MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Life
  • Raw milk: పచ్చిపాలు నేరుగా తాగిన గర్భిణీ, శిశువు మృతి.. పచ్చిపాలు అంత ప్రమాదమా?

Raw milk: పచ్చిపాలు నేరుగా తాగిన గర్భిణీ, శిశువు మృతి.. పచ్చిపాలు అంత ప్రమాదమా?

Raw milk: పచ్చిపాలు తాగి శిశువును కోల్పోయింది ఓ తల్లి. పచ్చిపాలు తాగడం అంత ప్రాణాంతకమా అనే సందేహాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. పచ్చిపాలు ఎందుకు తాగకూడదో వైద్యులు వివరిస్తున్నారు. 

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 06 2026, 12:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పచ్చిపాలు తాగిన గర్భిణి
Image Credit : Getty

పచ్చిపాలు తాగిన గర్భిణి

నెలలు నిండిన ఒక గర్భిణి మహిళ పాలను మరగబెట్టకుండా నేరుగా పచ్చిపాలను తాగింది. అలా తాగిన కాసేపటికి ఆమె గర్భంలో ఉన్న శిశువు కు ఇబ్బందులు వచ్చాయి. దాంతో వెంటనే ప్రసవానికి వెళ్లాల్సి వచ్చింది. ప్రసవించిన కొద్దిసేపటికి శిశువు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పచ్చిపాలు తాగడం వల్ల ఇలా జరిగిందని వైద్యులు చెబుతున్నారు. మరిగించకుండా నేరుగా పచ్చిపాలు తాగడం అంత ప్రమాదకరమా? ఇది ఎలాంటి హాని చేస్తాయి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
శిశువుకే ప్రాణాంతకం
Image Credit : Getty

శిశువుకే ప్రాణాంతకం

అమెరికాలో జరిగిన ఈ సంఘటనతో గర్భిణీలు ఎవ్వరూ కూడా పచ్చిపాలను తాగొద్దని వైద్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే పచ్చిపాలతో తయారైన పదార్థాలు కూడా తినవద్దని చెప్పింది. పాలను తప్పనిసరిగా బాగా మరిగించిన తర్వాతే తాగాలని సూచించింది. లేకుంటే చిన్న నిర్లక్ష్యం కూడా ఇలా పెద్ద శిక్షకు కారణం అవుతుంది. పచ్చిపాలు ఎందుకు తాగకూడదో వైద్యులు వివరించారు. పచ్చిపాలలో లిస్టీరియా మోనోసైటోజెన్స్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది కొన్నిసార్లు ఎలాంటి ఇబ్బంది కలిగించదు. కానీ కొంతమందికి మాత్రం ప్రమాదకరంగా మారుతుంది. ముఖ్యంగా గర్భిణీ మహిళలు పచ్చిపాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బ్యాక్టీరియా వారి శరీరంలో చేరితే కొన్నిసార్లు అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. ఈ బ్యాక్టీరియా కణాలు తల్లి శరీరం నుంచి నేరుగా గర్భస్థ శిశువుకు చేరుతుంది. దీనివల్ల వెంటనే డెలివరీకి వెళ్లాల్సిన అవసరం వస్తుంది. లేదా గర్భస్రావం అవుతుంది. పురిట్లోనే శిశువు మృతి చెందే అవకాశం ఉంటుంది. తల్లికి పెద్దగా ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించవు. కానీ శిశువుపై మాత్రం తీవ్ర ప్రభావం పడుతుంది.

Related Articles

Related image1
Lucky Zodiac Signs: మకర రాశిలో రాజయోగం, ఈ 5 రాశులకు రాజభోగాలే
Related image2
Name Astrology: ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా?
34
వీరు తాగితే ప్రమాదం
Image Credit : Getty

వీరు తాగితే ప్రమాదం

పాలు ఆరోగ్యానికి మంచిది కానీ మరిగించకుండా పచ్చిగా తాగితే మాత్రం కొన్నిసార్లు ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందులో హానికరమైన బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది. అవి వ్యాధులకు కారణమవుతాయి. పచ్చి పాలలో ముఖ్యంగా సాల్మొనెల్లా, ఈ. కోలి, లిస్టీరియా వంటి సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి శరీరంలోకి వెళ్ళినప్పుడు విరేచనాలు, వాంతులు, జ్వరం, కడుపునొప్పి వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్దులు, రోగనిరోధక తక్కువగా ఉన్నవారు పచ్చిపాల జోలికి వెళ్ళకూడదు.

44
బాగా మరిగించి
Image Credit : Getty

బాగా మరిగించి

పాలను ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మరిగించడం వల్ల ఈ బ్యాక్టీరియాలు చాలా వరకు నశిస్తాయి. అప్పుడు ఆ పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది. మరిగించిన పాలపై మూత పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. గ్రామీణ ప్రాంతాల్లో అప్పుడే తీసిన పాలు మంచివని తాగేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం చాలా ప్రమాదం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
వంటింట్లో స్టవ్ పక్కనే సింక్ ఉండొచ్చా? వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారు?
Recommended image2
వాషింగ్ మెషీన్లో దుస్తులు ఉతికేటప్పుడు ఈ 7 తప్పులు చేస్తే మెషీన్ పోతుంది
Recommended image3
Potato Face Pack: బంగాళదుంప ఫేస్ ప్యాక్ తో ముఖంపై నల్లమచ్చలు మాయం!
Related Stories
Recommended image1
Lucky Zodiac Signs: మకర రాశిలో రాజయోగం, ఈ 5 రాశులకు రాజభోగాలే
Recommended image2
Name Astrology: ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved