- Home
- Jobs
- Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Constable Jobs : తెలుగు యువతకు అద్భుత అవకాశం. భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు.

సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) లో భారీ ఉద్యోగాలు
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (CAPF), ఎస్ఎస్ఎఫ్ (SSF) లో కానిస్టేబుల్ పోస్టులకు, అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 48,954 (మహిళలు- 25487, పురుషులు- 23467) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. డిసెంబర్ 31 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : O1 డిసెంబర్ 2025
దరఖాస్తు స్వీకరణకు చివరితేదీ : 31 డిసెంబర్ 2025
ఆన్ లైన్ లో దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు చివరితేదీ : 01 జనవరి 2026
దరఖాస్తు ఫామ్ లో తప్పులను సరిదిద్దుకునే అవకాశం : 08 జనవరి 2026 నుండి 10 జనవరి 2026 వరకు
CBT పరీక్ష : ఫిబ్రవరి నుండి ఏప్రిల్ 2026
విద్యార్హతలు
10వ తరగతి పాసైన వాళ్ళు అస్సాం రైఫిల్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ
తెలుగుతో పాటు ఉర్దూలో సహా 13 ప్రాంతీయ భాషల్లో CBT (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) పరీక్ష నిర్వహిస్తారు. ఈ సిబిటి పరీక్ష 2026 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు జరుగుతుంది. తెలుగురాష్ట్రాల్లో హైదరాబాద్ తో పాటు విశాఖపట్నం, విజయవాడ వంటి అనేక నగరాల్లో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి.
PET (ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్) కూడా నిర్వహిస్తారు. పురుష అభ్యర్థులు 24 నిమిషాల్లో 5 కిలో మీటర్లు, మహిళా అభ్యర్థులు ఎనిమిదిన్నర నిమిషాల్లో 1.6 కి.మీ రేస్ పూర్తిచేయాల్సి ఉంటుంది. లదాక్ ప్రాంతానికి చెందిన అభ్యర్థులయితే పురుషులు 7 నిమిషాల్లో 1.6 కి.మీ, మహిళలు 5 నిమిషాల్లో 800 మీటర్లు పూర్తిచేయాలి.
ఫిజికల్ స్టాండార్ట్ టెస్ట్ కూడా ఉంటుంది. అనంతరం మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
వయో పరిమితి
దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులకు (Ex-Serviceman) నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ
పరీక్ష ఫీజు 100 రూపాయలు. అయితే, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులకు ఫీజు లేదు. పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం https://ssc.gov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించండి. పూర్తి వివరాల కోసం www.ssckkr.kar.nic.in వెబ్ సైట్ ని కూడా సందర్శించండి.

