MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Jobs
  • PF Rules 2026 : పీఎఫ్ ఖాతాదారులకు డబుల్ జాక్‌పాట్..! ఇకపై నెలకు రూ.6,000 జమ

PF Rules 2026 : పీఎఫ్ ఖాతాదారులకు డబుల్ జాక్‌పాట్..! ఇకపై నెలకు రూ.6,000 జమ

ఇకపై భవిష్య నిధి (PF) నిబంధనల్లో కీలక మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 1, 2026 నుంచి కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఉద్యోగుల జీతాలు, పొదుపుపై ఎలాంటి ప్రభావం ఉంటుందో వివరంగా చూద్దాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 20 2026, 03:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఉద్యోగులకు గుడ్ న్యూస్
Image Credit : Gemini AI

ఉద్యోగులకు గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వం వేతన పరిమితిని రూ.25,000కు పెంచాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏప్రిల్ 1, 2026 నుంచి వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ పరిమితి పెరిగితే లక్షలాది మంది ప్రైవేట్ ఉద్యోగులు కొత్తగా పీఎఫ్ పరిధిలోకి వస్తారు. ఉద్యోగి, సంస్థ వాటా కూడా పెరగడంతో రిటైర్మెంట్ నాటికి పొదుపు మొత్తం గణనీయంగా పెరుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆదాయపన్ను నిబంధనల్లో మార్పులు
Image Credit : Asianet News

ఆదాయపన్ను నిబంధనల్లో మార్పులు

ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఆదాయపు పన్ను, పొదుపు నిబంధనలలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఈ ఏడాది నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగి పీఎఫ్ వాటా రూ.2.5 లక్షలు దాటితే, ఆ అదనపు మొత్తంపై వచ్చే వడ్డీకి పన్ను చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పరిమితి రూ.5 లక్షలుగా ఉంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను విధానం (New Tax Regime) డీఫాల్ట్‌గా ఉంటుంది. పాత విధానంలో పన్ను మినహాయింపులు కావాలనుకుంటే, ఆ విషయాన్ని మీ కంపెనీకి ముందుగానే తెలియజేయాలి.

Related Articles

Related image1
EPFO: ఒక్క క్లిక్‌తోనే మీ PF సమాచారం మొత్తం లభిస్తుంది: ఏం చేయాలంటే..
Related image2
EPF New Rule: పీఎఫ్ విత్‌డ్రా చేస్తున్నారా? ఇకపై దాని అవసరం లేకుండానే డబ్బులు.. ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్ ఇవే..
35
ఆటోమెటిగ్గా పీఎఫ్ అకౌంట్ బదిలీ
Image Credit : iSTOCK

ఆటోమెటిగ్గా పీఎఫ్ అకౌంట్ బదిలీ

ఉద్యోగం మారినప్పుడు పాత కంపెనీ పీఎఫ్ ఖాతాను కొత్త కంపెనీ ఖాతాకు ఆటోమేటిక్‌గా బదిలీ చేసే సదుపాయాన్ని మెరుగుపరిచారు. దీనివల్ల ఇకపై మాన్యువల్‌గా దరఖాస్తు చేసుకునే శ్రమ తగ్గుతుంది. 

బేసిక్ జీతంలో 12% పీఎఫ్‌కు వెళ్తుంది కాబట్టి, ఖాతాలో జమ అయ్యే మొత్తం పెరుగుతుంది. అయితే మీ వాటా పెరగడం వల్ల చేతికి వచ్చే జీతం (Take-home salary) తగ్గే అవకాశం ఉంది. కానీ మీ సంస్థ వాటా కూడా పెరుగుతుంది కాబట్టి దీర్ఘకాలంలో ఇది మీకు ఎక్కువ లాభాన్ని ఇస్తుంది.

45
మీ ఖాతాలో ఆరువేలు.. ఎలాగో తెలుసా?
Image Credit : Asianet News

మీ ఖాతాలో ఆరువేలు.. ఎలాగో తెలుసా?

ఉదాహరణకు మీ జీతం రూ.25,000 అయితే దానిపై 12% పీఎఫ్ కట్ అవుతుంది. అంటే మీ వాటా రూ.3,000, మీ సంస్థ వాటా రూ.3,000 కలిపి మొత్తం రూ.6,000 మీ ఖాతాలో జమ అవుతుంది. ప్రస్తుతం ఈ మొత్తం గరిష్ఠంగా రూ.3,600 మాత్రమే ఉంది. సంస్థ వాటాలో కొంత భాగం పెన్షన్ పథకానికి వెళ్తుంది. వేతన పరిమితి పెరగడం వల్ల, రిటైర్మెంట్ తర్వాత మీకు లభించే నెలవారీ పెన్షన్ మొత్తం కూడా పెరుగుతుంది. అలాగే ఉచిత భీమా మొత్తం కూడా కొత్త పరిమితికి అనుగుణంగా పెరుగుతుంది.

55
పీఎఫ్ పెంపు
Image Credit : freepik

పీఎఫ్ పెంపు

వ్యక్తుల ఆదాయాలు, నిత్యావసరాల ధరలు పెరిగినా పీఎఫ్ వేతన పరిమితి మాత్రం మారలేదు. దీంతో మధ్యతరగతి ఉద్యోగులు పీఎఫ్, పెన్షన్ ప్రయోజనాలను పూర్తిగా పొందలేకపోతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని నాలుగు నెలల్లోగా ఈ వేతన పరిమితిని మార్చాలని సుప్రీంకోర్టు ఇటీవల ఈపీఎఫ్ఓను ఆదేశించింది. అయితే ఈ పెంపుపై కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడుతుందని అందరూ ఎదురుచూస్తున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
భారత దేశం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pilot Training : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్... ఇకపై ఈజీగా మీ పైలట్ కలను నిజం చేసుకోవచ్చు
Recommended image2
Bank Jobs : ప్రభుత్వ బ్యాంకులో జాబ్ సాధించాలని కలగంటున్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు
Recommended image3
TG Police Recruitment 2026: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ ఎంత? జీతం, క్వాలిఫికేషన్, నెగెటివ్ మార్కింగ్ ఫుల్ డీటైల్స్
Related Stories
Recommended image1
EPFO: ఒక్క క్లిక్‌తోనే మీ PF సమాచారం మొత్తం లభిస్తుంది: ఏం చేయాలంటే..
Recommended image2
EPF New Rule: పీఎఫ్ విత్‌డ్రా చేస్తున్నారా? ఇకపై దాని అవసరం లేకుండానే డబ్బులు.. ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్ ఇవే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved