MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Alcohol: ఆల్కహాల్ తాగేటప్పుడు పొరపాటున కూడా తినకూడని 5 రకాల ఆహారాలు ఇవే!

Alcohol: ఆల్కహాల్ తాగేటప్పుడు పొరపాటున కూడా తినకూడని 5 రకాల ఆహారాలు ఇవే!

Alcohol: ఆల్కహాల్ తాగేటప్పుడు ఏదో ఒకటి తినడం చాలామందికి అలవాటే. అయితే మందుతో పాటు తీసుకునే ఆహారం విషయంలో కాస్త జాగ్రత్త అవసరం అంటున్నారు నిపుణులు. మరి ఆల్కహాల్ తాగినప్పుడు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి? ఏం తినాలి వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Aug 15 2026, 03:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఆల్కహాల్ తో కలిపి తీసుకోకూడని ఫుడ్స్
Image Credit : AI Image

ఆల్కహాల్ తో కలిపి తీసుకోకూడని ఫుడ్స్

ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏం తింటున్నామనే విషయం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నిజానికి ఖాళీ కడుపుతో ఆల్కహాల్ తాగడం వల్ల అది రక్తంలోకి వేగంగా శోషించబడుతుంది. అందుకే తినకుండా తాగడం కంటే సరైన ఆహారం తీసుకోవడం మంచిది. అయితే ప్రతి ఆహారం ఆల్కహాల్‌తో కలిపి తినడానికి అనుకూలంగా ఉండదు. ముఖ్యంగా కొన్ని పదార్థాలను ఆల్కహాల్ తో కలిపి అస్సలు తినకూడదు. అవేంటో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
బాగా ఫ్రై చేసిన ఆహారాలు
Image Credit : Getty

బాగా ఫ్రై చేసిన ఆహారాలు

ఆల్కహాల్‌తో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్, పకోడీలు, చికెన్ ఫ్రై, ఇతర డీప్ ఫ్రైడ్ స్నాక్స్ తినడం చాలామందికి అలవాటే. కానీ ఇలాంటి కొవ్వు అధికంగా ఉండే ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. మరోవైపు ఆల్కహాల్ కూడా జీర్ణాశయాన్ని ప్రభావితం చేస్తుంది. దానివల్ల కడుపు ఉబ్బరం, భారంగా అనిపించడం, అజీర్ణం లేదా గుండెల్లో మంట, లివర్ పై ఒత్తిడి వంటి సమస్యలు పెరగవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే అసిడిటీ సమస్యలు ఉన్నవారు ఇలాంటి కాంబినేషన్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

Related Articles

Related image1
Women Health: ఈ 5 రకాల మహిళలు త్వరగా ముసలివాళ్లు అవుతారు! ఎందుకో తెలుసా?
Related image2
Ragi Roti: 30 రోజుల పాటు రాత్రిపూట రాగి రొట్టె తింటే ఏమవుతుందో తెలుసా?
37
స్పైసీ ఫుడ్
Image Credit : Getty

స్పైసీ ఫుడ్

ఆల్కహాల్‌తో పాటు ఎక్కువ కారం, మసాలాలు ఉన్న బిర్యానీ, స్పైసీ చికెన్, మిర్చి బజ్జీలు, ఎక్కువ మసాలా ఉన్న స్నాక్స్ తీసుకోవడం కొందరిలో కడుపులో మంటను పెంచవచ్చు. ముఖ్యంగా ఆల్కహాల్ కారణంగా జీర్ణాశయం అప్పటికే ఇర్రిటేట్ అయ్యే పరిస్థితిలో ఉంటుంది. దానికి కారం ఎక్కువగా ఉన్న ఆహారం జోడిస్తే అసౌకర్యం మరింత పెరగవచ్చు. ఛాతీలో మంట, పుల్లని తేన్పులు, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు ఉన్నవారు ఇలాంటి ఆహారాలను తగ్గించడం మంచిది.

