- Home
- International
- Rules: అక్కడ బీచ్‌లోని ఇసుక తీసుకెళ్తే, బికినీలో తిరిగితే నేరం.. ఇంతకీ ఎక్కడో తెలుసా.?
Rules: అక్కడ బీచ్‌లోని ఇసుక తీసుకెళ్తే, బికినీలో తిరిగితే నేరం.. ఇంతకీ ఎక్కడో తెలుసా.?
Rules: న్యాయం, చట్టాలు ఒక్కో ప్రాంతానికి ఒక్కోలా మారుతుంటాయి. ఓ ప్రాంతంతో నేరం మరో ప్రాంతంలో నేరం కాదు. అలాంటి కొన్ని వింత చట్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

యూరప్ దేశాల్లో పర్యాటకులకు వింత నిబంధనలు
విదేశీ టూర్ అనగానే స్వేచ్ఛ, బీచ్‌లు, పార్టీలు ముందుగా గుర్తొస్తాయి. కానీ యూరప్‌లోని కొన్ని దేశాల్లో మాత్రం పర్యాటకులు తప్పనిసరిగా నిబంధనలు తెలుసుకుని వెళ్లాలి. లేనిపక్షంలో భారీ జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. బికినీ వేసుకుని వీధుల్లో తిరిగినా, చెప్పులతో వాహనం నడిపినా ఫైన్ పడే పరిస్థితి అక్కడ ఉంది.
పెరుగుతున్న పర్యాటకం..
ఇటీవలి కాలంలో యూరప్ దేశాల్లో పర్యాటకం భారీగా పెరిగింది. వేసవి కాలంలో చిన్న నగరాలు, దీవులు లక్షలాది మంది టూరిస్టులతో నిండిపోతున్నాయి. దీంతో స్థానికుల జీవితం ఇబ్బందిగా మారుతోంది. శబ్ద కాలుష్యం, చెత్త, అసభ్య ప్రవర్తన పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. అందుకే నగరాల గౌరవం, సంస్కృతి కాపాడేందుకు కఠిన నిబంధనలు తీసుకొచ్చారు.
బీచ్ వరకే బికినీ పరిమితం
స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, క్రోయేషియా వంటి దేశాల్లో బికినీ లేదా స్విమ్‌సూట్ బీచ్‌లో మాత్రమే ధరించాలి. బార్సిలోనా, వెనిస్, కాన్స్, స్ప్లిట్ లాంటి నగరాల్లో వీధుల్లో బికినీతో తిరిగితే భారీ జరిమానా విధిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ జరిమానా లక్ష రూపాయలకు మించి ఉంటుంది. ప్రజలు ఉండే ప్రదేశాల్లో మర్యాద పాటించాలన్నదే ఈ నిబంధన ఉద్దేశం.
చెప్పులతో డ్రైవింగ్ చేస్తే ఫైన్
యూరప్ దేశాల్లో డ్రైవింగ్ చాలా బాధ్యతాయుతమైన విషయం. స్పెయిన్, గ్రీస్, ఇటలీ, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో చెప్పులు లేదా ఫ్లిప్‌ఫ్లాప్ వేసుకుని వాహనం నడపడం నేరం. చెప్పులు జారిపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇలా డ్రైవ్ చేస్తే 25 వేల నుంచి 30 వేల రూపాయల వరకు జరిమానా పడుతుంది. ఈ నిబంధన స్థానికులకు, పర్యాటకులకు సమానంగా వర్తిస్తుంది.
ఆల్కహాల్, శబ్దం, ప్రకృతి నష్టం
మాలోర్కా, ఇబిజా వంటి పార్టీ ప్రాంతాల్లో రోడ్లపై ఆల్కహాల్ సేవించడం నిషేధం. బహిరంగ ప్రదేశాల్లో ఆల్కహాల్ తాగితే లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తారు. అలాగే స్విమ్మింగ్ పూల్ దగ్గర కుర్చీలను టవల్స్‌తో ఎక్కువసేపు రిజర్వ్ చేయడం కూడా నేరమే. గ్రీక్ దేశాల్లో బీచ్‌ల నుంచి షెల్స్, ఇసుక తీసుకెళ్లినా శిక్ష ఉంటుంది. వెనిస్ కాలువల్లో ఈత కొట్టడం పూర్తిగా నిషేధం.

