MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • International
  • Venezuela: వెనిజువెలాపై అమెరికా ఎందుకు దాడి చేసింది.? దేశ అధ్య‌క్షుడిని ఎందుకు కిడ్నాప్ చేసింది

Venezuela: వెనిజువెలాపై అమెరికా ఎందుకు దాడి చేసింది.? దేశ అధ్య‌క్షుడిని ఎందుకు కిడ్నాప్ చేసింది

Venezuela: వెనిజువెలా దేశంపై అమెరికా దాడి చేయ‌డం యావత్ ప్రపంచాన్ని ఒక్క‌సారిగా షాక్‌కి గురి చేసింది. ఏకంగా ఆ దేశ అధ్య‌క్షుడిని. అత‌ని భార్య‌ను అరెస్ట్ చేయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇంత‌కీ ప‌రిణామాల వెన‌క ఉన్న అస‌లు కార‌ణాలు ఏంటంటే.? 

2 Min read
Author : Narender Vaitla
Published : Jan 04 2026, 09:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వెనిజువెలాపై అమెరికా మెరుపు సైనిక దాడి
Image Credit : Asianet News

వెనిజువెలాపై అమెరికా మెరుపు సైనిక దాడి

అమెరికా వెనిజువెలాపై చేప‌ట్టిన‌ భారీ సైనిక చర్య ప్ర‌పంచాన్ని ఉలిక్కి ప‌డేలా చేసింది. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత అమెరికా సైన్యం ఆకస్మికంగా బాంబుదాడులు ప్రారంభించింది. ‘ఆపరేషన్ అబ్జల్యూట్ రిజాల్వ్’ అనే కోడ్ నేమ్‌తో జరిగిన ఈ చర్యలు అతి తక్కువ సమయంలో పూర్తయ్యాయి. కరాకస్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర పేలుళ్లు చోటుచేసుకున్నాయి. సైనిక స్థావరాలు, కీలక భవనాలే లక్ష్యంగా దాడులు జరిగినట్లు సమాచారం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నికోలస్ మదురో అరెస్టు అంటూ ట్రంప్ ప్రకటన
Image Credit : X

నికోలస్ మదురో అరెస్టు అంటూ ట్రంప్ ప్రకటన

ఈ దాడుల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో కీలక ప్రకటన చేశారు. వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ కూడా అమెరికా సైన్యం నిర్బంధంలో ఉన్నారని తెలిపారు. మదురో దంపతులను యూఎస్ నేవీ యుద్ధ నౌక ద్వారా న్యూయార్క్‌కు తరలిస్తున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. కళ్లకు గంతలు కట్టి, బేడీలు వేసిన ఫోటోలను కూడా విడుదల చేయటం వివాదాస్పదంగా మారింది.

36
వెనిజువెలా రక్షణ మంత్రి తీవ్ర హెచ్చరిక
Image Credit : X

వెనిజువెలా రక్షణ మంత్రి తీవ్ర హెచ్చరిక

అమెరికా ప్రకటనలపై వెనిజువెలా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పడ్రినో స్పందించారు. విదేశీ సైనిక దళాల ఉనికిని వెనిజువెలా అంగీకరించబోదని స్పష్టం చేశారు. దేశ సార్వభౌమత్వంపై జరిగిన దాడిగా ఈ ఘటనను అభివర్ణించారు. పౌర ప్రాంతాలు కూడా దెబ్బతిన్నాయని, మృతులు గాయపడిన వారి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. చివరి శ్వాస వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు.

46
అస‌లేంటీ గొడ‌వ‌.?
Image Credit : X

అస‌లేంటీ గొడ‌వ‌.?

అమెరికాలోకి మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాలకు మదురోనే నాయకుడని ట్రంప్‌ చాలాకాలంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. మదురోపై మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలతో 2020లో న్యూయార్క్‌ దక్షిణ జిల్లాలో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆయన అమెరికాకు మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌దురోనే అమెరికా అదుపులోకి తీసుకుంది.

56
అంతర్జాతీయంగా తీవ్ర ప్రతిస్పందనలు
Image Credit : X

అంతర్జాతీయంగా తీవ్ర ప్రతిస్పందనలు

అమెరికా సైనిక చర్యపై పలు దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇరాన్ విదేశాంగ శాఖ ఈ దాడిని జాతీయ సార్వభౌమత్వంపై ఘోర ఉల్లంఘనగా పేర్కొంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరింది. క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగెజ్ ఈ దాడులను పిరికిపంద చర్యలుగా విమర్శించారు. చైనా, రష్యా, ఫ్రాన్స్, బొలీవియా, చిలీ కూడా ఖండన ప్రకటించగా అర్జెంటీనా మాత్రం అమెరికా చర్యలకు మద్ధతు తెలిపింది. భారత్‌లో CPI(M) పార్టీ కూడా ఈ దాడులను అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది.

66
వెనిజువెలా సైనిక బలం – అమెరికాతో తలపడగలదా?
Image Credit : X

వెనిజువెలా సైనిక బలం – అమెరికాతో తలపడగలదా?

వెనిజువెలా సైన్యాన్ని నేషనల్ బొలివేరియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (FANB)గా పిలుస్తారు. ఈ దళాలు ప్రధానంగా రక్షణ వ్యూహాలపై ఆధారపడి పనిచేస్తాయి. ప్రస్తుతం సుమారు 1.9 లక్షల మంది క్రియాశీల సైనికులు ఉన్నట్టు అంచనా. రిజర్వ్ బలగాలు, మిలీషియా దళాలు కలిపితే మొత్తం బలం దాదాపు 2.2 లక్షల వరకు ఉంటుందని నిపుణుల అభిప్రాయం. అయితే సాంకేతికత, వైమానిక శక్తి, నావికా బలం పరంగా అమెరికాతో పోలిస్తే వెనిజువెలా చాలా వెనుకబడి ఉంది. ఈ పరిస్థితుల్లో పూర్తి స్థాయి యుద్ధం మొదలైతే పరిణామాలు ఎలా ఉంటాయనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ప్రపంచం
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
డొనాల్డ్ ట్రంప్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
అమెరికాలో ఇళ్ల బయట జనం ఎందుకు కనిపించరు.? ఇంతకీ వాళ్లేం చేస్తుంటారు.?
Recommended image2
Trump Tariffs: రష్యా ఆయిల్ కొంటే భారత్‌పై 100% టారిఫ్? ట్రంప్ చేతికి డెడ్లీ వెపన్ ఇచ్చిన అమెరికా పార్లమెంట్
Recommended image3
అమెరికాను వ‌ణించిన 9/11 అటాక్‌.. అస‌లా రోజు ఏం జ‌రిగింది? టైమ్ టూ టైమ్ పూర్తి వివ‌రాలు
Related Stories
Recommended image1
తెలంగాణ‌లోని ఈ న‌గ‌రం మ‌రో హైద‌రాబాద్ కావ‌డం ఖాయం.. ఎయిర్‌పోర్ట్ స‌హా కీల‌క ప్రాజెక్టులు
Recommended image2
Zodiac sign: ఈ వారం 5 రాశుల వారికి అదృష్టం.. అప్పులు తీరుతాయి, కానీ మాటల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved