MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Jobs
  • ఎలాంటి గ్యారంటీ లేకుండా రూ. 10 ల‌క్ష‌లు పొందే అవ‌కాశం.. వెంట‌నే అప్లై చేసుకోండి

ఎలాంటి గ్యారంటీ లేకుండా రూ. 10 ల‌క్ష‌లు పొందే అవ‌కాశం.. వెంట‌నే అప్లై చేసుకోండి

PM Vidyalaxmi Scheme: ఉన్నత విద్యను అభ్య‌సించాల‌నుకునే విద్యార్థుల కోసం కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ప‌థ‌కాల్లో పీఎం విద్యాల‌క్ష్మీ ఒక‌టి. ఈ పథకం ద్వారా విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ స్కీమ్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు మీకోసం.

2 Min read
Author : Narender Vaitla
Published : May 12 2026, 05:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ ప్రత్యేకతలు
Image Credit : Gemini AI

పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ ప్రత్యేకతలు

ఈ పథకం ప్రధాన ఉద్దేశం ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్య ఆగిపోకుండా చూడటం. ఈ స్కీమ్ కింద విద్యార్థులకు ఎలాంటి ఆస్తి పత్రాలు తాకట్టు పెట్టకుండా, గ్యారంటీ అవసరం లేకుండా ఎడ్యుకేషన్ లోన్లు అందిస్తారు. రూ.7.5 లక్షల వరకు తీసుకునే రుణాలకు కేంద్ర ప్రభుత్వం 75 శాతం వరకు క్రెడిట్ గ్యారంటీ ఇస్తుంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న విద్యార్థులకు రూ.10 లక్షల వరకు తీసుకునే లోన్‌పై 3 శాతం వడ్డీ సబ్సిడీ కూడా లభిస్తుంది. అలాగే కుటుంబ ఆదాయం రూ.4.5 లక్షల లోపు ఉంటే పూర్తి వడ్డీ సబ్సిడీ పొందే అవకాశం కూడా ఉంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
ఈ స్కీమ్‌కు ఎవరు అర్హులు?
Image Credit : Getty

ఈ స్కీమ్‌కు ఎవరు అర్హులు?

ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థి తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి. ప్రభుత్వం గుర్తించిన 860కు పైగా ఉన్నత విద్యాసంస్థల్లో మెరిట్ ఆధారంగా అడ్మిషన్ పొందినవారికి ఈ పథకం వర్తిస్తుంది. ముఖ్యంగా IITలు, IIMలు, AIIMS, NITలు, ప్రముఖ యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు. వడ్డీ సబ్సిడీ పొందాలంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారి జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం (ఇన్‌క‌మ్ స‌ర్టిఫికేట్‌) తప్పనిసరిగా ఉండాలి.

Related Articles

Related image1
Home Decor: చెత్త‌లో ప‌డేసే పిస్తా పెంకుల‌తో మీ ఇంటిని అందంగా మార్చేయొచ్చు.. సింపుల్ ట్రిక్స్
Related image2
Ceiling Fan: క‌రెంట్ లేక‌పోయినా న‌డిచే సీలింగ్ ఫ్యాన్.. ఇంతకీ ఫ్యాన్ ఎలా పనిచేస్తుందంటే.?
35
దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది?
Image Credit : Getty

దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది?

విద్యార్థులు PM విద్యాలక్ష్మి అధికారిక పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. ముందుగా అవసరమైన వ్యక్తిగత వివరాలు నమోదు చేసి కామన్ ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ ఫారం నింపాలి. ఆ తర్వాత తమ అర్హత, అవసరాలకు అనుగుణంగా బ్యాంకులను ఎంపిక చేసుకోవచ్చు. ఈ పథకం కింద గరిష్ఠంగా మూడు బ్యాంకులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అప్లికేషన్ సమర్పించిన తర్వాత బ్యాంకులు పత్రాలను పరిశీలించి లోన్ ఆమోదంపై నిర్ణయం తీసుకుంటాయి.

45
అవసరమైన డాక్యుమెంట్లు ఏంటి?
Image Credit : Asianet News

అవసరమైన డాక్యుమెంట్లు ఏంటి?

దరఖాస్తు సమయంలో విద్యార్థులు కొన్ని ముఖ్యమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. 10వ తరగతి, ఇంటర్ లేదా చివరి అర్హత పరీక్ష మార్కుల మెమోలు, కాలేజీ అడ్మిషన్ ప్రూఫ్, కోర్సు ఖర్చుల వివరాలు, ఆదాయ ధృవీకరణ పత్రం, విద్యార్థి లేదా తల్లిదండ్రుల ఫోటోలు అవసరం అవుతాయి. ఈ పత్రాలను PDF లేదా JPEG ఫార్మాట్‌లో నిర్దిష్ట పరిమాణంలో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

55
డిజిటల్ రూపీ ద్వారా లోన్ విడుదల
Image Credit : Getty

డిజిటల్ రూపీ ద్వారా లోన్ విడుదల

ఈ స్కీమ్‌లో డిజిటల్ రూపీ విధానాన్ని కూడా ఉపయోగిస్తున్నారు. విద్యార్థి పేరుతో ఉన్న CBDC వాలెట్‌లో ముందుగా లోన్ మొత్తాన్ని జమ చేసి, అక్కడి నుంచి నేరుగా లోన్ ఖాతాలోకి బదిలీ చేస్తారు. విద్యార్థులు తమ అప్లికేషన్ స్థితిని అధికారిక పోర్టల్‌లో “Track Loan Application” ఆప్షన్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఒకవేళ దరఖాస్తు రిజ‌క్ట్ అయితే సంబంధిత బ్యాంకును సంప్రదించి కారణాలు తెలుసుకుని మళ్లీ అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఉద్యోగాలు, కెరీర్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Job Quit: ఉద్యోగం మానేద్దామ‌ని అనుకుంటున్నారా.? ముందు ఈ విష‌యాలు తెలుసుకోండి
Recommended image2
Jobs Notification 2026 : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. ఎగ్జామ్ లేకుండానే రూ.49,000 శాలరీ గవర్నమెంట్ జాబ్
Recommended image3
Salary : ఈ నెల మీ జీతం తక్కువగా వస్తుంది..? ఎందుకో తెలుసా..?
Related Stories
Recommended image1
Home Decor: చెత్త‌లో ప‌డేసే పిస్తా పెంకుల‌తో మీ ఇంటిని అందంగా మార్చేయొచ్చు.. సింపుల్ ట్రిక్స్
Recommended image2
Ceiling Fan: క‌రెంట్ లేక‌పోయినా న‌డిచే సీలింగ్ ఫ్యాన్.. ఇంతకీ ఫ్యాన్ ఎలా పనిచేస్తుందంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved