ఆగస్టులో ఈ 3 కూరగాయలు పండించండి.. లక్షల్లో లాభాలు పొందండి!
life Aug 15 2026
Author: Arun Kumar P Image Credits:X
Telugu
ఆగస్టులో ఈ మూడు కూరగాయలు పండించండి
ఆగస్టు నెల డబ్బు సంపాదించడానికి అద్భుతమైన అవకాశం ఇస్తుంది. రైతులు ఈ సమయాన్ని ఉపయోగించుకుని ఈ మూడు కూరగాయలు పండిస్తే మంచి డబ్బు సంపాదించవచ్చు. ఏయే పంటలు వేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
Image credits: AI and Gemini
Telugu
ఆగస్టులో ఈ కూరగాయలు పండిస్తే.. డబ్బే డబ్బు!
ఈ నెలలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతాయి. త్వరలో నవరాత్రులు, దసరా, దీపావళి పండుగలు రాబోతున్నాయి. కాబట్టి ఈ పంటలు ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. దీనికి ఎక్కువ పొలం కూడా అవసరం లేదు.
Image credits: Asianet News
Telugu
కాలీఫ్లవర్ సాగు చేయండి
ఆగస్టులో కాలీఫ్లవర్ పండించడం మొదలుపెట్టండి. ఈ సమయంలో నాటిన మొక్కలు అక్టోబర్ నాటికి పంటకొస్తాయి. అప్పటికి క్యాబేజీ ఇంకా మార్కెట్‌లోకి రాదు. సరఫరా తక్కువగా ఉండటంతో మంచి ధర వస్తుంది.
Image credits: AI and Gemini
Telugu
పచ్చిమిర్చి సాగు
ప్రతి వారం మీ జేబులోకి డబ్బులు రావాలంటే పచ్చిమిర్చి పండించండి. ఆగస్టులో నాటడం చాలా మంచిది. ఒక్కసారి నాటితే కొన్ని నెలల పాటు ఆదాయం వస్తూనే ఉంటుంది.
Image credits: Getty
Telugu
కొత్తిమీరతో మంచి లాభాలు
ఆగస్టు చివరి వారంలో కొత్తిమీర నాటడం ఉత్తమం. ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ లాభం వస్తుంది. కేవలం 35 నుంచి 40 రోజుల్లోనే పంట కోతకు సిద్ధమవుతుంది!
Image credits: Instagram
Telugu
వర్షాకాలంలో కొత్తిమీరకు ఫుల్ డిమాండ్
వర్షాకాలం కావడంతో మార్కెట్‌లో కొత్తిమీరకు డిమాండ్ ఎక్కువగా, సరఫరా తక్కువగా ఉంటుంది. దీంతో కిలో ధర రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతుంది. అందుకే లాభాలు కూడా భారీగా ఉంటాయి.