మొక్కలకు నీళ్లు ఎక్కువగా పోస్తే వాటి వేళ్లు కుళ్లిపోతాయి. మట్టి పూర్తిగా ఆరిన తర్వాతే నీళ్లు పోయాలి.
చాలా రకాల కూరగాయల మొక్కలకు రోజుకు కనీసం 4 నుంచి 6 గంటల ఎండ అవసరం. ఎండ తగలని చోట మొక్కలు పెడితే సరిగ్గా పెరగవు.
గ్రో బ్యాగ్స్ లేదా కుండీలకు అదనపు నీరు బయటకు పోవడానికి కింద రంధ్రాలు ఉన్నాయో లేదో తప్పకుండా చూసుకోవాలి.
మొక్కల వేళ్లు బాగా పెరగడానికి తగినంత లోతు, వెడల్పు ఉన్న కుండీలను ఎంచుకోవాలి. చిన్న కుండీలు అన్ని రకాల మొక్కలకు సెట్ కావు.
తోటలోని మట్టిని మాత్రమే వాడితే అది గట్టిపడిపోతుంది. కోకోపీట్, సేంద్రియ ఎరువు కలిపిన మిశ్రమాన్ని వాడటం మంచిది.
ఒకే కుండీలో ఎక్కువ మొక్కలు దగ్గరదగ్గరగా నాటితే వాటికి పోషకాలు సరిగ్గా అందవు. అందుకే తగినంత గ్యాప్ ఉండేలా చూసుకోవాలి.
మొక్కలకు పురుగులు లేదా తెగుళ్లు సోకినప్పుడు వెంటనే గమనించి తగిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే మొక్క మొత్తం దెబ్బతింటుంది.
Vaddanam: నడుము అందాన్ని పెంచే లైట్ వెయిట్ వడ్డాణం డిజైన్లు
Blouse Back Neck: కళ్లు చెదిరేలా.. బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్లు
Mangalsutra Designs:తక్కువ బరువులో ఎక్కువ గ్రాండ్ లుక్ ఇచ్చే నల్లపూసలు
Weight Loss Drinks:బరువు తగ్గాలనుకునేవారికి ఈ డ్రింక్స్ బెస్ట్ ఆప్షన్!