Unsafe Cities ఈ నగరాలు చాలా డేంజర్ గురూ! ఎవరికైనా గుండెలదరాల్సిందే!!
మోస్ట్ డేంజరస్: ఏవైనా నగరాల గురించి చెబితే అక్కడి వింతలు, విశేషాలు గుర్తొస్తాయి. ఆ దేశానికి ఎంత జీడీపీ అందిస్తున్నాయి అని ఆరా తీస్తుంటాం. కానీ కొన్ని నగరాలు భిన్నం. ఇప్పుడు చెప్పబోయే నగరాలు అయితే చాలా ప్రమాదకరం. నేరాలు, హింస, రాజకీయ అస్థిరత్వం ఈ నగరాలను నివసించడానికి అసురక్షితంగా మార్చేశాయి.

టిజువానా, మెక్సికో
టిజువానా, మెక్సికో దేశంలో ఉంది. ఇక్కడ హత్యలు చాలా ఎక్కువ జరుగుతాయి. ఈ నగరం డ్రగ్స్ స్మగ్లింగ్, గ్యాంగ్ వార్లకు ఫేమస్.
కరాకాస్, వెనిజులా
రాజకీయ, ఆర్థిక సంక్షోభం, నేరాల రేటు ఈ నగరాన్ని అసురక్షితంగా చేస్తాయి. ఈ నగరంలో కిడ్నాప్‌లు, దోపిడీలు ఎక్కువగా జరుగుతాయి.

పోర్ట్-ఓ-ప్రిన్స్, హైతీ
పేదరికం, గ్యాంగ్ పోరాటాల వల్ల పోర్ట్-ఓ-ప్రిన్స్ చాలా ప్రమాదకరంగా మారింది. ఇక్కడ దోపిడీలు, కిడ్నాప్‌లు చాలా కామన్.
కేప్ టౌన్, సౌత్ ఆఫ్రికా
ఇక్కడ హింసాత్మక నేరాలు, గ్యాంగ్ వార్‌లు, దొంగతనాలు క్షణానికొకటి అన్నట్టుగా జరుగుతాయి.
సియుడాడ్ జువా, మెక్సికో
ఈ నగరం నేరాలు, కిడ్నాప్‌లు, హత్యలకు ఫేమస్.

సెయింట్ లూయిస్, యూఎస్ఏ
అమెరికాలో డేంజర్ సిటీ సెయింట్ లూయిస్. ఇక్కడ హత్యలు, హింసాత్మక నేరాలు చాలా జరుగుతాయి. అందుకే అక్కడ జనాభా తక్కువ.
శాన్ పెడ్రో సులా, హోండురాస్
శాన్ పెడ్రో సులా ఉత్తర హోండురాస్‌లో ఉంది. ఇది రాజధాని టెగుసిగల్పా తర్వాత హోండురాస్‌లో రెండో అతిపెద్ద నగరం. హత్యలు, దోపిడీలు ఇక్కడ కామన్.

కింగ్‌స్టన్, జమైకా
హింస, పేదరికం వల్ల కింగ్‌స్టన్‌లో కరేబియన్‌లోనే ఎక్కువ నేరాలు జరుగుతాయి. ఇది డేంజర్ ప్లేసుల్లో ఒకటి.
కాబుల్, ఆఫ్ఘనిస్తాన్
చాలా ఏళ్ల పోరాటం వల్ల కాబుల్ టెర్రరిస్ట్ దాడులు, కిడ్నాప్‌లకు గురవుతోంది. తీవ్రవాదం వేళ్లూనుకుపోయింది ఇక్కడ.
ఫోర్టలేజా, బ్రెజిల్
నేరాలు, హత్యల రేటు వల్ల ఇది బ్రెజిల్‌లోని డేంజర్ నగరాల్లో ఒకటి.