MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • IRCTC Goa Tour : హైదరాబాద్ టు గోవా ప్లైట్ జర్నీ .. తెలుగోళ్ల కోసమే 4 రోజుల టూర్ ప్యాకేజీ, అదీ బడ్జెట్లోనే

IRCTC Goa Tour : హైదరాబాద్ టు గోవా ప్లైట్ జర్నీ .. తెలుగోళ్ల కోసమే 4 రోజుల టూర్ ప్యాకేజీ, అదీ బడ్జెట్లోనే

గోవాకు విమానంలో వెళ్లి సరదాగా గడపాలనుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ మీకోసం ఒక కొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలో ప్రయాణం, వసతి, ఆహారం, స్థానిక ప్రదేశాల సందర్శన అన్నీ కలిపి ఉంటాయి.

3 Min read
Author : Arun Kumar P
Published : Jun 16 2026, 11:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
గోవా డిలైట్ టూర్ ప్యాకేజ్
Image Credit : Geini AI

గోవా డిలైట్ టూర్ ప్యాకేజ్

బీచ్‌లు, నైట్ లైఫ్, ఫారెన్ కల్చర్, చారిత్రక ప్రదేశాలు, అడ్వెంచర్లకు ఫేమస్ అయిన గోవాను చుట్టిరావాలనేది చాలామంది కోరిక. అందుకే స్నేహితులు, ఫ్యామిలీతో కలిపి గోవా టూర్ ప్లాన్ చేస్తుంటారు... అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. కానీ తెలుగువాళ్లు బడ్జెట్ లో గోవా టూర్ కంప్లీట్ చేసేలా ఐఆర్‌సీటీసీ (IRCTC) మంచి అవకాశం కల్పిస్తోంది. 'గోవా డిలైట్' పేరుతో ప్రకటించిన ఈ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ.. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, పక్కా ప్లానింగ్‌తో కూడిన వెకేషన్‌ను అందిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
గోవా డిలైట్ టూర్ సాగుతుందిలా...
Image Credit : Gemini

గోవా డిలైట్ టూర్ సాగుతుందిలా...

గోవా ట్రిప్ సెప్టెంబర్ 9న తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి మొదలవుతుంది. ప్రయాణికులు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్లైట్‌లో గోవా చేరుకుంటారు. తిరుగు ప్రయాణం కూడా విమానంలోనే ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ ప్లాన్ ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తుంది.

Day 1 (హైదరాబాద్ నుండి గోవాకు ప్రయాణం)

హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోట్ (RGIA) ప్రయాణం ప్రారంభం అవుతుంది. గోవా ఎయిర్పోట్ లో దిగినతర్వాత రోడ్డుమార్గంలో హోటల్ కి చేరుకుంటారు. సాయంత్రం స్థానిక మార్కెట్ లో షాపింగ్ చేసుకోవచ్చు. రాత్రి డిన్నర్ హోటల్లోనే ఉంటుంది.

Day 2 (సౌత్ గోవా సందర్శన)

ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత సౌత్ గోవాలోని అందమైన ప్రాంతాలను చూసేందుకు తీసుకెళతారు. ఓల్డ్ గోవా చర్చ్ (బెసిలికా ఆఫ్ బోమ్ జీసస్, ఆర్కియాలజీ మ్యూజియం ఆండ్ పోర్ట్రేట్ గ్యాలరీ) వ్యాక్స్ వరల్డ్ మ్యూజియం, శ్రీ మంగేషి టెంపుల్, మిరామర్ బీచ్ సందర్శన ఉంటుంది. మండోవీ రివర్ లో బోట్ క్రూయిజ్ రైడ్ ఉంటుంది. ఇలా గోవా అందాలను వీక్షిస్తూ రోజంతా ఎంజాయ్ చేసినతర్వాత రాత్రి హోటల్ కి చేరుకుంటారు. డిన్నర్ తర్వాత విశ్రాంతి తీసుకుంటారు.

36
నార్త్ గోవా ట్రిప్..
Image Credit : Getty

నార్త్ గోవా ట్రిప్..

Day 3 (నార్త్ గోవా సందర్శన) 

హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేసి నార్త్ గోవాను చుట్టివచ్చేందుకు బయలుదేరతారు. ఫోర్ట్ అగుఅడ సందర్శన ఉంటుంది. కాండోలిమ్ బీచ్, బాగా బీచ్ అందాలను ఆస్వాదించవచ్చు... వాటర్ గేమ్స్ ఎంజాయ్ చేయవచ్చు. అంజున, వాగటోర్ బీచ్ లతో పాటు చపోరా పోర్ట్ సందర్శన ఉంటుంది. ఇలా సాయంత్రం వరకు నార్త్ గోవా అందాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేసి హోటల్ కు చేరుకోవడంతో మూడో రోజు పర్యటన ముగుస్తుంది.

Day 4 (గోవా నుండి హైదరాబాద్ కు ప్రయాణం)

నాలుగోరోజు ఉదయం లేవగానే హోటల్లోనే బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. 10 గంటలకు హోటల్ ను ఖాళీచేసి గోవా విమానాశ్రయానికి చేరుకుంటారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోవడంతో గోవా డిలైట్ టూర్ ముగుస్తుంది.

46
గోవా డిలైట్ టూర్ ప్యాకేజి ధరలివే..
Image Credit : Gemini AI

గోవా డిలైట్ టూర్ ప్యాకేజి ధరలివే..

హైదరాబాద్ నుండి గోవా టూర్ కి వెళ్లే ప్రయాణికుల అవసరాన్ని బట్టి వేర్వేరు ధరల ఆప్షన్లు ఉన్నాయి. సింగిల్ ఆక్యుపెన్సీ, డబుల్ షేరింగ్, ట్రిపుల్ షేరింగ్ కోసం వేర్వేరు ధరలు నిర్ణయించారు. విమాన టికెట్లు, ఏసీ హోటల్‌లో బస, ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం, లోకల్ ట్రాన్స్‌పోర్ట్ వంటివి ఈ ప్యాకేజీలో భాగం.

సింగిల్ ఆక్యుపెన్సి - రూ.24640

డబుల్ ఆక్యుపెన్సి - రూ.19200

ట్రిపుల్ ఆక్యుపెన్సీ - రూ.18680

చైల్డ్ విత్ బెడ్ (2-11 వయసు) - రూ.15520

చైల్ వితౌట్ బెడ్ (2-11 వయసు) -రూ.15520

02-04 ఏళ్లకంటే చిన్నవయసు పిల్లలు - రూ.9130

56
గోవా డిలైట్ ప్యాకేజీలో కల్పించే సదుపాయాలివే..
Image Credit : Getty

గోవా డిలైట్ ప్యాకేజీలో కల్పించే సదుపాయాలివే..

హైదరాబాద్ నుండి గోవాకు విమాన టికెట్లు ఈ ప్యాకేజీలో భాగమే. అలాగే తిరుగు ప్రయాణం గోవా నుండి హైదరాబాద్ ప్లైట్ టికెట్ కూడా IRCTC ఏర్పాటు చేస్తుంది. ఇక గోవాలో 3 రోజులపాటు 4 స్టార్ హోటల్లో ఏసి గదిని కేటాయిస్తారు... బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ ఉంటుంది. రోడ్డు ప్రయాణం ఏసి వాహనాన్ని అరేంజ్ చేస్తారు... ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఐఆర్సిటిసి ఎస్కార్ట్ సర్వీస్ ఉంటుంది.

అయితే ఏదైనా కారణాలతో విమాన ఛార్జీలు పెరిగితే ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. ఇక హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఎలాంటి ప్రయాణ సదుపాయం ఉండదు... అంటే రానుపోను ఖర్చులు ప్రయాణికులే భరించుకోవాలి. కేవలం ఉదయం బ్రేక్ ఫాస్ట్, రాత్రి డిన్నర్ మాత్రమే ప్యాకేజీలో భాగంగా కల్పిస్తారు... మధ్యాహ్నం లంచ్ ప్రయాణికులే ఏర్పాటుచేసుకోవాలి. మినరల్ వాటర్, మందు ఖర్చులు పర్యాటకులవే.