47
ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు
Image Credit : Getty

ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు

ఆల్కహాల్ తీసుకునేటప్పుడు చిప్స్, ఉప్పు పల్లీలు, ప్యాకేజ్డ్ స్నాక్స్, ప్రాసెస్డ్ మీట్ వంటి ఉప్పు అధికంగా ఉండే పదార్థాలను ఎక్కువగా తినడం సాధారణంగా కనిపిస్తుంది. కానీ ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల దాహం పెరగవచ్చు. దానివల్ల ఎక్కువ ఆల్కహాల్ తాగాలి అనిపించవచ్చు. ముఖ్యంగా అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉప్పు తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

57
చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు
Image Credit : Getty

చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు

ఆల్కహాలిక్ డ్రింక్స్‌లోనే కొంతమేర చక్కెర లేదా కార్బోహైడ్రేట్లు ఉండే అవకాశం ఉంటుంది. దానికి అదనంగా కేకులు, ఐస్‌క్రీమ్, పేస్ట్రీలు, స్వీట్లు తీసుకుంటే మొత్తం కేలరీల పరిమాణం పెరుగుతుంది. అంతేకాకుండా ఆల్కహాల్ కూడా రక్తంలో చక్కెర నియంత్రణను ప్రభావితం చేయగలదు. ముఖ్యంగా డయాబెటిస్, ఉన్నవారు ఆల్కహాల్ తీసుకునే విషయంలో వైద్యుల సలహాను పాటించడం మంచిది.

67
కెఫీన్ ఉన్న డ్రింక్స్
Image Credit : Getty

కెఫీన్ ఉన్న డ్రింక్స్

ఆల్కహాల్ తాగిన తర్వాత నిద్ర మత్తు తగ్గించుకోవడానికి కొందరు కాఫీ, టీ తాగుతుంటారు. కానీ ఇది మంచిది కాదు. ఆల్కహాల్‌ను శరీరం మెటబలైజ్ చేయడానికి సమయం అవసరం. కాఫీ తాగితే నిద్ర మత్తు కొంత తగ్గినట్లు అనిపించినా, ఆల్కహాల్ వల్ల శరీరంపై పడే ప్రభావం తగ్గదు. కాబట్టి ఆల్కహాల్ తాగిన తర్వాత కాఫీ తాగి డ్రైవింగ్ చేయడం వంటివి చేయకూడదు.

77
ఏం తినాలంటే?
Image Credit : AI

ఏం తినాలంటే?

ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కడుపుపై ఎక్కువ భారం పడకుండా తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఎంచుకోవడం మంచిది. ముఖ్యంగా బాయిల్డ్ వెజిటబుల్స్, ఉడికించిన గుడ్లు, సాంబార్ రైస్ వంటి సింపుల్ ఫుడ్స్‌ను తీసుకోవచ్చు. కూరగాయల్లో ఉండే పోషకాలు, గుడ్లలో లభించే ప్రోటీన్, సాంబార్‌లోని పప్పు, కూరగాయలు శరీరానికి కొంత పోషక విలువను అందిస్తాయి. అలాగే ఆల్కహాల్ తీసుకునే సమయంలో, ఆ తర్వాత తగినంత నీరు తాగడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangle Designs: డైలీవేర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే గాజుల డిజైన్స్
Recommended image2
Afghani Chicken: ఆహా..నోట్లో వేసుకుంటే కరిగిపోయే అఫ్గానీ చికెన్
Recommended image3
Farming : ఆగస్టులో ఈ 3 కూరగాయలు పండించండి.. లక్షల్లో లాభాలు పొందండి!
Related Stories
Recommended image1
Women Health: ఈ 5 రకాల మహిళలు త్వరగా ముసలివాళ్లు అవుతారు! ఎందుకో తెలుసా?
Recommended image2
Ragi Roti: 30 రోజుల పాటు రాత్రిపూట రాగి రొట్టె తింటే ఏమవుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved