- Home
- Careers
- High Demand Jobs : లక్షల ఉద్యోగాలున్నా చేసేవారే లేరు.. జాబ్స్ లిస్ట్ ఇదే, ట్రై చేశారో లైఫ్ సెట్
High Demand Jobs : లక్షల ఉద్యోగాలున్నా చేసేవారే లేరు.. జాబ్స్ లిస్ట్ ఇదే, ట్రై చేశారో లైఫ్ సెట్
ప్రస్తుత ఇండిగో సంక్షోభం నుండి నేటి యువతరం, పేరెంట్స్ చాలా విషయాలు నేర్చుకోవాలి. దేశంలో వర్క్ కల్చర్ మారకుంటే మరిన్ని రంగాల్లో సంక్షోభం తప్పదు. అలా జరక్కుండా ఉండాలంటే ఏం చేయాలి?

ముందుగా హెచ్చరిక !
విషయాన్ని కూలంకషంగా తెలియచెప్పాలంటే .. వివరంగా రాయాలి . మెసేజ్ సహజంగా పెద్దదవుతుంది. మొబైల్ అడిట్స్ కు రీల్స్ చూసి ఇన్ఫబేసిటీ.. చదివే ఓపిక ఉండదు ఇలాంటి వారు నా మెసేజ్ పై .. పైపైగా లుక్ వేసి .. మెసేజ్ బాగా లెంత్ అయ్యింది అని కామెంట్ పెట్టొదు. నా మెసేజ్ లు చదవకపోతే మీ కొచ్చే నష్టం ఏమీ లేదు. "అయన మాజీ భార్యకు తాజా భర్త" లాంటి వేడివేడి మసాలా వార్తలు.. మీ కోసం వెబ్ దునియాలో బోలెడు. హాయిగా కాలక్షేపం చేసుకోండి. BYE..
పది పుస్తకాలు చదివినా .. ఇరవై టెడ్ ఎక్స్ టాక్స్ విన్నా దొరకని సమాచారం మీ కోసం .. ఎప్పటిలాగే ...
ఇండిగో విమాన సంక్షోభానికి కారణాలు అనేకం ...
ఇందులో ముఖ్యమయినది కమర్సియల్ పైలట్ల కొరత. ముప్పై వేల పైలట్ లు కావాలి. కానీ తగిన అభ్యర్థులే దొరకడం లేదు.
మంద మనస్తత్వం !
సాఫ్ట్వేర్ ఇంజనీర్ .. లేదంటే డాక్టర్ .. ఇదీ భారతీయుల.. ముఖ్యంగా తెలుగు వారి దారి .... ఇరవై అయిదేళ్లుగా అదే పోకడ.
ఇప్పుడు సంక్షోభం !
అమెరికా లో ఒక కంపెనీ .. వారు ఉత్పత్తి చేసే వస్తువుకు సంభందించి ప్రభుత్వం ఇచ్చే పన్ను రాయితీ రద్దయ్యింది .వెంటనే కంపెనీ అత్యవసర సమావేశం. వైస్ ప్రెసిడెంట్ నుంచి జూనియర్ సోఫ్త్వేర్ ఇంజనీర్ దాక వందల మందిని ఉద్యోగంనుండి తొలగించారు . రాత్రికి రాత్రే నిరుద్యోగం. రెండు నెలల్లో కొత్త ఉద్యోగం సంపాదించుకోవాలి. లేకుంటే వీసా రద్దవుతుంది. కొత్త ఉద్యోగం ఎవరిస్తారు? దొరికినా ఇంత అర్జెంటుగా?
ఇప్పుడు అమెరికాలో వేలాది మంది... ఉద్యోగాలు కోల్పోయి కొత్త ఉద్యోగాల వెదుకులాటలో .. కొంతమంది సంపాదించుకుంటుంటే మరి కొంతమంది విసిగి పోయి.. నిరాశా నిస్పృహల్లో ....
పదేళ్లలోపు పిల్లలుంటే ఇండియాకు తిరిగి వచ్చేయొచ్చు ..వచ్చేస్తున్నారు కూడా.
పదేళ్లు దాటిన పిల్లలు ఇండియాలోనే ఉండిపోవడానికి ఇష్టపడే అవకాశం తక్కువ .
ఇదొక సంక్షోభం .
ఇండియా లో కొత్త ఉదోగ్యం చూసుకోవాలి. పిల్లల స్కూల్ .
మిడ్ ఏజ్ { 35 - 45 } లో సంక్షోభాన్ని చవి చూస్తున్న వారెందరో ..
డిమాండ్ ఉన్న ఉద్యోగాలివే..
మరో పక్క యువ డాక్టర్ లకు ఉద్యోగాలు దొరకడం లేదు . ఎంబీబీస్ పూర్తి చేసి మార్కెట్ లోకి వచ్చిన అనేకమందికి నెలకు 20 - 25 వేల ఉద్యోగాలు కూడా దొరకడం లేదు . దొరికినా ఉద్యోగ భద్రత ఉండదు. కాంట్రాక్టు బేసిస్ .. నైట్ షిఫ్టులు .. బండెడు చాకిరీ... సీనియర్ నర్స్ కు యాభై నుంచి డెబ్భై వేల దాకా జీతం. పారా మెడికల్ స్టాఫ్ కు కూడా ఒక్కో సారి జూనియర్ డాక్టర్ కంటే ఎక్కువ జీతం. రాబోయే రోజుల్లో కొత్త డాక్టర్స్ ఎదుర్కోబోతున్న సంక్షోభం అంతాఇంతా కాదు. ఐదేళ్లు చదివి ఉపాధిలేక యువ డాక్టర్స్ క్రైమ్ దారి పడితే పరిణామాలు దారుణంగా ఉంటాయి.
డిమాండ్ సప్లై సూత్రం!
సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్ల సప్లై ఎక్కువ.. డిమాండ్ మాత్రం పెద్దగా పెరగలేదు. కృతిమ మేథ వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ల అవసరం తగ్గిపోయింది. ఇదే కృతిమ మేథ రేపు డాక్టర్స్ డిమాండ్ ను కూడా తగ్గిస్తుంది.
మరో పక్క డిమాండ్ ఉంది కానీ తగినంత మంది అభ్యర్థులు లేరు.. ఇదిగో ఉద్యోగాల లిస్ట్
1 . కమర్షియల్ పైలట్
2 . సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్
3 . క్లౌడ్ కంప్యూటింగ్ స్పెషలిస్ట్
4 . డేటా సైంటిస్ట్
5 . కృతిమ మేథ నిపుణుడు
6 . ఎలక్ట్రిషియన్లు
7 . ప్లంబర్లు
8 . ఫిట్టర్
9 . ఆటో మొబైల్ టెక్నీషియన్
10 . స్టోన్ మేసన్
11 . కార్పెంటర్
12 . ఫిట్టర్
13 వెల్డర్
... ఇంతేనా ?
ఇంకా చాల ఉన్నాయి.
మీరు ఏదైనా హోటల్ కు వెళ్ళినప్పుడు బాగా గమనించండి .. అక్కడ రిసిప్షన్ లో... రెస్టారెంట్ లో పని చేస్తున్నవారు తెలుగు వారు కాదు .. ఎక్కువ మంది ఈశాన్య రాష్ట్రాల వారు. ఈ ట్రెండ్ పెద్ద నగరాలకే అనుకొన్నా.. రైల్వే కోడూరు లో బాలమిత్ర క్లాస్ ముగించుకొని రాజంపేట కు వెళ్ళాలి. దారిలో లంచ్ కోసం ఆగితే అక్కడ వెయిటర్ రాజస్థానీ యువ మహిళ. తెలుగు రాదు . హిందీ లో మాట్లాడడం నాకు సమస్య కాదనుకోండి . అది వేరే విషయం.
అమెరికా కల్చరే నాశనం చేసిందా..?
మనోళ్లందరూ అమెరికా పోయారు ... సరే .. బీహార్ రాజస్థాన్ వెస్ట్ బెంగాల్ రాష్టాలు లేకుంటే .. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణ రంగం ఎప్పుడో మూత బడుండేది . అవునా? కాదా? గమనించి తెలుకోండి .
ఈశాన్య రాష్ట్రాలు లేకుంటే హోటల్స్ రెస్టారెంట్లలో వెయిటర్ లు సర్వర్ లు ఉండేవారు కారు.
నూటికి తొంబై మందికి { 40 ప్లస్ వయస్సు ఏజ్ గ్రూప్ లో } ఇప్పుడు కీళ్ల సమస్య . కావాలి మస్సాజెర్లు . అది కూడా ఈశాన్య రాష్ట్రాల వారే.
కుక్స్ సంగతి అయితే చెప్పనక్కరలేదు. లక్ష ఇచ్చినా నెల రోజులు కాకుండానే ఉద్యోగం వదిలి వెళ్లిపోతున్నారు . లక్ష అనేది మీడియం స్థాయి.. స్టార్ హోటల్స్ లలో నాలుగైదు లక్షలు ఇచ్చినా దొరకడం లేదు.
ఈ పరిస్థితికి కారణాలు అనేకం..
1 . గుంపు మనస్తత్వం .
చాలామంది ట్రెండ్ ఫాలో అయిపోతారు. పక్కింటోడు .. ఇంజనీరింగ్ చేసి అమెరికా లో సెటిల్ అయ్యాడు. మన బిడ్డ కూడా అదే దారిలో పోవాల్సిందే.
2 . ఆధిపత్య ధోరణి .
వైట్ కాలర్ జాబ్ అంటే గొప్ప. కుక్, మసాజర్, ప్లంబర్, డ్రైవర్ అంటే చిన్న చూపు .
" పనోడు"" పనోడు" .. అని పనికి మాలినోళ్లు కించపరుస్తారు.
అలాంటి వారికి పెళ్లి కాదు .
ఇది ఉన్నత కులాల్లో.. చాలామంది ధోరణి .
దళిత కుల యువతపై ఇప్పుడిది ప్రభావం చూపుతోంది..." మనం తక్కువ స్థాయి పని ఎందుకు చెయ్యాలి?" అని వారు కూడా ఆలోచిస్తున్నారు.
పని సంస్కృతి - పనిని గౌరవించడం.
అమెరికా జపాన్ లాంటి దేశాల్లో బస్సు ట్రక్ డ్రైవర్ ల కు లభించే గౌరవం .. ఇక్కడ తీరు .. ఉత్తర దక్షిణ ధృవాలు.
అమెరికా లో మనోడు టాయిలెట్ కడిగినా ఫరవాలేదు. ఇక్కడ గొప్పలు చెప్పుకోవాలి. ఇక్కడ టాయిలెట్ కడిగిన వారిని చిన్న చూపు చూడాలి. ఈ ఆలోచనా ధోరణి మారేంత వరకు సమాజానికి సంక్షోభాలు తప్పవు.
చాల మటుకు వైట్ కాలర్ జాబ్స్ ను రోబో తినేస్తుంది . బతకాలంటే.. చాలామందికి ఇక పై బ్లూ కాలర్ జాబ్స్ మాత్రమే గతి. గొప్పలకు పోయి పస్తులుంటారా లేక పని సంస్కృతిని అలవరచుకొని హాయిగా కాలం గడుపుతారా?
తేల్చుకోవాల్సింది మనమే!
అతి వద్దు..
౩.సర్వత్రా అతి !
లక్షకు టిగ్గేదెలా!
మా బడిలో ఒక ఉద్యోగానికి మొన్న ఇంటర్వూస్ నిర్వహించాను . 20 మంది దాక హాజరయ్యారు. స్కిల్స్ ఆధారంగా ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేశాను. అందులో ఒక వ్యక్తి సాఫ్ట్ వెర్ ఇంజనీర్ ." ఎందుకు ఈ పోస్ట్ కోసం వచ్చారు ?" అని అడిగితే.. "ఉద్యోగం పోయి సంవత్సరం అయ్యింది . ఈ రంగం లో పరిస్థితి మీకు తెలుసు" అన్నాడు.
గతంలో జీతం లక్ష.
మా బడిలో ఆ పోస్ట్ కు జీతం రూ.45 వేలు . "యాభై దాక ఆఫర్ చెయ్యండి .. నా అంచనా ప్రకారం అతను ఒప్పుకోడు. లేకుంటే ఇదిగో ఈమె రెండో ఛాయస్ . 3rd ఛాయస్ ఈమె" అని మా ప్రిన్సిపాల్ కు సూచనలు ఇచ్చి ఇంటికి వచ్చాను . దారిలో వస్తుంటే మెసేజ్ .. మీరు చెప్పినట్లే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మన శాలరీ కి ఒప్పుకోలేదు రెండో కాండిడేట్ జాయిన్ అవుతోంది" అని.
పాపం .. ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను తప్పుపట్టలేను .
ఇరవై అయిదేళ్లుగా అధిక జీతానికి జనాలు అలవాటు పడ్డారు . ఒకప్పుడు{ 1980 s} బ్యాంకు ఆఫీసర్ జీతం వెయ్యి . "వామ్మో .. నెలకు వెయ్యి రూపాయిలా??? " అని నోరు వెళ్ళబెట్టే వారు.
సాఫ్ట్ వెర్ రంగం వచ్చింది. లక్ష .. ఎక్కువ మాట్లాడితే అయిదు... పది లక్షలు.
1990 s లో ..
21 వ ఏటనే IAS పరీక్ష లో అల్ ఇండియా నెంబర్ వన్ అయ్యి .. ముప్పై ఐదేళ్లు సర్వీస్ వెలగబెట్టిన చీఫ్ సెక్రటరీ తండ్రి కంటే .. కొడుకు / కూతురు ఫస్ట్ మంత్ శాలరీ .. డబుల్ .. ఎక్కువ మాట్లాడితే ట్రిపుల్ .
అదిగో అప్పుడే సమాజం గతితప్పింది !
1990 దాక ఉద్యోగాలంటే సాయంకాలం అయిదు .. మహా అంటే ఏడు వరకు .
మల్టీ నేషనల్ కంపెనీల రాకతో .. అర్ధ రాత్రి దాకా ఆఫీస్ .. ఇంటిలో కూడా ఆఫీస్ పని .. ఉద్యోగాలతో కాపురం ...
ఫామిలీ టైం చచ్చింది. కాపురాలు నాశనం.. విడాకులు ... ఇంఫెర్టిలిటీ..
పిలల్లు పుడితే వారితో గడిపేందుకు సమయం ఉండదు.
బోలెడంత జీతం .. క్రెడిట్ కార్డ్స్ .. పొదుపు అనే మాటే జాతి మరచింది. "ఈ రోజే ఎంజాయ్ చెయ్యాలి . రేపన్నది లేదు .. రాదు .." ఫ్రైడే ఈవెనింగ్ మొదలయి పోతుంది. పబ్ లో పూటుగా తాగాలి. అర్ధ రాత్రి దాక డాన్స్ సెయ్యాలి. శని ఆదివారాలు ఇంకా మస్తు .
తెగ తినడం .. తాగడం .. తినేది చెత్త ఫుడ్.. రోగాలొస్తే హెల్త్ ఇస్యూరెన్సు .. స్టార్ ఆసుపత్రులు ...
షాపింగ్ .. పెద్ద పెద్ద మాల్స్ .. ఫారిన్ బ్రాండ్స్. షూస్ వేలల్లో.. గడియారాలు లక్షల్లో..
సాఫ్ట్ వెర్ రంగంతో మొదలయిన అతి వినియోగ సంస్కృతి మొత్తం సమాజానికి పాకింది.
బతకడం కోసం పని .. ఈ ఆలోచన స్థానంలో... పని కోసం బతకాలి .. తినడం కోసం తాగడం కోసం బతకాలి ...బడాయి కోసం బతకాలి .. అనే కాన్సెప్ట్ వచ్చింది.
ఒక్క ముక్క లో చెప్పాలి అంటే అమెరికా యూరోప్ సంస్కృతి ఇక్కడికి వచ్చింది .
మొత్తం తగలబెట్టేసింది .
ఫండమెటల్స్ అంటూ ఒకటి ఏడుస్తాయి కదా ? దాన్ని మరిస్తే ఎలా ??
ఇప్పుడు అమెరికా .. ఇంగ్లాండ్ .. ఫ్రాన్స్ .. ఇంకా అనేక యూరోప్ దేశాలు పీకలోతు కష్టాల్లో .
అమెరికా మోడల్ మునిగింది .
కారణం అది ఫండమెంటల్స్ విస్మరించి గాలిలో కట్టిన మేడ!
చైనా వర్క్ కల్చర్ ను అలవర్చుకొండి
చైనా వాడు .. వాడి సిగ తరగా!
వాడుకున్నది ఎలాంటి ప్రభుత్వం అయినా కావొచ్చు .
కస్టపడి పని చేస్తున్నాడు .
కసితో పని చేస్తున్నాడు .
విజన్ తో పని చేస్తున్నాడు .
వాడి నరనరాన పని సంస్కృతి .. నాయకత్వ లక్షణాలు .
ప్రపంచాన్ని జయించాడు .
అమెరికా మోడల్... మనల్ని వారిలా తయారు చేసింది .. మంచి కన్నా చెడులో ..
అమెరికా వాడిలో ప్రొఫషనలిజం ఉంది. అది మనకు వచ్చిందా ? అబ్బే.. మంచిని గ్రహించం .
అమెరికా కు పోయినా కులం గజ్జి మానం. వాడి సంస్కృతి లోని .. నిజానికి ఇది వాడి పురాతన సంస్కృతి కాదు . ఈ గబ్బును{ అతి వినియోగ సంస్కృతి } వాడు కూడా ఇటీవలే అంటించుకొన్నాడు.. వాడికి అంటించారు ..
వాడినుంచి మనోళ్లు .
అమెరికా గబ్బు .. వారం లో ముంబై కి .. పది రోజుల్లో బెంగళూరు కు .. అటు పై మిగతా ప్రాంతాలకు ..
ఈ మోడల్ ను ఈ గబ్బును ఎంత త్వరగా వదులుకొని చైనా మోడల్ కు మనం షిఫ్ట్ అవుతామో అనేదాని పై మన భవిత ఆధారపడుతుంది .
చైనా మోడల్ అంటే నియంతృత్వం కాదు .
వాడిలో మంచి గ్రహించాలి .
మనలో మంచిని నిలుపుకోవాలి .
1 . ప్రజాస్వామ్యం .. బహుళ సంస్కృతి నిలుపుకోవాలి .. మరింత పటిష్టం చేసుకోవాలి .
2 . మన సంస్కృతి సంపద్రాయాల్లోని మంచిని కాపాడుకోవాలి .
3 . వివాహ కుటుంబ వ్యవస్థలు పటిష్టం కావాలి . లింగ సమానత్వం కావాలి . లింగ ద్వేషం మానాలి.
4 . హార్డ్ వర్క్... స్మార్ట్ వర్క్ అలవర్చుకోవాలి. పని దైవం .. పని చేసేవారు దేవతలు . పని విభజన ఉంటుంది . పని ఆధారంగా నేను ఎక్కువ నీవు తక్కువ అనే అహంభావం .. ఆధిపత్య ధోరణి పోవాలి . టీం స్పిరిట్ కావాలి .
5 . నాది ఈ కులం .. నీ కులం తక్కువ అనే భావన కాదు . అందరం భారతీయులు అనే భావన రావాలి . ఇది చైనా వారి బ్లడ్ లో ఉంది .
6 . విజన్ ఉండాలి. అడాప్టేషన్ స్కిల్స్ కావాలి . నిరంతర అధ్యయనం కావాలి . డిగ్రీ లకోసం మార్కుల కోసం కాకుండా నేర్చుకోవడం కోసం చదువు సాగాలి .
7 . ఇన్నోవేషన్ .. ఎంట్రెప్రేనేరికల్ స్కిల్స్ కావాలి . అవకాశాలను ఒడిసిపట్టుకోవాలి.
8 . పడినా లేవాలి . ఓటమి నుండి పాఠాలు నేర్వాలి .
9 . పొదుపు నేర్వాలి . సంపద కూడపెట్టాలి .
ప్రజాస్వామ్యం అనే ఒక్క విషయం లో తప్పించి మిగతా అన్ని విషయాల్లో చైనా వారు మనకంటే కాంతి మైళ్ళ దూరంలో ఉన్నారు. మనం రీల్స్ లో .. వివాదాల్లో మునిగి తేలుతూ ..
కనీసం ఇప్పుడు బాల్య దశలో ఉన్నవారినైనా నిలబెడదాము.
వారి బతుకులు నందనవనాలు చేద్దాము.

