- Home
- Astrology
- Zodiac sign: ఈ వారం 5 రాశుల వారికి అదృష్టం.. అప్పులు తీరుతాయి, కానీ మాటల్లో జాగ్రత్త అవసరం
Zodiac sign: ఈ వారం 5 రాశుల వారికి అదృష్టం.. అప్పులు తీరుతాయి, కానీ మాటల్లో జాగ్రత్త అవసరం
Zodiac sign: కొత్త ఏడాదిలో మొదటి వారం మొదలైంది. జనవరి 4 నుంచి 11వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రానుందని పండితులు చెబుతున్నారు. ఇంతకీ వారం ఏయే రాశుల వారికి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం.

కుంభ రాశి: ఏలిన్నాటి శని ఉన్నా
ఏలిన్నాటి శని ప్రభావం కొనసాగుతున్నా, ఇతర గ్రహాల అనుకూలత వల్ల కుంభ రాశి వారికి ఈ వారం ఉత్సాహంగా గడుస్తుంది. అనుకోని శుభ పరిణామాలు మనోధైర్యాన్ని పెంచుతాయి. ఉద్యోగాల్లో ఉన్నవారికి పై అధికారుల సపోర్ట్ లభిస్తుంది. కీలక నిర్ణయాల్లో కుటుంబ సహకారం బలంగా ఉంటుంది. ఆస్తి సంబంధిత విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. వైద్య, న్యాయ రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు దక్కే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు స్థిరంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆనందకరమైన సమాచారం వస్తుంది. రావని అనుకున్న ధనం చేతికి అందే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో వేగం పెంచుతారు. ప్రేమ సంబంధాలు ఉత్సాహాన్ని ఇస్తాయి.
వృశ్చిక రాశి వారికి ఆర్థిక స్థిరత్వం
ధన స్థానంలో అనేక గ్రహాల ప్రభావం ఆదాయాన్ని పెంచే దిశగా పనిచేస్తుంది. ఖర్చులపై ఒత్తిడి తగ్గి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి పరంగా మంచి మార్పులు కనిపిస్తాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు నెమ్మదిగా అయినా భద్రంగా అభివృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు అనుకూలమైన అవకాశం కనిపించే సూచనలు ఉన్నాయి. మాటల్లో తొందరపాటు కుటుంబ వాతావరణాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. వ్యక్తిగత విషయం ఒకటి కొంత ఆందోళన కలిగించవచ్చు. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. విద్యార్థులకు కష్టం తప్పదు, కాని ఫలితం దక్కుతుంది. ప్రేమ వ్యవహారాలు ప్రశాంతంగా కొనసాగుతాయి.
తుల రాశి వారికి అదృష్ట సమయం
ఈ వారం తుల రాశి వారికి అదృష్టం కలిసి వచ్చే సమయం. ఆదాయం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. అనుకున్న పనులు ఆలస్యం లేకుండా పూర్తవుతాయి. ఉద్యోగ రంగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాల దిశగా అడుగులు పడతాయి. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహా ఉపయోగపడుతుంది. ప్రయాణాలు లాభాన్ని ఇస్తాయి. సహోదరులతో ఉన్న ఆస్తి వివాదం పరిష్కార దశకు చేరుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ యత్నాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. కొందరు మిత్రుల వల్ల తప్పుదారి తొక్కే ప్రమాదం ఉంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. విద్యార్థులు తక్కువ శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది.
సింహ రాశి వారికి వరుస విజయాలు
ఈ వారం విజయాలు వరుసగా కనిపిస్తాయి. అనుకున్న లక్ష్యాలు సులభంగా చేరుతారు. ఆశించిన సమాచారం అందుకుని ఆనందిస్తారు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. దూర ప్రాంత బంధువుల దగ్గర శుభకార్యం ఖరారు కావచ్చు. ఆదాయానికి లోటు ఉండదు. ఆర్థికంగా అదృష్టం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. సమాజానికి ఉపయోగపడే పనుల్లో పాల్గొంటారు. ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. బంధువులతో మాటల ఘర్షణకు అవకాశం ఉంది. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు తక్కువ ప్రయత్నంతోనే ముందంజ వేస్తారు. ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి.
మేష రాశి వారికి అనుకూలత
గ్రహాల అనుకూలత వల్ల ఈ వారం శుభవార్తలు వరుసగా అందుతాయి. పనులన్నీ అనుకున్న దిశగా సాగుతాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు సాధించే అవకాశం ఉంది. పని ఒత్తిడి ఎక్కువైనా ఫలితం సంతృప్తినిస్తుంది. ఇంటా బయటా మీ నిర్ణయాలకు గౌరవం లభిస్తుంది. ఆదాయ వృద్ధికి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారంతో కీలక విషయాలు సాఫీగా పరిష్కారమవుతాయి. ఆస్తి సంబంధిత లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ జీవితం సంతృప్తిని ఇస్తుంది.
గమనిక: ఈ విషయాలను ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం, పలువురు పండితులు తెలిపిన విషయాలు ఆధారంగా అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించాలి. అలాగే వ్యక్తిగత జాతకం ఆధారంగా ఫలితాలు మారుతుంటాయని గుర్తించాలి.

