Antique Coins: భారీగా బ‌య‌ట‌బ‌డ్డ పురాత‌న నాణేలు.. ఎక్క‌డంటే?

మ‌ధ్య‌ప్ర‌దేశ్ తిక‌మ్‌గ‌ర్హ్ జిల్లాలోని ఓ ఇసుక క్వారీలో 164 పురాత‌న నాణేలు  బ‌య‌ట‌ప‌డ్డాయి.  ఈ నాణేలు మొఘల్స్ కాలం నాటివి అని అధికారులు పేర్కొన్నారు. క్వారీలో ప‌నులు చేస్తుండ‌గా ఓ పురాత‌న కుండ బ‌య‌ట‌ప‌డింది. దీంట్లో పురాత‌న నాణేలు ల‌భించిన‌ట్లు అధికారులు తెలిపారు.
 

Collection of 164 Antique Coins found in Madhya Pradesh

Antique Coins: పురాత‌న నాణేలు, పురాత‌న వ‌స్తువులు బ‌య‌ట‌ప‌డటం అనే వార్తలు తరుచు వింటుంటాం. తాజాగా భారీ సంఖ్య‌లో పురాత‌న కాలం నాటి నాణేలు బ‌య‌ట‌ప‌డిన సంఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ తిక‌మ్‌గ‌ర్హ్ జిల్లాలో వెలుగులోకి వ‌చ్చింది.  ఓ ఇసుక క్వారీ లో ప‌నులు జ‌రుగుతుండ‌గా.. 164 పురాత‌న నాణేలు బయటపడ్డాయి. ఈ నాణేలను ప‌రిశీలించిన అధికారులు అవీ  మొఘలుల కాలం నాటివిగా తెలిపారు.

తిక‌మ్‌గ‌ర్హ్  జిల్లా మైనింగ్ అధికారి ప్రశాంత్ తివారీ వివరాల ప్ర‌కారం.. బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని జిల్లా కేంద్రానికి 55 కిలోమీటర్ల దూరంలోని నందనవర గ్రామంలో ఓ ప్ర‌వేయిటు కాంట్రాక్ట‌ర్‌కు చెందిన మైనింగ్‌లో ఇసుక క్వారీని తవ్వుతుండగా పురాత‌న కాలం నాటి ఓ కుండ బ‌య‌ట‌ప‌డింది. ఆ కుండ నుంచి పురాత‌న నాణేలు ల‌భ్య‌మయ్యాయి.  మైనింగ్ యాజ‌మాని సమాచారం స్థానిక అధికారుల‌కు స‌మాచారమివ్వ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. 

read aslo: https://telugu.asianetnews.com/andhra-pradesh/fisherman-getting-gold-coins-in-the-uppada-coastal-area-in-andhrapradesh-bsb-qkhopt
 
ఆ ప్రాంతాన్ని ప‌రిశీలించిన అధికారులు..  బయటపడ్డ ఈ 164 నాణేల్లో 12 వెండి నాణేలు, మిగితావి రాగి నాణేలు  ఉన్నాయ‌ని తెలిపారు. ఈ పురాత‌న నాణేలన్నింటిని జిల్లా ట్రెజ‌రీకి త‌ర‌లించారు.  ఈ నాణేల మీద ఉర్దూ, ప‌ర్షియ‌న్ భాష‌లు ఉన్న‌ట్లు గుర్తించారు.  ఆ భాషల‌ ఆధారంగా  ఈ నాణేలు ఏ కాలం నాటివో  పరిశోధకులు తెలుసుకోనున్నారు. నివారి జిల్లాలోని నందనవారా గ్రామానికి 45 కి.మీ దూరంలో ఉన్న ఓర్చా, రామ్ రాజా ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఇది నివారి జిల్లా 2018లో తికమ్‌ఘర్ నుండి విడిపోయింది.

read also: https://telugu.asianetnews.com/national/gold-coins-found-in-road-in-hosur-qhzqbv

కాగా,బుందేల్‌ఖాండ్ ప్రాంతాన్ని ఆఫ్ఘన్‌లు, మొఘల్స్ పాలించారు. చరిత్ర ప్రకారం.. ఈ ప్రాంతానికి  జుజార్ సింగ్ 1626లో ఓర్చా రాజు అయ్యాడు. ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్యం మ‌రింత విస్త‌రించ‌డంతో వారికి  సామంతుడిగా మారాడు. కానీ, మొఘ‌ల్స్ ను వ్య‌తిరేకించ‌డంతో   ఔరంగజేబు నేతృత్వంలోని మొఘల్ సైన్యం అతని రాజ్యం పై దాడి చేసి 1635లో దానిని స్వాధీనం చేసుకున్నారు.అప్ప‌టి నుంచి ఈ పాంత్రం మొఘ‌ల్ ఆధీనంలోకి వెళ్లింది.  గ‌తంలోనూ ఈ ప్రాంతంలో  ఆఫ్ఘన్‌లు,మొఘల్‌లకు సంబంధించిన‌  ఆనవాళ్లు పలు సందర్భాల్లో బయటపడ్డాయి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios