MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • Ceiling Fan: క‌రెంట్ లేక‌పోయినా న‌డిచే సీలింగ్ ఫ్యాన్.. ఇంతకీ ఫ్యాన్ ఎలా పనిచేస్తుందంటే.?

Ceiling Fan: క‌రెంట్ లేక‌పోయినా న‌డిచే సీలింగ్ ఫ్యాన్.. ఇంతకీ ఫ్యాన్ ఎలా పనిచేస్తుందంటే.?

Ceiling Fan: సాధార‌ణంగా క‌రెంట్ పోతే ప‌వ‌ర్‌ బ్యాక‌ప్ ఉంటేనే ఫ్యాన్లు న‌డుస్తాయి. అయితే ఎలాంటి ఇన్వ‌ర్ట‌ర్లు లేక‌పోయినా ఫ్యాన్ న‌డిస్తే భ‌లే ఉంటుంది క‌దూ! అచ్చంగా ఇలాంటి ఫ్యాన్‌నే తీసుకొచ్చింది ప్ర‌ముఖ ఫ్యాన్ల త‌యారీ సంస్థ ఓరియంట్ ఎల‌క్ట్రిక్‌. 

2 Min read
Author : Narender Vaitla
Published : May 12 2026, 02:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇన్‌బిల్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో
Image Credit : orientelectric.com

ఇన్‌బిల్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో

ఓరియంట్ ఎల‌క్ట్రిక్ కంపెనీ ఎకోటెక్ వోల్ట్ BLDC పేరుతో ఓ అధునాత‌న సీలింగ్ ఫ్యాన్‌ను తీసుకొచ్చింది. ఇందులో ఇన్‌బిల్ట్ బ్యాటరీ బ్యాకప్ ఉండటం ప్రత్యేకతగా చెప్పొచ్చు. కరెంట్ లేకపోయినా గంటల పాటు ఫ్యాన్ న‌డుస్తుంది. తక్కువ కరెంట్ ఖర్చుతో ఎక్కువ గాలి ఇచ్చేలా దీనిని రూపొందించారు. ఈ ఫ్యాన్‌లో ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ సదుపాయం ఇచ్చారు. సాధారణంగా పవర్ కట్ సమయంలో ఫ్యాన్ పనిచేయాలంటే ఇన్వర్టర్ అవసరం అవుతుంది. కానీ ఈ మోడల్‌లో ఫ్యాన్‌లోనే బ్యాటరీని అమ‌ర్చారు. కరెంట్ పోయిన తర్వాత కూడా సుమారు 10 గంటల వరకు ఫ్యాన్ పనిచేసే సామర్థ్యం ఉందని కంపెనీ చెబుతోంది. దీంతో వేసవిలో పవర్ కట్ వచ్చినా ఇబ్బంది తగ్గుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తక్కువ కరెంట్ ఖర్చుతో ఎక్కువ సేవింగ్
Image Credit : orientelectric.com

తక్కువ కరెంట్ ఖర్చుతో ఎక్కువ సేవింగ్

ఈ ఫ్యాన్‌లో BLDC (బ్ర‌ష్‌లెస్ డైరెక్ట్ క‌రెంట్‌) మోటార్ టెక్నాలజీ ఉపయోగించారు. ఇది సాధారణ ఫ్యాన్లతో పోలిస్తే దాదాపు 50 శాతం వరకు తక్కువ విద్యుత్ వినియోగిస్తుంది. ఫ్యాన్ పవర్ వినియోగం కేవలం 28 వాట్స్ మాత్రమే. కంపెనీ వివరాల ప్రకారం దీని వల్ల సంవత్సరానికి సుమారు రూ.7 వేల వరకు విద్యుత్ బిల్లు ఆదా చేసే అవకాశం ఉంది.

Related Articles

Related image1
Home Decor: చెత్త‌లో ప‌డేసే పిస్తా పెంకుల‌తో మీ ఇంటిని అందంగా మార్చేయొచ్చు.. సింపుల్ ట్రిక్స్
Related image2
Smart TV: రూ. 65 వేల స్మార్ట్ టీవీ కేవ‌లం.. రూ. 26 వేల‌కే. ఏకంగా 58 శాతం డిస్కౌంట్
35
హై స్పీడ్, మంచి ఎయిర్ డెలివరీ
Image Credit : orientelectric.com

హై స్పీడ్, మంచి ఎయిర్ డెలివరీ

ఈ ఫ్యాన్ 350 RPM స్పీడ్‌తో పనిచేస్తుంది. అలాగే 230 CMM ఎయిర్ డెలివరీ ఇవ్వగలదు. అంటే గదిలో అన్ని వైపులా చల్లని గాలి వేగంగా చేరుతుంది. 1200 MM స్వీప్ సైజ్ ఉండటంతో మధ్యస్థ, పెద్ద గదులకు కూడా ఇది బాగా సరిపోతుంది.

45
రిమోట్ కంట్రోల్‌తో స్మార్ట్ ఫీచర్లు
Image Credit : orientelectric.com

రిమోట్ కంట్రోల్‌తో స్మార్ట్ ఫీచర్లు

ఈ ఫ్యాన్‌ను రిమోట్ ద్వారా సులభంగా నియంత్రించవచ్చు. ఫ్యాన్ స్పీడ్ మార్చడం, ఆన్/ఆఫ్ చేయడం కోసం స్విచ్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఫ్యాన్‌తో పాటు రిమోట్, బ్యాటరీలు కూడా బాక్స్‌లో అందిస్తారు. దీంతో ఇన్‌స్టాలేషన్ తర్వాత వెంటనే ఉపయోగించుకోవచ్చు.

55
వారంటీ, ఇతర వివరాలు
Image Credit : orientelectric.com

వారంటీ, ఇతర వివరాలు

ఈ ఫ్యాన్‌కు 3 సంవత్సరాల వారంటీ ఇస్తున్నారు. ఇందులో ఉన్న బ్యాటరీకి 1 సంవత్సరం వారంటీ ఉంటుంది. ఈ ఫ్యాన్‌కు 5 స్టార్ ప‌వ‌ర్ రేటింగ్ ఇచ్చారు. వోల్టేజ్ 220-240V ఉంటుంది. పవర్ 28W, స్పీడ్ 350 RPM, ఎయిర్ డెలివరీ 230 CMM, స్వీప్ సైజ్ 1200 MM ఉంటుంది. భార‌త‌దేశంలో త‌యారైన ఈ ఫ్యాన్ లాంచ్ అయినా ఇంకా రిటైల్ స్టోర్‌లో అందుబాటులోకి రాలేదు. త్వ‌ర‌లోనే మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. ఇక ధ‌ర విష‌యానికొస్తే ఈ ఫ్యాన్ ధ‌ర సుమారు రూ. 4500 ఉండొచ్చ‌ని అంచ‌నా.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
గాడ్జెట్‌లు
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
Home Decor: చెత్త‌లో ప‌డేసే పిస్తా పెంకుల‌తో మీ ఇంటిని అందంగా మార్చేయొచ్చు.. సింపుల్ ట్రిక్స్
Recommended image2
Smart TV: రూ. 65 వేల స్మార్ట్ టీవీ కేవ‌లం.. రూ. 26 వేల‌కే. ఏకంగా 58 శాతం డిస్కౌంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved