Chanakya Niti: చాణక్యుడి ప్రకారం ఎదుటివారి మనసులో ఏముందో ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు!
Chanakya Niti: ఈ రోజుల్లో అందరినీ గుడ్డిగా నమ్మడం చాలా ప్రమాదం. ఎదుటి వ్యక్తి నవ్వులు, చేతలు, ముఖ కవళికలను బట్టి వారి మనసులో ఏముందో, వాళ్లు మీ గురించి ఏమనుకుంటున్నారో ఎలా తెలుసుకోవాలో ఆచార్య చాణక్యుడు కొన్ని చిట్కాలు చెప్పారు. అవేంటో ఇక్కడ చూద్దాం.

మాటలు కాదు, చేతలు ముఖ్యం
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఒక వ్యక్తి నిజ స్వరూపం మాటల్లో కాదు, చేతల్లోనే తెలుస్తుందని చెప్పారు. జనం మనం ఏం వినాలనుకుంటున్నామో అదే చెబుతారు. కానీ వారి పనులే అసలు నిజాన్ని బయటపెడతాయి. కొందరు స్నేహితులు సాయం చేస్తామని మాటిస్తారు. కానీ, అవసరమైనప్పుడు కనిపించకుండా పోతారు. అందుకే మాటల్ని కాదు, వారి చేతల్ని నమ్మాలని చాణక్యుడు బోధించాడు.

కళ్లు చెప్పే నిజం
కళ్లను ఆత్మకు అద్దంగా చెప్తాడు చాణక్యుడు. ఎవరైనా అబద్ధం చెబుతున్నారా లేదా ఏదైనా దాస్తున్నారా అని తెలుసుకోవాలంటే, వాళ్ల కళ్లలోకి చూడమని చాణక్య నీతి చెబుతోంది. తరచుగా కనురెప్పలు ఆర్పడం, చూపు కలపకపోవడం వంటివి నిజం దాస్తున్నారని చెప్పడానికి సంకేతాలు. నిజాయతీపరుల కళ్లు ప్రశాంతంగా, స్పష్టంగా ఉంటాయి.
బలహీనులతో ప్రవర్తించే విధానం
ఒక వ్యక్తి అసలు స్వరూపం తనకంటే బలహీనులతో ఎలా ప్రవర్తిస్తాడనే దానిపై ఆధారపడి ఉంటుందని చాణక్య నీతి చెబుతోంది. వెయిటర్లు, సెక్యూరిటీ గార్డులు, డ్రైవర్లు, పిల్లలు, జంతువులతో వాళ్లు ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించాలి. పలుకుబడి ఉన్నవారికే గౌరవం ఇచ్చి, బలహీనులతో చెడుగా ప్రవర్తించే వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిదని చాణక్యుడు పేర్కొన్నాడు.
నవ్వు వెనుక ఉన్న రహస్యం
ఎక్కువగా మాట్లాడేవారు
ఒక వ్యక్తి బలం అతని మౌనంలోనే ఉంటుంది. తక్కువ మాట్లాడి, ఎక్కువగా గమనించేవారు తనను తాను నియంత్రణలో ఉంచుకుంటారని చాణక్యుడు చెప్పాడు. ఎక్కువగా మాట్లాడేవారు అభద్రతాభావంతో ఉంటారు. అలాగే అత్యంత ప్రశాంతంగా ఉండేవారు కూడా కాస్త ప్రమాదకరమే. వారు అవసరాన్ని, పరిస్థితిని బట్టి ప్రవర్తిస్తుంటారు.
గాసిప్స్ చెప్పేవారు
ఇతరుల గురించి మీ దగ్గర గాసిప్స్ చెప్పేవారితో జాగ్రత్తగా ఉండాలని చాణక్య నీతి చెబుతోంది. ఎందుకంటే ఇతరుల గురించి మీతో చెప్పేవాళ్లు, మీ గురించి కూడా ఇతరులతో చెప్పగలరు. కాబట్టి అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటమే మంచిదని చాణక్యుడు బోధించాడు.