గోవా ట్రిప్ ప్లాన్ చేసుకునే శ్రమ లేకుండా అన్ని ముఖ్యమైన సౌకర్యాలను ఒకే ప్యాకేజీలో అందించడం ఈ ప్లాన్ ప్రత్యేకత. కుటుంబాలు, స్నేహితుల గ్రూపులు, జంటలకు ఇది ఒక మంచి ఎంపిక. ఎలాంటి ఇబ్బంది లేకుండా గోవాను చుట్టిరావాలనుకునే వారికి ఈ ప్యాకేజీ మంచి అవకాశం.

66
ఐఆర్సిటిసి టూర్ ప్యాకేజీల వివరాల కోసం కాంటాక్ట్ చేయాల్సిన నంబర్లు..
Image Credit : Getty

ఐఆర్సిటిసి టూర్ ప్యాకేజీల వివరాల కోసం కాంటాక్ట్ చేయాల్సిన నంబర్లు..

ఐఆర్సిటిసి - సౌత్ సెంట్రల్ జోన్,

9-1-129/1/302,3rd ప్లోర్, ఆక్స్ ఫార్డ్ ప్లాజా

S.D రోడ్, సికింద్రాబాద్, తెలంగాణ.

సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు

జోనల్ ఆఫీస్ - 040-27702407 / 9701360701

పవన్ - 8287932228

శశిధర్ - 8287932229

నవీన్ - 8287932230

సతీష్ - 9281030712

భరద్వాజ్ - 9281030733

నరేష్ - 9281030711

ప్రశాంత్ - 9281030749

ఉద్గిర్ సంతోష్ - 9281030734

ఐఆర్సిటిసి విజయవాడ (రైల్వే రిటైరింగ్ రూమ్ సమీపంలో)

సిహెచ్. బాలాజీ - 9281030714

లలిత - 8287932311

ఐఆర్సిటిసి తిరుపతి. ప్లాట్ ఫార్మ్ నంబర్ 1, 1వ అంతస్తు, రిటైరింగ్ రూమ్స్ కాంప్లెక్స్, తిరుపతి రైల్వే స్టేషన్.

పవన్ - 8287932313

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్
 
1st TEST • NZ vs IND 2026
Stumps
NZNZ
(82.0 ov)243/5
INDIND
-
Day 1
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Stumps
PAKPAK
325
SLSL
(93.0 ov) 98 & 309/9
Day 3
Schedule ›
28th T20 • WBBLT20
AS-WAS-W
Fri, 20 Nov, 2026
MR-WMR-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
29th T20 • WBBLT20
HH-WHH-W
Sat, 21 Nov, 2026
ST-WST-W
06:30 am
Match yet to begin.
Schedule ›
30th T20 • WBBLT20
SS-WSS-W
Sat, 21 Nov, 2026
PS-WPS-W
10:00 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Egg Hair Mask: గుడ్డును ఇలా వాడితే ఒక్క వెంట్రుక కూడా రాలదు
Recommended image2
Hair Growth: జుట్టు చక్కగా, ఫాస్ట్ గా పెరగాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి!
Recommended image3
Mango Pickle: అప్పటికప్పుడు ఈజీగా తయారుచేసుకునే మామిడికాయ పచ్చడి.. అదిరిపోయే టేస్ట్!
Related Stories
Recommended image1
IRCTC : స్లీపర్ టికెట్‌తో ఏసీలో ప్రయాణించవచ్చు.. ఈ సీక్రెట్ ట్రిక్ మీకు తెలుసా?
Recommended image2
IRCTC Coffee with Karnataka : ఈ వానాకాలంలో అందమైన కాఫీ తోటలు చుట్టిరండి, బడ్జెట్లోనే హైదరాబాద్ నుండి కూర్గ్, మైసూర్ ట్రిప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved