తెలుగు మహిళలకు లక్కీ ఛాన్స్... ZOHO లో లక్షల శాలరీతో ఐటీ జాబ్స్
ZOHO Women Jobs : తెలుగు మహిళలకు అద్భుత అవకాశం. మీరు ప్రస్తుతం గృహిణులు అయినాసరే భారీ శాలరీతో ఉద్యోగాలను పొందవచ్చు. ఇండియన్ ఐటీ దిగ్గజం ZOHO ఈ అవకాశం కల్పిస్తోంది.

చదువుకున్న గృహిణులకు లక్కీ ఛాన్స్
Women Jobs : చాలామంది మహిళలు పిల్లల కోసం కెరీర్ ను త్యాగం చేస్తుంటారు. ఇంకొందరు మహిళలు ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదువుకున్నా పెళ్లి తర్వాత ఇంటికే పరిమితం అవుతుంటారు. ఇలాంటివారు పిల్లలు కాస్త పెద్దయ్యాక తిరిగి ఉద్యోగాలు చేయాలని భావిస్తారు... కానీ వారికి తగిన అవకాశాలు లభించవు. మంచి టాలెంట్ ఉన్నవారు కూడా మధ్యలో గ్యాప్ రావడంతో ఉద్యోగాలను పొందలేకపోతున్నారు... ఇలాంటివారికి భారతీయ ఐటీ దిగ్గజం జోహో (ZOHO) అద్భుత అవకాశం ఇస్తోంది.
గృహిణులకు సాప్ట్ వేర్ జాబ్స్
కుటుంబ పరిస్థితులు, పిల్లల సంరక్షణ, ఆరోగ్య సమస్యల కారణంగా ఉద్యోగాలు మానేసి ఇంటికే పరిమితమైన మహిళలు చాలామందే ఉంటారు. ఇందులో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా ఉన్నారు... వీరికి జోహో మరో ఛాన్స్ ఇస్తోంది. ఇందుకోసం 'మరుపడి' పేరిట జోహో స్కూల్ ఆఫ్ లెర్నింగ్ (ZSL) సరికొత్త కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఉద్యోగ విరామం తర్వాత టెక్ రంగంలోకి తిరిగి రావాలనుకునే మహిళలకు ఇది గొప్ప అవకాశం.
జోహో మరుపడి పథకం
జొహో 'మరుపడి' పథకం ప్రత్యేకత ఏంటంటే... ఉద్యోగ విరామాన్ని తీసుకున్న మహిళలకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి తిరిగి ఉద్యోగంలోకి చేర్చుకోవడం. చాలాకాలం ఉద్యోగానికి దూరంగా ఉండటంతో మహిళలో స్కిల్స్ దెబ్బతింటాయి... అందుకే వారికి సాంకేతిక శిక్షణ అందిస్తారు. ఇలా జోహో మహిళలను ఉద్యోగానికి తగినట్లు తీర్చిదిద్ది కెరీర్ ను మరింత బలంగా నిర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. మహిళలు జీవితాంతం ఇంటికే పరిమితం అవ్వకుండా ఉండేలా మరో అవకాశం కల్పిస్తోంది ZOHO.
మహిళలకు జోహో జాబ్స్
మళ్లీ కెరీర్ ప్రారంభించాలనుకునే గృహిణులు జోహోను సంప్రదించవచ్చు. వీరికి నేరుగా ఉద్యోగాలిస్తే ఇబ్బందిపడతారు కాబట్టి ప్రత్యేక శిక్షణ అందిస్తారు. ప్రత్యేకంగా ఎంపికచేసిన గృహిణులకు సుమారు 5 నెలల పాటు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, టెక్నికల్ రైటింగ్ లాంటి ఐటీ నైపుణ్యాలు నేర్పిస్తారు. శిక్షణ సమయంలో నెలవారీ స్టైఫండ్ కూడా ఇస్తారు. అనంతరం వారికి జోహోలోనే ఉద్యోగాలు కల్పిస్తారు.
లక్షల శాలరీతో మహిళలకు ఉద్యోగాలు
జోహోలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే మహిళలు ప్రస్తుతం ఏ జాబ్స్ చేస్తుండకూడదు. గతంలో కనీసం 2 ఏళ్లు టెక్నాలజీ రంగంలో పనిచేసిన అనుభవం ఉండాలి. వయోపరిమితి లేదు. డిగ్రీ, డిప్లొమా, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వాళ్లు అనర్హులు.
శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన వారికి ZOHO కంపెనీలోనే లక్షల జీతంతో ఐటీ ఉద్యోగం ఇస్తారు. ఇంటి నుంచే ఐటీ ఉద్యోగం చేయాలనే కల ఈ పథకంతో నిజం కావచ్చు. కాబట్టి కెరీర్‌ను మళ్లీ ప్రారంభించాలనుకునే మహిళలు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు.

