- Home
- Jobs
- BHEL Recruitment : కేవలం ఐటిఐ చేసుంటే చాలు.. ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు
BHEL Recruitment : కేవలం ఐటిఐ చేసుంటే చాలు.. ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు
Bharat Heavy Electricals Limited : కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలో ఉద్యోగాలు… అదీ కేవలం పదో తరగతి అర్హతతో, ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే నియామకాలు. ఇంకెందుకు ఆలస్యం… అన్ని అర్హతలున్నవారు ఇంటర్వ్యూకు సిద్దంకండి.

BHEL లో ఉద్యోగాల భర్తీ ప్రకటన
BHEL Jobs : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ముఖ్యమైనది భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BHEL). విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బాయిలర్లు, కండక్టర్లు, భారీ పరికరాల తయారీలో ముందున్న ఈ సంస్థ కార్యాలయాలు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. ఇందులో వేలాదిమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే BHEL విభాగాల్లో ఒకటి తమిళనాడులోని రాణిపేటలో ఉంది… ఇందులో తాజాగా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలయ్యింది.
BHEL ఖాళీల వివరాలు
అప్రెంటిస్ – వెల్డర్ : 45 పోస్టులు
అప్రెంటిస్ – ఫిట్టర్ : 45 పోస్టులు
అప్రెంటిస్ – ఎలక్ట్రీషియన్ : 10 పోస్టులు
విద్యార్హతలు
ఈ పోస్టులకు పదో తరగతి పాసై, ఐటీఐ పూర్తి చేసినవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా 2023, 2024, 2025 సంవత్సరాల్లో ఐటీఐ పాసైన వాళ్లుమాత్రమే అర్హులు... అంటే ఇటీవలే ఐటిఐ పూర్తిచేసిన యువతకే అవకాశం.
వాక్-ఇన్ ఇంటర్వ్యూ వివరాలు
ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు ముందుగా ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు... ఈ నెల (డిసెంబర్) 15న నేరుగా జరిగే వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
చిరునామా: HRM కాన్ఫరెన్స్ హాల్, అడ్మిన్ బిల్డింగ్, BHEL, రాణిపేట – 632406
అవసరమైన పత్రాలు : 10వ తరగతి మార్కుల సర్టిఫికేట్, ఐటీఐ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం (SC/ST/OBC), దివ్యాంగుల సర్టిఫికేట్ లాంటి అవసరమైన అన్ని పత్రాలను ఇంటర్వ్యూకు తీసుకెళ్లాలి.
జీతం, ఇతర సౌకర్యాలు
అప్రెంటిస్ సిబ్బందికి నెలకు రూ.12,000 జీతం ఇస్తారు. దానితో పాటు రాయితీ ధరలో క్యాంటీన్ సౌకర్యం ఉంటుంది. రెగ్యులర్ బిహెచ్ఈఎల్ ఉద్యోగులకు ఉండే అలవెన్సులు వర్తించవు.
గమనిక : ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్దతిని నియమిస్తారు. కేవలం ఒక సంవత్సరం మాత్రమే శిక్షణ ఉంటుంది.

