MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Jobs
  • Jobs : బిటెక్ విద్యార్థులకు బంపరాఫర్ ... రూ.50 వేల శాలరీ గవర్నమెంట్ జాబ్స్

Jobs : బిటెక్ విద్యార్థులకు బంపరాఫర్ ... రూ.50 వేల శాలరీ గవర్నమెంట్ జాబ్స్

BSNL Recruitment : బీఎస్ఎన్ఎల్ సంస్థలో 120 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? విద్యా అర్హత ఏంటి? అనే విషయాలు వివరంగా చూద్దాం. 

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 05 2026, 10:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిఎస్ఎన్ఎల్ జాబ్స్
Image Credit : Gemini AI

బిఎస్ఎన్ఎల్ జాబ్స్

భారతదేశంలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా లాంటి ప్రైవేట్ టెలికాం సంస్థల పోటీని తట్టుకుని నిలబడింది బిఎస్ఎన్ఎల్. ప్రభుత్వ సంస్థ అయినప్పటికీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోంది... దీంతో రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో బిఎస్ఎన్ఎల్ తమ సేవలను మరింత మెరుగుపర్చుకునేందుకు ఉద్యోగ నియామకాలు చేపట్టింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు..
Image Credit : stockPhoto

ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు..

టెలికాం, ఫైనాన్స్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (SET) పోస్టుల భర్తీకి బిఎస్ఎన్ఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెలికాం విభాగానికి 95, ఫైనాన్స్ విభాగానికి 25 పోస్టులు కేటాయించారు. ఈ పోస్టులకు ఈరోజు (ఫిబ్రవరి 5) నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 7.

35
విద్యా అర్హతలు ఏంటి?
Image Credit : META AI

విద్యా అర్హతలు ఏంటి?

టెలికాం విభాగంలోని పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా సంబంధిత రంగాల్లో పూర్తికాల బీఈ/బీటెక్ (BE/BTech) పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పైన చెప్పిన కోర్సుల్లో కనీసం 60% మార్కులు సాధించడం చాలా అవసరం. 

ఇక ఫైనాన్స్ విభాగంలోని పోస్టులకు దరఖాస్తు చేసేవాళ్లు సీఏ (చార్టర్డ్ అకౌంటెన్సీ) లేదా కాస్ట్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ అర్హత కలిగి ఉండాలి.

45
వయోపరిమితి
Image Credit : getty

వయోపరిమితి

బిఎస్ఎస్ పోస్టులకు దరఖాస్తు చేసేవాళ్ల వయసు కనీసం 21 ఏళ్లు నిండిఉండాలి. గరిష్ఠంగా 30 ఏళ్ల లోపు ఉండాలి. వెనుకబడిన, అత్యంత వెనుకబడిన వర్గాలకు అంటే రిజర్వేషన్లు కలిగిన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

55
ఎంపిక విధానం, శాలరీ..
Image Credit : AI meta

ఎంపిక విధానం, శాలరీ..

సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి టెక్నాలజీ, జనరల్ నాలెడ్జ్‌తో కూడిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షలో పాసైన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ ఉద్యోగంలో చేరిన వారికి ప్రాథమిక జీతం రూ.24,000 నుంచి రూ.50,000 వరకు ఉంటుంది. ఇది కాకుండా ఇతర అలవెన్సులు, వైద్య సదుపాయాలు కూడా ఉంటాయి.

దరఖాస్తు విధానం

అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్‌సైట్ అయిన bsnl.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలను ఈ వెబ్‌సైట్‌లో చూసి తెలుసుకోవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
భారత దేశం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రభుత్వ ఉద్యోగమే కాదు.. ఈ ప్రైవేట్ జాబ్స్ చేస్తే లక్షల్లో జీతం పక్కా
Recommended image2
పెళ్లైన మహిళలు ఎయిర్ హోస్టెస్ అవ్వొచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..
Recommended image3
Police Recruitment: కొలువుల జాతర.. 2050 పోలీస్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్ ఫుల్ డిటైల్స్ ఇవే
Related Stories
Recommended image1
Jobs: నెల‌కు రూ. 3 ల‌క్ష‌ల జీతంతో ఉద్యోగాలు .. అది కూడా జ‌ర్మ‌నీలో పోస్టింగ్‌. వెంట‌నే అప్లై చేసుకోండి
Recommended image2
Recharge Plans : జియో, ఎయిర్‌టెల్‌ కంటే చవక.. BSNL లో బెస్ట్ ప్లాన్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved