Government Jobs : కేవలం డిగ్రీ చాలు.. నెలనెలా రూ.67,700 శాలరీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
Central Government Jobs : డిగ్రీ పూర్తిచేసిన యువతీయువకులకు అద్భుత అవకాశం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది… మీకు అర్హతలుంటే వెంటనే దరఖాస్తు చేసుకొండి.

టాటా మెమోరియల్ సెంటర్ లో జాబ్స్
Government Jobs : ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్దం అవుతున్న యువతీయువకులకు అద్భుత అవకాశం. దేశంలో క్యాన్సర్ చికిత్స, పరిశోధన కోసం పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ టాటా మెమోరియల్ సెంటర్ (TMC) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 34 నాన్ మెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మంచి జీతం, కేంద్ర ప్రభుత్వ హోదా ఉన్న ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
TMC ఖాళీల వివరాలు
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ III (స్టోర్స్) - 02
డిప్యూటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (గ్రేడ్ 1) - 04
పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (PRO) - 02
డిప్యూటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (HRD) - 01
డిప్యూటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 01
అకౌంట్స్ ఆఫీసర్ 2 : 03
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 06
అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ - 03
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (Purchase and Stores) - 03
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (Purchase) - 01
అసిస్టెంట్ - 08
విద్యార్హతలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ (Any Degree) పాసై ఉండాలి. డిప్యూటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుకు మాత్రం ఆర్ముడ్ ఫోర్సెస్ సర్టిఫికేట్ ఉండాలి. ఇక అన్ని ఉద్యోగాలకు ఎక్స్పీరియన్స్ తప్పనిసరి.
వయోపరిమితి, ఎంపిక విధానం
దరఖాస్తుదారుల వయసు 18 ఏళ్లు నిండివుండాలి… గరిష్ఠంగా 50 ఏళ్లలోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. ఎస్సీ/ఎస్టీ (SC/ST) వర్గాల వారికి 5 ఏళ్లు, ఓబీసీ (OBC) వర్గాల వారికి 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు. దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది.
అర్హులైన అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ తర్వాత అభ్యర్థులను ఫైనల్ చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి?
అన్ని అర్హతలుండి, ఈ ఉద్యోగాల చేసే ఆసక్తి ఉన్నవారు https://tmc.gov.in/ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు డిసెంబర్ 3, 2025న ప్రారంభమయ్యాయి. దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 24, 2025. చివరి నిమిషంలో రద్దీని నివారించడానికి ఆసక్తి ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు
రిజర్వేషన్లు లేని జనరల్ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.300 చెల్లించాలి. మహిళలు, ఎస్సి, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు లేదు. ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు.
శాలరీ
ఎంపికైన అభ్యర్థులకు పదవిని బట్టి నెలకు రూ.35,400 నుంచి రూ.67,700 వరకు జీతం ఇస్తారు.
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 3 (లెవెల్ 11) : రూ.67,700
డిప్యూటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్/పిఆర్వో/డిప్యూటీ అడ్మిన్ ఆఫీసర్ (లెవెల్ 9) : రూ.53,100
అకౌంట్స్ ఆఫీసర్ 2 (లెవెల్ 8) : రూ.47,600
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్/అకౌంట్స్ ఆఫీసర్ (లెవెల్ 7) : రూ.44,900
అసిస్టెంట్ (లెవెల్ 6) : రూ.35,400

