికి వేయించిన శనగలు అద్భుతమైన ఆహారం. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రిస్తాయి, బ్లడ్ షుగర్‌ను స్థిరంగా ఉంచడంలో తోడ్పడతాయి.

5. గుండె ఆరోగ్యం, కొలెస్ట్రాల్ చెక్.. 

శనగలలో ఉండే పోషకాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి, గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. రక్తపోటు అదుపులో ఉండేలా సహాయపడతాయి.

33
రోజుకు ఎంత తీసుకోవాలి..?
Image Credit : geminiai

రోజుకు ఎంత తీసుకోవాలి..?

రోజుకు సుమారు 100 గ్రాములు అంటే రెండు గుప్పెళ్లు లేదా రెండు చిన్న బౌల్స్ వేయించిన శనగలు తినడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. మార్కెట్లో దొరికే వాటిని నేరుగా తినవచ్చు లేదా వీటిలో కొద్దిగా టమోటాలు, ఉల్లిపాయలు, నిమ్మరసం, కొత్తిమీర కలిపి టేస్టీ చనా చాట్ లాగా కూడా తయారుచేసుకోవచ్చు. మీ శరీరంలో వచ్చే మార్పులను మీరే స్వయంగా చూస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
All spice Plant: అన్ని రకాల మసాలాలు అవసరం లేదు.. ఇదొక్కటి వేస్తే చాలు చికెన్, మటన్ టేస్ట్ అదిరిపోద్ది
Recommended image2
Parenting: పిల్లలు ఫోన్‌కు ఎక్కువగా అలవాటు పడకూడదంటే పేరెంట్స్ ఈ 5 చేస్తే చాలు!
Recommended image3
Potato Papad: క్రిస్పీ బంగాళాదుంప అప్పడాలు.. ఇంట్లో సులువుగా ఇలా చేసేయండి
Related Stories
Recommended image1
Makhana Capital: మన దేశంలో మఖానా రాజధాని ఏది? ప్రపంచం మొత్తానికి ఇక్కడి నుంచే సరఫరా..!
Recommended image2
Jaggery Capital: మన దేశపు బెల్లం రాజధాని ఏదో తెలుసా? ప్రపంచంలోనే అతిపెద్ద బెల్లం మార్కెట్ ఇది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved