MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Jobs
  • Government Jobs
  • Government Jobs : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్... 2,929 ఉద్యోగాల భర్తీ, అర్హతలుంటే ఓ ఉద్యోగం మీదే

Government Jobs : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్... 2,929 ఉద్యోగాల భర్తీ, అర్హతలుంటే ఓ ఉద్యోగం మీదే

Telangana Govt Jobs 2026 : తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగానే వైద్యారోగ్య శాఖలో వేలాది ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యింది. ఈ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. 

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 31 2026, 12:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలంగాణ యువతకు గుడ్ న్యూస్..
Image Credit : Getty

తెలంగాణ యువతకు గుడ్ న్యూస్..

Government Jobs : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీ సాక్షిగా భారీ ఉద్యోగాల భర్తీకి సిద్దమవుతున్నట్లు రేవంత్ సర్కార్ స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో ఏకంగా 2,929 పోస్టుల భర్తీకి అంతా సిద్దం చేసినట్లు సంబంధిత మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
వైద్యారోగ్య శాఖలోనే ఇన్ని ఉద్యోగాలా..!
Image Credit : Getty

వైద్యారోగ్య శాఖలోనే ఇన్ని ఉద్యోగాలా..!

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేవలం వైద్యారోగ్య శాఖలోనే భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు మంత్రి రాజనర్సింహ తెలిపారు. ఇప్పటివరకు 9,572 ఉద్యోగాలను భర్తీ చేయగా మరో 7 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి వెల్లడించారు. ఇలా డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందితో పాటు ఇతర పారామెడికల్ సిబ్బంది నియామకాలు చేపట్టి సామాన్య ప్రజలకు ప్రభుత్వ హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం అందిలా చూస్తున్నామని మంత్రి తెలిపారు.

Related Articles

Related image1
Railway Jobs : తెలుగు యువతకు బంపరాఫర్... పదో తరగతి పాసైతే చాలు ప్రభుత్వ ఉద్యోగం
Related image2
Jobs : తెలుగు యువత బీ రెడీ... ఏకంగా 68,150 ఉద్యోగాలు వచ్చేస్తున్నాయ్..!
35
కాంగ్రెస్ హయాంలో జరిగిన నియామకాలివే..
Image Credit : Getty

కాంగ్రెస్ హయాంలో జరిగిన నియామకాలివే..

కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాతే ఉద్యోగ నియామక ప్రక్రియ వేగవంతమైందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. గత రెండేళ్లలోనే దాదాపు 50 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు, పోలీస్, గ్రూప్, 1,2,3,4 వంటి అనేక ఉద్యోగాలున్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TGPSC) ద్వారా పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని... త్వరలోనే మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడతాయని ప్రభుత్వం చెబుతోంది. కాబట్టి నిరుద్యోగ యువత ఎప్పుడు ఎగ్జామ్ నిర్వహించిన జాబ్ సాధించేందుకు సన్నద్దంగా ఉండాలి.

45
హోంశాఖలో 17992 పోస్టులు ఖాళీ...
Image Credit : Getty

హోంశాఖలో 17992 పోస్టులు ఖాళీ...

తెలంగాణ పోలీస్ శాఖలో కూడా త్వరలోనే భారీ ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడేలా కనిపిస్తోంది. హోంశాఖ పరిధిలోని వివిధ విభాగాల్లో ఏకంగా 17,992 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.. వీటన్నింటిని దశల వారిగా భర్తీ చేయనున్నారు... ఇందులో ఎస్సై, కానిస్టేబుల్ తో పాటు ఇతర టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు ఉన్నాయి.

హోంశాఖలో ఖాళీల భర్తీకి అధికారులు ప్రతిపాదనలు పంపారు.. క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం లభించగానే నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలున్నాయి. పోస్టుల వారిగా అర్హతలు, ఎంపిక ప్రక్రియతో పూర్తిస్థాయి నోటిఫికేషన్లు రాబోతున్నాయి... కాబట్టి పోలీస్ ఉద్యోగాలను సాధించాలని కలలుగనే యువత సిద్దంగా ఉండాలి.

55
జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు..
Image Credit : Getty

జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు..

తెలంగాణ వ్యాప్తంగా న్యాయశాఖలో ఉద్యోగ నియామక ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న 859 పోస్టుల భర్తీకి TGHC నోటిఫికేషన్ వెలువడింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగిసింది.. త్వరలోనే రాత పరీక్ష, ఇతర ప్రక్రియను ముగించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ ఉద్యోగాల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మీరూ IAS, IPS కావాలనుకుంటున్నారా..? అయితే ఈ సివిల్స్ ర్యాంకర్ చెప్పిన 5 టిప్స్ ఫాలోకండి
Recommended image2
Govt Jobs : టెన్త్ పాస్ అయితే చాలు.. ఆర్మీ, నేవీలో భారీ ఉద్యోగాల జాతర! వెంటనే అప్లై చేయండి
Recommended image3
తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. 3038 ఆర్టిసి ఉద్యోగాల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్
Related Stories
Recommended image1
Railway Jobs : తెలుగు యువతకు బంపరాఫర్... పదో తరగతి పాసైతే చాలు ప్రభుత్వ ఉద్యోగం
Recommended image2
Jobs : తెలుగు యువత బీ రెడీ... ఏకంగా 68,150 ఉద్యోగాలు వచ్చేస్తున్నాయ్..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved