MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Careers
  • Success Story : పట్టువదలని విక్రమార్కులు.. ఈ ఐదుగురూ లాస్ట్ అటెంప్ట్స్ లోనే IAS సాధించారుగా

Success Story : పట్టువదలని విక్రమార్కులు.. ఈ ఐదుగురూ లాస్ట్ అటెంప్ట్స్ లోనే IAS సాధించారుగా

IAS Success Story : ఫెయిల్యూర్స్ నుండి పాఠాలు నేర్చుకుని ముందుకుసాగిన సివిల్స్ ర్యాంకర్స్ స్టోరీ ఇది. ఒకటి రెండు కాదు 5, 6వ ప్రయత్నంలో UPSC పరీక్షలో విజయం సాధించిన ఐదుగురు ఐఏఎస్ అధికారుల ఆసక్తికర, స్ఫూర్తిదాయక ప్రయాణం గురించి తెలుసుకోండి.  

2 Min read
Arun Kumar P
Published : Dec 23 2025, 01:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఈ ఐఎఎస్ లే నేటి యువతరానికి స్పూర్తి...
Image Credit : Gemini

ఈ ఐఎఎస్ లే నేటి యువతరానికి స్పూర్తి...

IAS Success Story : UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్).. దేశంలోనే అత్యున్నత సర్వీసెస్ IAS, IPS, IFS వంటి ఉద్యోగాలను భర్తీ చేసే కేంద్ర ప్రభుత్వ నియామక సంస్థ. ఇది నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ (CSE) దేశంలోనే అత్యంత కఠినమైనది. ఏటా లక్షల మంది యువతీయువకులు సివిల్స్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తారు… కానీ కొందరే విజయం సాధిస్తారు.

చాలామందికి మొదటి ప్రయత్నంలో ఫెయిల్యూర్ ఎదురవుతుంది… దీంతో నిరాశతో వెనుదిరుగుతుంటారు. కొందరు మాత్రం అపజయాలను సోపానాలుగా మార్చుకుని విజయం దిశగా ప్రయాణం సాగిస్తారు… పదేపదే పడినా కిందపడినా లేచి నిలబడతారు. ఇలా ఒకటి రెండుసార్లు కాదు అనేక అపజయాలు ఎదరైనా వెనుదిరగకుండా 5, 6వ ప్రయత్నంలో IAS అయినవారు చాలామంది ఉన్నారు.. అలాంటి అధికారుల గురించి తెలుసుకోండి. ఈ స్పూర్తితో మీరు కూడా పదేపదే వైఫల్యాలు ఎదురైనా మరింత పట్టుదలతో ప్రయత్నించి సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధించగలరు.

26
శక్తి దూబే... 6వ ప్రయత్నంలో ఆలిండియా టాపర్‌
Image Credit : Shakti Dubey IAS/Instagram

శక్తి దూబే... 6వ ప్రయత్నంలో ఆలిండియా టాపర్‌

ప్రయాగ్‌రాజ్‌కు చెందిన శక్తి దూబే UPSC 2024లో ఆల్ ఇండియా ర్యాంక్ 1 సాధించారు… అయితే ఇది ఆమెకు ఆరో ప్రయత్నం. ఆమె మొదట్లో విఫలమైనా పట్టు వదల్లేదు… కోవిడ్ వల్ల కోచింగ్ వదిలి ఇంటి నుంచే సెల్ఫ్ స్టడీ చేశారు. ఆమె కథ పదేపదే విఫలమై తమను తాము తక్కువ చేసుకుని ఆత్మస్థైర్యం కోల్పోయే విద్యార్థులకు ఒక పాఠం.

Related Articles

Related image1
Success Story : అన్న క్యాంటీన్ నుండి పోలీస్ జాబ్ వరకు .. ఈమెది కదా సక్సెస్ అంటే..!
Related image2
Success Story : రెండు చేతులు, ఓ కాలు పనిచేయవు.. ఒక్క కాలితో లక్షలమందిని ఓడించి, జీవితాన్ని గెలిచిన తెలుగోడు
36
అవనీష్ శరణ్ IAS ... ఆలిండియా 77వ ర్యాంక్
Image Credit : Avnish Sharan IAS/Instagram

అవనీష్ శరణ్ IAS ... ఆలిండియా 77వ ర్యాంక్

తక్కువ మార్కులను బలహీనతగా భావించేవారికి అవనీష్ శరణ్ కథ స్ఫూర్తి. 10వ తరగతిలో 44%, 12వ తరగతిలో 65% మార్కులు సాధించినా, పట్టుదలతో రెండో ప్రయత్నంలో UPSCలో 77వ ర్యాంక్ సాధించారు. ఆయన 10 సార్లు స్టేట్ PCSలో ఫెయిల్ అయ్యారు.

46
ప్రియాంక గోయల్ IAS... 5వ ప్రయత్నంలో విజయం
Image Credit : IAS Priyanka Goyal/Instagram

ప్రియాంక గోయల్ IAS... 5వ ప్రయత్నంలో విజయం

ప్రియాంక గోయల్ UPSC ప్రయాణం కష్టాలతో నిండింది. ఆమె నాలుగుసార్లు విఫలమయ్యారు. అనేక సమస్యలు చుట్టుముట్టినా ఆమె పట్టు వదల్లేదు… తల్లి అనారోగ్యంతో బాధపడుతుంటే ఆమెకు సేవలు చేస్తూనే ప్రిపేర్ అయ్యింది. చివరకు 2022 లో ఐదో ప్రయత్నంలో ఆలిండియా 369వ ర్యాంక్ సాధించారు.

56
యశని నాగరాజన్ IAS
Image Credit : Yashni Nagarajan IAS/Instagram

యశని నాగరాజన్ IAS

ఉద్యోగం చేస్తూ ప్రిపరేషన్ వదిలేయాలనుకునే వారికి యశని నాగరాజన్ ఆదర్శం. ఫుల్ టైమ్ జాబ్ చేస్తూ రోజుకు 4-5 గంటలు చదివి, నాలుగో ప్రయత్నంలో UPSC 2019లో 57వ ర్యాంక్ సాధించారు. టైమ్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యం అని ఆమె నమ్మకం.

66
పీకే సిద్ధార్థ్ రామ్‌కుమార్ IAS.. నాలుగో ప్రయత్నంలో నాలుగో ర్యాంక్
Image Credit : IAS PK Siddharth Ramkumar/linkedin

పీకే సిద్ధార్థ్ రామ్‌కుమార్ IAS.. నాలుగో ప్రయత్నంలో నాలుగో ర్యాంక్

పీకే సిద్ధార్థ్ రామ్‌కుమార్ UPSC CSE 2023లో ఆల్ ఇండియా 4వ ర్యాంక్ సాధించారు. ఇది ఆయన నాలుగో ప్రయత్నం. 2022లో 121వ ర్యాంక్‌తో IPSకు ఎంపికై శిక్షణలో ఉండగానే, 2023 ఫలితాలు వచ్చాయి. ఆయన మళ్ళీ పరీక్ష రాసిన విషయం కుటుంబానికి కూడా తెలియదు. ఇలా ఓవైపు శిక్షణలో ఉంటూనే పరీక్ష రాసి తన కలల సర్వీస్ IAS సాధించారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఫీల్ గుడ్ న్యూస్
భారత దేశం
విద్య
ఏషియానెట్ న్యూస్
ఉద్యోగాలు, కెరీర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Competitive Exam Tips : చండి పాదాల అండ.. ఈ మూడు పదాలు గుర్తుపెట్టుకుంటే చాలు మంచి మార్కులు..!
Recommended image2
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా
Recommended image3
Banking Jobs : అల్లాటప్పా బ్యాంకులో కాదు ఆర్బిఐలోనే జాబ్... ఈ అర్హతలుంటే మీదే
Related Stories
Recommended image1
Success Story : అన్న క్యాంటీన్ నుండి పోలీస్ జాబ్ వరకు .. ఈమెది కదా సక్సెస్ అంటే..!
Recommended image2
Success Story : రెండు చేతులు, ఓ కాలు పనిచేయవు.. ఒక్క కాలితో లక్షలమందిని ఓడించి, జీవితాన్ని గెలిచిన తెలుగోడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved