Beauty Tips: స్మూతైన షేవింగ్ కోసం ఆరాటపడుతున్నారా.. అయితే ఈ సులభమైన చిట్కాలు మీకోసమే?
Beauty Tips: సాధారణంగా మగవారు షేవింగ్ చేసుకోవడానికి ఇబ్బంది పడతారు దానికి కారణం గడ్డం గీసుకున్న తర్వాత వచ్చే మంట, రాషెస్ భరించలేక. అయితే కొన్ని చిట్కాలతో స్మూత్ అయిన షేవ్ చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం.
సాధారణంగా షేవింగ్ చేసుకోవడం అంటే చాలామందికి చికాకు గడ్డం గీసుకున్న తర్వాత మంట రాసిస్తూ పడే బాధ చెప్పుకోలేనిది. ఎంత బాధపడినప్పటికీ వయసు 20 దాటిన ప్రతి మగవాడికి ఈ షేవింగ్ తప్పనిసరి. అయితే షేవింగ్ మీద కొంచెం శ్రద్ధ చూపిస్తే మీరు అనుకున్నంత కటువుగా కాకుండా స్మూత్ గా షేవింగ్ చేసుకోవచ్చు.
షేవింగ్ కి ముందు షేవింగ్ కి తర్వాత చర్మానికి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల మీ చర్మాన్ని మెత్తగా ఉంచుతుంది. అప్పుడు షేవింగ్ చేయడం చాలా సులభం అవుతుంది. షేవింగ్ తర్వాత చర్మాన్ని పొడిబారకుండా ఉండేటందుకు కొన్ని రెమెడీస్ పాటించాలి.
ఒక కాటన్ క్లాత్ తీసుకుని వేడి నీటిలో ముంచి మీ చర్మం మీద ఒత్తుకోవాలి నీళ్లు మరీ వేడిగా లేకుండా చూసుకోవాలి. తర్వాత మీ ముఖం కాళ్లు భుజాలు మరియు సేవింగ్ చేసుకునే అన్ని బాగాల్లోని జోజోబా ఆయిల్ లేదా అవకాడో ఆయిల్ రాస్తే మీ చర్మం పొడిబారకుండా ఉంటుంది.
అలాగే అలోవెరా జెల్ కూడా చర్మానికి మాయిశ్చరైసర్ లాగా పనిచేసి పగుళ్ళకి తక్షణ నివారణ కలిగిస్తుంది. పొద్దున్న నిద్రలేచిన వెంటనే కాకుండా పది నిమిషాలు తర్వాత షేర్ చేసుకోవడం చర్మానికి ఎంతో మంచిది.
షేవింగ్ చేసుకునేటప్పుడు చల్లగా లేదా వేడిగా ఉన్న నీటిని కాకుండా గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. కచ్చితంగా వేడి నీటిని మాత్రం వాడకండి ఎందుకంటే ఇది చర్మాన్ని ఓవర్ డ్రై చేస్తుంది. షేవింగ్ జల్ లేదా క్రీమ్ రాసుకునేటప్పుడు ముని వేళ్ళతో సర్కులర్ మోషన్ పద్ధతిని అనుసరించండి.
చర్మం సున్నితంగా ఉండి తొందరగా మంట కుడుతుందనుకునేవారు షేవింగ్ ఆయిల్ని ఉపయోగించండి. ఎలక్ట్రిక్ షవర్ ని వినియోగించేవారు తమ పరికరం పనితీరు 100 ఎంపీహెచ్ లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే చర్మంపై గాట్లు పడిపోతాయి కాబట్టి జాగ్రత్తగా వహించండి.