MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. 3038 ఆర్టిసి ఉద్యోగాల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్

తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. 3038 ఆర్టిసి ఉద్యోగాల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్

RTC Recruitment 2026 : తెలంగాణ ఆర్టిసి భారీ ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యింది. ఏకంగా 3038 ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. 

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 24 2026, 11:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టీజిఎస్ ఆర్టిసిలో భారీ ఉద్యోగాలు
Image Credit : Asianet News

టీజిఎస్ ఆర్టిసిలో భారీ ఉద్యోగాలు

TGSRTC Jobs 2026 : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్... ప్రభుత్వరంగ సంస్థ ఆర్టిసిలో భారీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (RTC) 2026 లో వివిధ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. 1000 డ్రైవర్ , 198 సూపర్ వైజర్, 746 శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది... ఈ నియామక ప్రక్రియ కొనసాగుతుండగా మరో వెయ్యి ఉద్యోగాలను కూడా భర్తీ చేయనున్నట్లు రవాణాశాక మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టీజిఎస్ ఆర్టిసిలో 3038 ఉద్యోగాల భర్తీ...
Image Credit : TGSRTC

టీజిఎస్ ఆర్టిసిలో 3038 ఉద్యోగాల భర్తీ...

తెలంగాణలో ప్రజారవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్దమయ్యింది... ఇందులో భాగంగానే ఆర్టిసిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఆర్టిసి సంస్థలో ఉద్యోగుల కొరతను గుర్తించిన ప్రభుత్వం వెంటనే నియామక ప్రక్రియ చేపట్టింది... ఇప్పటికే ఖాళీలను గుర్తించి భర్తీకి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.

ఈ ఏడాది తెలంగాణ ఆర్టిసిలో 3038 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ అనుమతి లభించిందని... ఇందులో 2 వేల ఉద్యోగాల నియామకాలు ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అతి త్వరలో మరో వెయ్యి ఉద్యోగాను భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఇలా 2026 లో ఆర్టిసిలో భారీగా ఉద్యోగాల భర్తీ జరగనుంది... కాబట్టి నిరుద్యోగ యువత ఈ అవకాశాలన్ని సద్వినియోగం చేసుకోవాలి.

35
కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్..
Image Credit : TGSRTC @ X

కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్..

సర్వీస్ లో ఉండగా మరణించిన ఉద్యోగుల స్థానంలో వారి కుటుంబసభ్యులకు అవకాశం కల్పించేందుకు కారుణ్య నియామకాలు చేపడుతుంటుంది ఆర్టిసి. ఇలా మరో 1132 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రకటించారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.

కారుణ్య నియామకాల కింద పోస్టింగ్ పొందిన ఉద్యోగులు గతంలో మూడు సంవత్సరాలు కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేయాల్సి ఉండేది. దీని రెండు సంవత్సరాలకు తగ్గించామని... ఆ తర్వాత వీరిని రెగ్యులర్ చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ప్రభాకర్ తెలిపారు.

45
ఆర్టిసి ఉద్యోగుల ఆందోళన...
Image Credit : TGSRTC@X

ఆర్టిసి ఉద్యోగుల ఆందోళన...

ఇదిలావుంటే తెలంగాణ ఆర్టిసి ఉద్యోగులు నేడు (ఫిబ్రవరి 24, మంగళవారం) ఆందోళనలు చేపడుతున్నారు... ఛలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జీతభత్యాలు అందించాలని ఆర్టిసి ఎంప్లాయిన్స్ యూనియన్స్ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు గతంలో రద్దుచేసిన కార్మిక సంఘాలను పునరుద్దరించాలని కోరుతున్నారు. ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలని, ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన కాకుండా సొంతంగా కొనుగోలుచేయాలని కోరుతూ ఆర్టిసి ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు.

ఈ డిమాండ్ల పరిష్కారానికి ఆర్టిసి కార్మికులు ఆందోళనకు దిగారు.. ప్రభుత్వం పోలీసులతో ఛలో సెక్రటేరియట్ ను అడ్డుకొంటే బస్సులను రోడ్లపైనే నిలిపివేస్తామని హెచ్చరించారు. అన్ని బస్ డిపోలకు చెందిన ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు తరలివచ్చి ఛలో సెక్రటేరియట్ లో పాల్గొంటున్నారు.

55
ఆర్టిసి ఉద్యోగులను సముదాయించే ప్రయత్నం..
Image Credit : X/Ponnam_INC

ఆర్టిసి ఉద్యోగులను సముదాయించే ప్రయత్నం..

ఛలో సెక్రటేరియట్ కు సిద్దమైన ఆర్టిసి ఉద్యోగులకు సముదాయించేందుకు రవాణామంత్రి పొన్నం రంగంలోకి దిగారు. ఆర్టీసీ ఉద్యోగులు నిరసనలు విరమించుకోవాలని ఆయన కోరారు. ప్రజా పాలన ప్రభుత్వంలో ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల భద్రత లక్ష్యంగా ముందుకు వెళ్తోందన్నారు. 

గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసి మూసివేసే దశకు తీసుకువచ్చింది... కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆర్టిసికి ఎప్పటికప్పుడు నిధులు కేటాయిస్తోందన్నారు. మహాలక్ష్మి పథకంతో పాటు అనేక విధాలుగా ఆర్టిసికి నిధులు కేటాయిస్తూ లాభాల బాటలోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఉద్యోగుల డిమాండ్ల విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా ఉంది.. కాబట్టి నిరసనలు విరమించుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
హైదరాబాద్
ఉద్యోగాలు, కెరీర్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Recommended image2
Farmer ID: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, రైతు భరోసా ఆగిపోవద్దంటే వెంటనే ఇలా చేయండి
Recommended image3
Heavy Rains Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వారం రోజులు వర్షాలే వర్షాలు
Related Stories
Recommended image1
Jobs : కేవలం పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు, నేరుగా ఇంటర్వ్యూకు హాజరైతే చాలు
Recommended image2
Jobs: ఎలాంటి ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ లేకుండా ప్ర‌భుత్వ ఉద్యోగం.. నెల‌కు రూ. 17500 జీతం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved