MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Psychology: ఎవరైనా అబద్ధం చెబుతున్నారని ఎలా కనిపెట్టాలి? ఈ 5 సైకలాజికల్ ట్రిక్స్ తో గుర్తించొచ్చు

Psychology: ఎవరైనా అబద్ధం చెబుతున్నారని ఎలా కనిపెట్టాలి? ఈ 5 సైకలాజికల్ ట్రిక్స్ తో గుర్తించొచ్చు

Psychology: జీవితంలో ఎంతో మందిని కలుస్తాం. మాట్లాడుతా. అందులో మన స్నేహితులు, బంధువులు ఉండొచ్చు. కొత్త వ్యక్తులు ఉండొచ్చు. అందరూ నిజాలే మాట్లాడతారా? కొందరు చెప్పేవి అబద్ధాలని అనిపిస్తుంది. అవతలి వ్యక్తి నిజం చెబుతున్నారా లేదా అని ఇలా గుర్తించొచ్చు.

2 Min read
Author : Nandini Arava
Published : May 08 2026, 02:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అబద్ధం చెప్తున్నారని ఎలా కనిపెట్టయొచ్చు
Image Credit : Asianet News

అబద్ధం చెప్తున్నారని ఎలా కనిపెట్టయొచ్చు

సమాజంలో బతకడం చాలా కష్టం. అందుకే మనుషుల ప్రవర్తనను నాలుగైదు మాటల్లోనే గుర్తించే నేర్పరి ఈరోజుల్లో చాలా అవసరం. లేకపోతే వాళ్ల మాటలతో నిండా ముంచే అవకాశాలు ఉన్నాయి. ఎంత స్నేహితులైనా, బంధువులైనా ఎదుటి వారు నిజం చెప్తున్నారా, అబద్ధాలు చెప్తున్నారా అనేది తెలుసుకోవాలి. సైకాలజీ ప్రకారం, మనిషి అబద్ధం చెప్పేటప్పుడు అతని మెదడుపై ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడి వల్ల శరీరంలో తెలియకుండానే కొన్ని మార్పులు సంభవిస్తాయి. అవేంటో తెలిస్తే ఎవరైనా అబద్ధం చెబుతున్నారని ఈజీగా కనిపెట్టేయవచ్చు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కళ్ల కదలికలు (Eye Movements)
Image Credit : GEMINI AI

కళ్ల కదలికలు (Eye Movements)

కళ్లు అబద్ధం చెప్పవు అంటారు పెద్దలు. ఎవరైనా అబద్ధం చెప్పేటప్పుడు సాధారణంగా కళ్లలోకి చూసి మాట్లాడలేరు. ఒకవేళ చూసినా, వారు కనురెప్పలను అతిగా ఆర్పడం లేదా అస్సలు ఆర్పకుండా స్థిరంగా చూడటం చేస్తారు. సైకాలజీ ప్రకారం, మనిషి ఏదైనా విషయాన్ని గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు కళ్లు ఒక వైపుకు, అబద్ధం చెప్పేటప్పుడు మరో వైపు కదులుతాయి. సాధారణంగా కుడిచేతి వాటం ఉన్నవారు అబద్ధం చెప్పేటప్పుడు వారి చూపు కుడి వైపుకు వెళ్లే అవకాశం ఉంటుంది. 

36
అనవసరమైన సమాచారం (Over-Explaining)
Image Credit : Getty

అనవసరమైన సమాచారం (Over-Explaining)

అబద్ధం చెప్పే వ్యక్తి తనను తాను సమర్థించుకోవడానికి అవసరానికి మించి చెప్తాడు. మీరు ఒక చిన్న ప్రశ్న అడిగితే, దానికి సంబంధం లేని వివరాలన్నీ చెబుతూ సాగదీస్తుంటారు. నిజం చెప్పే వ్యక్తి సూటిగా సమాధానం ఇస్తాడు, కానీ అబద్ధం చెప్పే వ్యక్తి మిమ్మల్ని మాటలతో బురిడీ కొట్టించడానికి ట్రై చేస్తాడు.

46
బాడీ లాంగ్వేజ్
Image Credit : GEMINI AI

బాడీ లాంగ్వేజ్

అబద్ధం చెప్పేటప్పుడు మన మనసు మనల్ని అదుపు చేస్తుంది. వారు మాట్లాడుతున్నప్పుడు పదే పదే ముక్కును తాకడం, నోటిని కప్పుకోవడం లేదా మెడను గోకడం వంటివి చేస్తుంటారు. అలాగే, చేతులను కట్టేసుకోవడం లేదా జేబులో పెట్టుకోవడం వంటివి చేస్తుంటారు. వారు చెప్పే మాటలకు, వారి శరీర కదలికలకు సంబంధం ఉండదు.

56
గొంతులో మార్పు, మాట తడబడటం
Image Credit : gemini ai

గొంతులో మార్పు, మాట తడబడటం

అబద్ధం చెప్పేటప్పుడు మనిషి కంగారు పడతాడు. దీనివల్ల గొంతు ఎండిపోవడం లేదా మాటలో వణుకు కనిపిస్తుంది. ఏం చెప్పాలో తెలియక పదే పదే పనికిమాలిన మాటలు చెప్తూ ఉంటారు. ఏదో మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తారు. 

66
రివర్స్ ఆర్డర్ టెక్నిక్ (Reverse Order)
Image Credit : Getty

రివర్స్ ఆర్డర్ టెక్నిక్ (Reverse Order)

ఇది అబద్ధాలను పట్టుకోవడానికి బెస్ట్ ట్రిక్. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు, మళ్లీ రివర్స్ లో చెప్పమని అడగండి. నిజం చెప్పే వ్యక్తి ఎలాగైనా వివరించగలడు. కానీ అబద్ధం చెప్పిన వ్యక్తి మాత్రం రివర్స్ లో చెప్పమంటే అతని మెదడు కన్ఫ్యూజ్ అయ్యి, అసలు విషయం బయటపడుతుంది.

ఈ లక్షణాలు ఒక వ్యక్తిలో కనిపిస్తే వారు అబద్ధం చెబుతున్నారని 100% చెప్పలేం. ఎందుకంటే కొందరు భయం వల్ల కూడా ఇలా ప్రవర్తించవచ్చు. కానీ, ఈ 5 ట్రిక్స్ ద్వారా మీరు అవతలి వ్యక్తి నిజాయితీని కొంతవరకు అంచనా వేయవచ్చు. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Thailand Trip New Rules: థాయ్‌లాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? సెప్టెంబర్ 15 నుంచి భారతీయులకు కొత్త రూల్స్
Recommended image3
Urine : మూత్రం ఎందుకు దుర్వాసన వస్తుంది? అసలు శరీరంలో మూత్రం ఎలా తయారవుతుంది?
Related Stories
Recommended image1
Child Psychology: మీ పిల్లల్లో ఈ 5 లక్షణాలు ఉంటే.. మీరు సూపర్ కిడ్‍ని పెంచుతున్నట్లే!
Recommended image2
Child Psychology: పిల్లల్ని ఎక్కువగా పొగుడుతున్నారా? వాళ్లు ఎలా మారిపోతారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved