- Home
- Jobs
- Government Jobs
- మీరూ IAS, IPS కావాలనుకుంటున్నారా..? అయితే ఈ సివిల్స్ ర్యాంకర్ చెప్పిన 5 టిప్స్ ఫాలోకండి
మీరూ IAS, IPS కావాలనుకుంటున్నారా..? అయితే ఈ సివిల్స్ ర్యాంకర్ చెప్పిన 5 టిప్స్ ఫాలోకండి
IAS, IPS కావాలని కలలుగనే యువత సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కోసం పకడ్బందీగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా ప్రిపరేషన్ ప్రారంభించాలనుకునేవారు 2025 సివిల్స్ ర్యాంకర్ తుషారికా అందించే టాప్ 5 చిట్కాలు ఫాలోకండి… ర్యాంక్ సాధించండి.

సివిల్స్ ప్రిపరేషన్ చిట్కాలు..
IAS and IPS Preparation : భారతదేశంలోనే అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాలు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS). దేశ పాలనా వ్యవహారాల్లో ఈ ఉద్యోగులదే వీరిదే కీలక పాత్ర... వీరిచేతిలో సూపర్ పవర్స్ ఉంటాయి. ఇలా అత్యున్నత హోదా, సమాజంలో గౌరవంతో పాటు మంచి ఆదాయం కూడా లభిస్తుంది... అందుకే సర్వీసెస్ లో చేరాలన్నది లక్షలాదిమంది యువతీయువకుల కల. ఇందుకోసం ఎంతో కష్టపడతుంటారు... పుస్తకాలతో రాత్రింభవళ్లు కుస్తీలు పడుతుంటారు... ఎప్పుడూ మెదడుకు పని చెబుతుంటారు.
అయితే IAS, IPS వంటి అత్యున్నత పోస్టులకు అభ్యర్థులకు ఎంపికచేయడం అంటే మామూలు విషయం కాదు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC) అత్యంత కఠినమైన ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ (CSE) నిర్వహిస్తుంది... ఇందులో ఉత్తమ ర్యాంకు సాధించినవారే కలల జాబ్ సాధిస్తారు... IAS, IPS లుగా మారతారు.
ఎంతో కఠినమైన సివిల్స్ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ ప్రారంభించాలనుకునే యువతీయువకులు ఇప్పటికే ర్యాంక్ సాధించిన వారి సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. ఇలాంటి వారికోసమే UPSC 2025 ఆల్ ఇండియా ర్యాంకర్ తుషారికా కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
1. NCRT పుస్తకాలు చదవాలి...
సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ లో NCERT (National Council of Educational Research and Training) పుస్తకాలు అత్యంత కీలకపాత్ర పోషిస్తాయని సివిల్స్ ర్యాంకర్ తుషారికా తెలిపారు. ఈ పుస్తకాల్లోని సమాచారం సివిల్స్ ఎగ్జామ్స్ లో ఎక్కువగా అడుగుతుంటారు... కాబట్టి ఇది మీ కలల జాబ్ సాధించేందుకు బలమైన పునాది వేస్తుంది. సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ సిలబస్ లో చాలాభాగం ఈ పుస్తకాల నుండి కవర్ అవుతుంది.
2. నిలబడగా ప్రిపరేషన్ సాగించాలి...
IAS, IPS వంటి అత్యున్నత ఉద్యోగాలను సాధించాలంటే నిలకడగా ప్రిపేర్ అవ్వడం చాలా ముఖ్యమని సివిల్స్ ర్యాంకర్ తుషారికా చెబుతున్నారు. వెనకడుగు వెయ్యకుండా ప్రిపరేషన్ సాగించాలి... ''నేను చదవలేకపోతున్నా'' అనుకుంటే ఓటమిని అంగీకరించినట్లే. ప్రయత్నలోపం లేకుండా డెడికేషన్ తో ప్రిపరేషన్ సాగిస్తే కాస్త ఆలస్యమైన తప్పకుండా ర్యాంక్ సాధించడం ఖాయం.
3. సింపుల్ టార్గెట్స్ పెట్టుకోవాలి...
సివిల్స్ ప్రిపరేషన్ సమయంలో అసాధ్యమైన టార్గెట్స్ అస్సలు పెట్టుకోవద్దు... రోజుకు ఎంత చదవగలుగుతారో అంతే చదవాలని తుషారికా సూచిస్తున్నారు. ఇది చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందట. ఒకవేళ అసాధ్యమైన టార్గెట్స్ పెట్టుకుని అది రీచ్ అవ్వకుంటే నిరూత్సాహపడతారు.. ఇది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని తెలిపారు.
4. కాన్సెప్ట్స్ బాగా నేర్చుకోవాలి...
సివిల్స్ సర్వీసెస్ కు ప్రిపేరయ్యే అభ్యర్థులు హార్ట్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయాలని తుషారికా సూచించారు. కష్టపడి చదవడం కాదు కాన్సెప్ట్స్ ను బాగా నేర్చుకోవాలని... అప్పుడు ప్రిపరేషన్ మరింత ఈజీ అవుతుందని అంటున్నారు. అలాగే ప్రిపరేషన్ పూర్తయ్యాక టెస్ట్ లు రాద్దామని చాలామంది భావిస్తారు... కానీ ముందునుండే రాయాలని సూచించారు. ఇది రివర్స్ ఇంజనీరింగ్ లాగా పనిచేస్తుందని… అభ్యర్థులు ఎక్కడ స్ట్రాంగ్ గా ఉన్నారో… ఎక్కడ వీక్ గా ఉన్నారో తెలుసుకుంటారని అంటున్నారు.
5. ఆప్షనల్ సబ్జెక్ట్స్ పై పట్టు సాధించాలి..
సివిల్ సర్వీసెస్ లో మెయిన్ సబ్జెక్ట్స్ తో పాటు అభ్యర్థులు ఇష్టంగా ఎంచుకునే ఆప్షనల్ సబ్జెక్ట్ చాలా కీలకమైనది. దీనిపై పట్టు సాధించాలని... ఇందులో స్ట్రాంగ్ గా ఉంటేనే మంచి మార్కులు సాధించగలమని సివిల్స్ ర్యాంకర్ తుషారికా చెబుతున్నారు.

