MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Careers
  • Salary : ఈ నెల మీ జీతం తక్కువగా వస్తుంది..? ఎందుకో తెలుసా..?

Salary : ఈ నెల మీ జీతం తక్కువగా వస్తుంది..? ఎందుకో తెలుసా..?

ఈ నెల నుంచి మీకు శాలరీ డబ్బులు తక్కువగా రావచ్చు. టేక్ హోమ్ శాలరీ తగ్గితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు… మీ శాలరీ ఏ మాత్రం తగ్గదు.. కటింగ్స్ పెరుగుతాయంతే. ఇలా ఎందుకో తెలుసా..?

2 Min read
Author : Arun Kumar P
Published : May 01 2026, 07:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మీకు శాలరీ తక్కువగా వచ్చిందా..?
Image Credit : Freepik@stockimagefactorycom

మీకు శాలరీ తక్కువగా వచ్చిందా..?

ఉద్యోగాలు చేస్తూ నెలనెలా వచ్చే శాలరీ డబ్బులతో కుటుంబాన్ని పోషించుకునే వేతనజీవులు ఈ నెల శాలరీ చూసి కంగారుపడిపోకండి. శాలరీ  తక్కువగా వచ్చిందని హెచ్ఆర్ ను సంప్రదించడమో.. ఉన్నత ఉద్యోగులకు ఫిర్యాదు చేయడమో చేయకండి. ఎందుకంటే కొత్త లేబర్ కోడ్ కారణంగా టేక్ హోమ్ శాలరీ కాస్త తగ్గవచ్చు. 

కొత్త కార్మిక చట్టాల ప్రకారం ఉద్యోగుల బేసిక్ శాలరీ, పీఎఫ్, గ్రాట్యుటీ వంటి వాటిలో మార్పులు ఉంటాయి. మే 1 నుంచే ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. దీనివల్ల మీ నెలవారీ జీతంలో మార్పులు రావచ్చు.

25
అమల్లోకి కొత్త కార్మిక చట్టాలు..
Image Credit : Getty

అమల్లోకి కొత్త కార్మిక చట్టాలు..

కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో చేసిన సవరణలతో ఉద్యోగుల శాలరీ స్ట్రక్చర్ పూర్తిగా మారిపోనుంది. ముఖ్యంగా బేసిక్ శాలరీలో పెద్ద మార్పు వస్తుంది. కొత్త రూల్స్ ప్రకారం ఉద్యోగి బేసిక్ శాలరీ (Basic salary) అతని మొత్తం జీతంలో (CTC) 50 శాతం ఉండాలి. చాలా కంపెనీలు బేసిక్ సాలరీ తక్కువగా ఇచ్చి, అలవెన్సులు ఎక్కువగా చూపిస్తుంటాయి. కానీ ఇక కొత్త రూల్స్ ప్రకారం ఇలా చేయడానికి వీల్లేదు.

ఉదాహరణకు మీ CTC రూ.50,000 అయితే కొత్త రూల్ప్ ప్రకారం బేసిక్ శాలరీ తప్పకుండా రూ.25,000 ఉండాలి. దీనివల్ల మీ పీఎఫ్, గ్రాట్యుటీ మొత్తం పెరుగుతుంది. ఇది ఉద్యోగి భవిష్యత్ అవసరాలకు ఆర్థికంగా భరోసా ఇస్తుంది.

Related Articles

Related image1
Career : కెరీర్ రాకెట్‌లా దూసుకెళ్లాలంటే ఈ 9 సాఫ్ట్ స్కిల్స్ మీరు నేర్చుకోండి !
Related image2
Jobs 2026 : ప్రభుత్వ ఉద్యోగాల జాతర.. ఒకటి రెండు కాదు ఏకంగా 21,000+ పోస్టులు.. ఎక్కడ, ఏ జాబ్స్..?
35
ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ తగ్గింపు..
Image Credit : Getty

ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ తగ్గింపు..

కొత్త లేబర్ చట్టాల మార్పు వల్ల ఉద్యోగుల చేతికొచ్చే జీతం (టేక్ హోమ్ శాలరీ) తగ్గుతుంది. ఎందుకంటే జీతంలో పీఎఫ్ కటింగ్ ఎక్కువగా ఉంటుంది. నెలనెలా జీతం తగ్గినా, భవిష్యత్తులో ఇది మీకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఒకేసారి పీఎఫ్ రూపంలో భారీ డబ్బులు పొందవచ్చు. 

45
ఇక ఐదురోజులే వర్కింగ్ డే... రెండ్రోజులు సెలవే
Image Credit : Getty

ఇక ఐదురోజులే వర్కింగ్ డే... రెండ్రోజులు సెలవే

కొత్త లేబర్ కోడ్‌లో పని గంటలు, సెలవుల వంటి విషయాల్లో కూడా నియమాలను సులభతరం చేశారు. కంపెనీలు వారానికి 5 రోజుల పని, 2 రోజులు సెలవు లేదా 4 రోజుల పని, 3 రోజులు సెలవు ఇచ్చే ఆప్షన్ ఎంచుకోవచ్చు. అయితే వారంలో మొత్తం పని గంటలు 48 గంటలకు మించకూడదు.

55
 ఉద్యోగులకు లాభం... కంపెనీలకు భారం
Image Credit : Getty

ఉద్యోగులకు లాభం... కంపెనీలకు భారం

ఈ కొత్త రూల్స్ వల్ల కంపెనీలు ఉద్యోగుల కోసం కేటాయించే CTC మొత్తాన్ని పెంచాల్సి రావచ్చు. ఉద్యోగి, కంపెనీ చెల్లించే పీఎఫ్ మొత్తం పెరుగుతుంది కాబట్టి ఇది కంపెనీలకు భారంగా మారొచ్చు. కానీ చాలా కంపెనీలు ఈ భారాన్ని కూడా మొత్తం CTCలో కలిపి సర్దుబాటు చేసే అవకాశం ఉంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
భారత దేశం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Career : కెరీర్ రాకెట్‌లా దూసుకెళ్లాలంటే ఈ 9 సాఫ్ట్ స్కిల్స్ మీరు నేర్చుకోండి !
Recommended image2
Top Companies : ఇండియాలో బెస్ట్ కంపెనీలు ఇవే.. హైదరాబాద్ కంపెనీదే టాప్ ప్లేస్
Recommended image3
మీరూ IAS, IPS కావాలనుకుంటున్నారా..? అయితే ఈ సివిల్స్ ర్యాంకర్ చెప్పిన 5 టిప్స్ ఫాలోకండి
Related Stories
Recommended image1
Career : కెరీర్ రాకెట్‌లా దూసుకెళ్లాలంటే ఈ 9 సాఫ్ట్ స్కిల్స్ మీరు నేర్చుకోండి !
Recommended image2
Jobs 2026 : ప్రభుత్వ ఉద్యోగాల జాతర.. ఒకటి రెండు కాదు ఏకంగా 21,000+ పోస్టులు.. ఎక్కడ, ఏ జాబ్స్..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved