MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Andhra Pradesh
  • Jobs Notification 2026 : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. ఎగ్జామ్ లేకుండానే రూ.49,000 శాలరీ గవర్నమెంట్ జాబ్

Jobs Notification 2026 : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. ఎగ్జామ్ లేకుండానే రూ.49,000 శాలరీ గవర్నమెంట్ జాబ్

Government Jobs : ఆంధ్ర ప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖలో పనిచేసే అద్భుత అవకాశం. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే నేరుగా ఈ సంస్థలో ఉద్యోగాన్ని పొందవచ్చు. పూర్తి వివరాలివే..

2 Min read
Author : Arun Kumar P
Published : May 07 2026, 10:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఏపీ విపత్తు నిర్వహణ సంస్థలో జాబ్..
Image Credit : Getty

ఏపీ విపత్తు నిర్వహణ సంస్థలో జాబ్..

APSDMA Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. విపత్తు నిర్వహణ విభాగంలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ముఖ్యంగా వాతావరణ శాఖ, ప్రకృతి విపత్తులపై అవగాహన ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. నెలకు రూ.49,000 శాలరీతో “ప్రాజెక్ట్ మేనేజర్ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్) – మెటిరియాలజిస్ట్” పోస్టును భర్తీ చేయనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
APSDMA లో భర్తీచేసే పోస్టు ఏది..? శాలరీ ఎంత..?
Image Credit : Getty

APSDMA లో భర్తీచేసే పోస్టు ఏది..? శాలరీ ఎంత..?

APSDMAలో “ప్రాజెక్ట్ మేనేజర్ (డీఎం) – మెటిరియాలజిస్ట్” పోస్టును కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. ప్రారంభంలో ఒక సంవత్సరం కాంట్రాక్ట్ కింద నియమించుకుంటారు. అయితే అభ్యర్థి పనితీరు, సంస్థ అవసరం, ప్రభుత్వ అనుమతుల ఆధారంగా ప్రతి సంవత్సరం పొడిగించే అవకాశం ఉంది.

పోస్టుల సంఖ్య : 1

ఉద్యోగ విధానం : కాంట్రాక్ట్

జీతం : నెలకు రూ.49,000

36
APSDMA ఉద్యోగానికి విద్యార్హతలు ఏమిటి..?
Image Credit : gemini

APSDMA ఉద్యోగానికి విద్యార్హతలు ఏమిటి..?

ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింది కోర్సుల్లో M.Tech లేదా M.Sc పూర్తి చేసి ఉండాలి.

మెటిరియాలజీ

ఎర్త్ సైన్సెస్

అట్మాస్ఫిరిక్ సైన్స్

అలాగే కనీసం 60 శాతం మార్కులు లేదా 6.0 CGPA ఉండాలి.

పీహెచ్‌డీ చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.

46
ఇతర అర్హతలు..
Image Credit : Getty

ఇతర అర్హతలు..

వయోపరిమితి

ప్రభుత్వ నిబంధనల ప్రకారం అభ్యర్థుల వయస్సు 45 సంవత్సరాల లోపు ఉండాలి.

అనుభవం 

దరఖాస్తుదారులకు కనీసం 3 నుండి 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. ముఖ్యంగా కింది రంగాల్లో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.

భారత వాతావరణ శాఖ (IMD)

కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు

యునైటెడ్ నేషన్స్ లేదా ఇతర ఏజెన్సీలు

అవసరమైన నైపుణ్యాలు

అభ్యర్థులకు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అలాగే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు తయారు చేయగలగాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా తప్పనిసరి.

56
APSDMA జాబ్ కు దరఖాస్తు ఎలా చేయాలి..?
Image Credit : Getty

APSDMA జాబ్ కు దరఖాస్తు ఎలా చేయాలి..?

అభ్యర్థులు APSDMA అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. పూర్తిగా నింపిన అప్లికేషన్‌తో పాటు అవసరమైన సర్టిఫికెట్లు జతచేసి స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపాలి. దరఖాస్తు కవరుపై “Application for the post of Project Manager (DM) – Meteorologist” అని స్పష్టంగా రాయాలి.

పంపాల్సిన చిరునామా

మేనేజింగ్ డైరెక్టర్, APSDMA, కుంచనపల్లి గ్రామం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా

దరఖాస్తులకు చివరి తేదీ

ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యింది. 2026 మే 14 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు.

66
ముఖ్యమైన నిబంధనలు
Image Credit : Getty

ముఖ్యమైన నిబంధనలు

  • పదో తరగతి నుంచి పీజీ/పీహెచ్‌డీ వరకు అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ లు అందించాల్సి ఉంటుంది.  
  • ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడైనా, అవసరమైతే దేశవ్యాప్తంగా పనిచేయాల్సి ఉంటుంది.
  • ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి మాత్రమే సమాచారం అందుతుంది.
  • ఇంటర్వ్యూకు హాజరయ్యే వారికి TA/DA ఇవ్వరు.
  • అవసరమైతే నియామక ప్రక్రియను రద్దు చేసే హక్కు APSDMAకు ఉంటుంది.
  • ఎంపికైన అభ్యర్థి APSDMAతో ఒప్పందం చేసుకోవాలి.
  • ఉద్యోగాన్ని పొందిన తర్వాత రిజైన్ చేయాలంటే రెండు నెలల ముందుగా నోటీసు ఇవ్వాలి లేదా రెండు నెలల జీతం చెల్లించాలి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. దూసుకొస్తున్న తుపాను.. జిల్లాల్లో కుండపోత వర్షాలు
Recommended image2
Now Playing
కుప్పంలో రైతు బజార్ ప్రారంభించిన CM Chandrababu | Asianet News Telugu
Recommended image3
Pawan Kalyan : వైసిపి బిగ్ షాకిచ్చి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే... ఎవరీ వరుపుల సుబ్బారావు?
Related Stories
Recommended image1
Government Jobs : ఎస్సెస్సి, బిఆర్వో, యూపిఎస్సి జాబ్స్ నోటిఫికేషన్లు .. లక్షల జీతంతో వేలాది ఉద్యోగాలు
Recommended image2
Jobs 2026 : ప్రభుత్వ ఉద్యోగాల జాతర.. ఒకటి రెండు కాదు ఏకంగా 21,000+ పోస్టులు.. ఎక్కడ, ఏ జాబ్స్..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved