- Home
- Jobs
- Government Jobs
- Government Jobs 2026 : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. వెయ్యికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలతో మెగా నోటిఫికేషన్
Government Jobs 2026 : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. వెయ్యికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలతో మెగా నోటిఫికేషన్
Government Jobs 2026 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్దం అవుతున్న నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. వెయ్యికి పైగా ఉద్యోగాలతో ఏపీ విద్యాశాఖ భారీ నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
Government Jobs : తెలుగు యువతకు గుడ్ న్యూస్. ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత విద్యాశాఖలో భారీ ఉద్యోగాల భర్తీకి కూటమి ప్రభుత్వం సిద్దమయ్యింది. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో బోధనా, బోధనేతర సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 1523 పోస్టులకు మే 15న నోటిఫికేషన్ వెలువడనుంది.... ఇందులో రెగ్యులర్ తో పాటు బ్యాక్ లాగ్ పోస్టులు ఉన్నాయి.

యూనివర్సిటీల వారిగా ఖాళీల వివరాలు..
అత్యధికంగా రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) లో 311 పోస్టులు ఉన్నాయి.
ఆంధ్ర యూనివర్సిటీ - 246 ఖాళీలు
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ - 125 ఖాళీలు
శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ - 103 ఖాళీలు
JNTU అనంతపురం - 95 ఖాళీలు
JNTU గురజాడ - 48 ఖాళీలు
JNTU - కాకినాడ - 56 ఖాళీలు
యోగి వేమన యూనివర్సిటీ - 47 ఖాళీలు
ద్రవిడ యూనివర్సిటీ - 20 ఖాళీలు
డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్ - 65 ఖాళీలు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ - 46 ఖాళీలు
విక్రమ సింహపురి యూనివర్సిటీ - 48 ఖాళీలు
రాయలసీమ యూనివర్సిటీ - 47 ఖాళీలు
డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ - 37 ఖాళీలు
ఆదికవి నన్నయ యూనివర్సిటీ - 47 ఖాళీలు
కృష్ణా యూనివర్సిటీ - 43 ఖాళీలు
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ - 82 ఖాళీలు
ఆంధ్ర కేసరి యూనివర్సిటీ - 9 ఖాళీలు
APPSC ఎగ్జామ్...
ఉన్నత విద్యాశాఖ విశ్వవిద్యాలయాల్లో ఖాళీలను ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) ద్వారా చేపట్టనుంది. నోటిఫికేషన్ లోనే పరీక్షా విధానం, సిలబస్ తదితర వివరాలు ఉంటాయి… లేదంటే ఏపిపిఎస్సి ప్రత్యేకంగా సిలబస్ ను ప్రకటిస్తుంది.
ఈ యూనివర్సిటీ ఉద్యోగాల్లో ఎస్సి, ఎస్టి, దివ్యాంగులకు 30 శాతం, బిసిలకు 35 శాతం, ఇతరులకు 40 శాతం అర్హత మార్కులుగా నిర్ణయించే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేసే లెక్చరర్స్ కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.... వీరికి వెయిటేజీ మార్కులు కేటాయించనున్నారు.

